Telangana

News June 2, 2024

ఖమ్మం: రాజధాని చార్జీలకే లహరి బస్సులో ప్రయాణం

image

రాజధాని ఏసీ బస్సు చార్జీలతో లహరి బస్సులో ప్రయాణించవచ్చని, బెర్త్‌కు అదనపు చార్జి ఉంటుందని ఖమ్మం రీజినల్ మేనేజర్ సిహెచ్ వెంకన్న తెలిపారు. అలాగే లహరి నాన్ ఏసీ బస్సులో సీటు చార్జీలు సూపర్ లగ్జరీకి సమానంగా ఉంటాయని ప్రకటించారు. ఖమ్మం రీజియన్ పరిధిలో ఖమ్మం, సత్తుపల్లి, మణుగూరు, కొత్తగూడెం, పాల్వంచ బస్టాండ్ల నుంచి మియాపూర్, విశాఖపట్నం, బెంగళూరుకు లహరి బస్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

News June 2, 2024

MBNR: ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 1439 ఓటర్లు ఉండగా అందులో 1437 ఓట్లు పోలయ్యాయి. జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి నవీన్‌కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి మన్నె జీవన్‌రెడ్డి పోటీ చేశారు. ఈ ఫలితాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.

News June 2, 2024

మహబూబ్ నగర్ జిల్లాలోని నేటి ముఖ్యంశాలు

image

✓ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు.
✓ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పక్కకు భారీ భద్రత ఏర్పాట్లు.
✓ ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ సమాయత్తం: జిల్లా విద్యాధికారి.
✓ పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షా నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు: జిల్లా అదనపు కలెక్టర్.
✓ బడిబాట కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు సన్నద్ధం.

News June 2, 2024

సీపాక్ సర్వే.. ‘కరీంనగర్, పెద్దపల్లిలో BRS గెలుస్తుంది!’

image

కరీంనగర్, పెద్దపల్లిలో బీఆర్ఎస్ గెలుస్తుందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో బీఆర్ఎస్‌కు 11, బీజేపీకి 2, కాంగ్రెస్, ఎంఐఎం చెరో స్థానంలో గెలుస్తాయని అంచనా వేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, బీఆర్ఎస్‌కు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని సీపాక్ తెలిపింది. కాగా కరీంనగర్లో బీజేపీ, పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుస్తుందని మెజారిటీ సర్వేల్లో వెల్లడైంది.

News June 2, 2024

నల్గొండ: CPAC సర్వే.. BRS గెలుపు!

image

వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో BRS గెలుస్తుందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. అలాగే ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో BRS 11, BJP 2, కాంగ్రెస్, ఎంఐఎం చెరొకటి గెలుస్తాయని అంచనా వేసింది. భువనగిరిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, బీఆర్ఎస్‌కు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని సీపాక్ తెలిపింది.

News June 2, 2024

CPAC సర్వే.. ఖమ్మంలో BRS గెలుపు!

image

ఖమ్మం లోక్‌సభ స్థానంలో బీఆర్ఎస్ గెలుస్తుందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో బీఆర్ఎస్‌కు 11, బీజేపీకి 2, కాంగ్రెస్, ఎంఐఎం చెరో స్థానంలో గెలుస్తాయని అంచనా వేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, బీఆర్ఎస్‌కు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని సీపాక్ తెలిపింది. కాగా మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తోందని అంచనా వేశాయి.

News June 2, 2024

CPAC సర్వే: సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరిలో BRS గెలుపు!

image

సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరిలో BRS గెలుస్తుందని CPAC ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. TGలో BRSకు 11, BJPకి 2, కాంగ్రెస్, MIM చెరో స్థానంలో గెలుస్తాయని అంచనావేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, BRSకు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని CPAC తెలిపింది. కాగా ఈ స్థానాల్లో కొన్ని బీజేపీ, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేయగా.. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

News June 2, 2024

CPAC సర్వే: సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరిలో BRS గెలుపు!

image

సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరిలో BRS గెలుస్తుందని CPAC ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. TGలో BRSకు 11, BJPకి 2, కాంగ్రెస్, MIM చెరో స్థానంలో గెలుస్తాయని అంచనా వేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, BRSకు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని CPAC తెలిపింది. కాగా ఈ స్థానాల్లో కొన్ని బీజేపీ, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేయగా.. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

News June 2, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
∆} పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

News June 2, 2024

సీపాక్ సర్వే: ‘మెదక్ జహీరాబాద్‌లో BRS గెలుస్తుంది!’

image

మెదక్, జహీరాబాద్‌లో బీఆర్ఎస్ గెలుస్తుందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో బీఆర్ఎస్‌కు 11, బీజేపీకి 2, కాంగ్రెస్, ఎంఐఎం చెరొకటి గెలుస్తాయని అంచనావేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, బీఆర్ఎస్‌కు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని సీపాక్ తెలిపింది. కాగా ఈ రెండుస్థానాల్లో కొన్ని బీజేపీ, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేయగా ఉత్కంఠ నెలకొంది.