Telangana

News June 2, 2024

HYD: ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న రాచకొండ కమిషనర్

image

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి HYD నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కార్యాలయంలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల పోరాటాలు, ఆకాంక్షలకు అనుగుణంగా స్వరాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ప్రత్యేక రాష్ర్ట పోరాటాన్ని తాను స్వయంగా చూశానని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసుశాఖలో ఎన్నో నూతన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.

News June 2, 2024

అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు నివాళులు

image

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర వీరులను స్మరిస్తూ సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమర వీరుల స్థూపానికి హరీష్ రావు నివాళులర్పించారు.

News June 2, 2024

నిజామాబాద్‌లో బెంబేలెత్తిస్తున్న కూరగాయల ధరలు

image

సామాన్యుడికి నిత్యావసరమైన కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. నిజామాబాద్‌లో గత వారం పది రోజులు నుంచి కూరగాయల ధరలు క్రమంగా పెరగడంతో సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. మిర్చి కిలో రూ.100, వంకాయలు, టమాటాలు కేజీ రూ.50 పైన పలుకుతున్నాయి. కూరగాయల రేట్లు సైతం మంట పుట్టిస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News June 2, 2024

వేయి స్తంభాల ఆలయంలో వంటలక్క

image

ప్రముఖ సీరియల్ నటి, బుల్లితెరలో పాపులర్ అయిన కార్తీకదీపం నటి ప్రేమీ విశ్వనాథ్ (వంటలక్క) ఈరోజు హనుమకొండ నగరంలో సందడి చేశారు. నేడు హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రుద్రేశ్వర స్వామిని ఆమె దర్శించుకొని పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతో పలువురు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.

News June 2, 2024

ఖమ్మంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

image

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఖమ్మంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో బాగంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ కలెక్టరేట్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్దిని కలెక్టర్ వివరించారు. అన్ని రంగాలలో జిల్లా అభివృద్ది పథంలో నడుస్తుందని పేర్కొన్నారు. ఈక్రమంలో ఏర్పాటు చేసిన పలు సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

News June 2, 2024

WGL: CPAC సర్వే.. BRS గెలుపు!

image

వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో BRS గెలుస్తుందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. అలాగే ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో BRS 11, BJP 2, కాంగ్రెస్, ఎంఐఎం చెరొకటి గెలుస్తాయని అంచనా వేసింది. భువనగిరిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, బీఆర్ఎస్‌కు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని సీపాక్ తెలిపింది.

News June 2, 2024

SR మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ప్లేస్మెంట్ సక్సెస్ మీట్

image

హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో SR మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల ఛైర్మన్ వరదారెడ్డి, కాగ్నిజెంట్ టెక్నాలజీ HR మేనేజర్ జితేందర్, ప్రిన్సిపల్ రాజశ్రీరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జితేందర్ మాట్లాడుతూ.. విద్యార్థులు లాజికల్ స్కిల్స్ ఉపయోగించి కోడింగ్ సరళిలో మార్పులు తీసుకురావాలన్నారు. 

News June 2, 2024

RR: ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇలా జరగనుంది..!

image

✓జూన్ 4న ఉ.4 గంటలకు పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూములను తెరుస్తారు
✓ఉ.5:30 నుంచి 6 వరకు టేబుల్స్ కేటాయింపు రాండమైజేషన్
✓మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
✓ఉదయం 8 గంటలకు EVM ఓట్ల లెక్కింపు
✓ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు
✓ HYD, RR, MDCL,VKB జిల్లాల్లో సర్వం సిద్ధమైంది
•పై వివరాలను RR కలెక్టర్ శశాంక తెలిపారు.

News June 2, 2024

నల్గొండలో తెలంగాణ అవతరణ దినోత్సవం

image

నల్లగొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందన దీప్తికి గౌరవందనం సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన జెండాను ఎగరవేశారు.

News June 2, 2024

దౌల్తాబాద్: మహిళ ఆత్మహత్య

image

దౌల్తాబాద్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి (39) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహేశ్వరి వివాహం తొగుట లక్ష్మణ్ తో జరగ్గా, కుమారుడు హర్షవర్ధన్ జన్మించాడు. ఫిట్స్ వ్యాధి‌తో బాధపడుతున్న మహేశ్వరి కొడుకు భవిష్యత్తు గురించి మదన పడుతూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.