Telangana

News June 2, 2024

WGL: ప్రేమ పేరుతో మోసం చేశాడు..

image

ప్రేమ పేరుతో గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన రాయపర్తిలో జరిగింది. యువతి తండ్రి కథనం ప్రకారం.. పెర్కవేడుకు చెందిన రాంబాబు పెద్ద కుమార్తె నర్మద, రాయపర్తికి చెందిన నరేశ్‌ కొన్నేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. నరేశ్ పెళ్లికి నిరాకరిస్తుండడంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం MPDO ఆఫీస్ ఆవరణలో పురుగుల మందు తాగింది. వెంటనే నర్మదను ఎంజీఎంకు తరలించారు.

News June 2, 2024

సీపాక్ సర్వే: ‘జహీరాబాద్‌లో BRS గెలుస్తుంది!’

image

జహీరాబాద్‌లో బీఆర్ఎస్ గెలుస్తుందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో బీఆర్ఎస్‌కు 11, బీజేపీకి 2, కాంగ్రెస్, ఎంఐఎం చెరో స్థానంలో గెలుస్తాయని అంచనా వేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, బీఆర్ఎస్‌కు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని సీపాక్ తెలిపింది. కాగా జహీరాబాద్‌లో కొన్ని బీజేపీ, మరి కొన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేయగా.. ఉత్కంఠ నెలకొంది.

News June 2, 2024

రాష్ట్రం ఏర్పాట్లు, పదేళ్లలో ఖమ్మం ఇలా..

image

రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్లలో ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ప్రత్యేక ముద్ర వేస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రారంభమై, పూర్తయిన తొలి సాగు నీటి ప్రాజెక్టుగా భక్త రామదాసు రికార్డు చరిత్ర లిఖించింది. భద్రాచలం ఐటీడీఏలో ఉన్న మండలాల్లో మిషన్ భగీరథ ద్వారా తాగు నీటి సమస్య తీరింది. జిల్లాలో 161 పల్లె , 9 బస్తీ దవాఖానాలు, 210 PHCల ద్వారా వైద్యం అందుతోంది. పామాయిల్ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగుమం అవుతోంది.

News June 2, 2024

HYD: 4న మద్యం దుకాణాలు బంద్

image

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నెల 4న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసేయాలని సీపీ అవినాశ్ మహంతి ప్రకటన జారీ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలోని కొన్ని మినహా అన్ని మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసేయాలని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 5న ఉదయం 6 గంటల వరకు బంద్ కొనసాగుతుందని చెప్పారు. మరో వైపు నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

News June 2, 2024

HYD: 4న మద్యం దుకాణాలు బంద్

image

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నెల 4న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసేయాలని సీపీ అవినాశ్ మహంతి ప్రకటన జారీ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలోని కొన్ని మినహా అన్ని మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసేయాలని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 5న ఉదయం 6 గంటల వరకు బంద్ కొనసాగుతుందని చెప్పారు. మరో వైపు నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

News June 2, 2024

బంగారంతో చిన్న సైజులో T-20 ప్రపంచకప్ 

image

ఈనెల 2 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ స్వర్ణకారుడు బంగారంతో సూక్ష్మసైజులో T-20 ప్రపంచకప్‌ను రూపొందించి అబ్బురపరిచాడు. భువనగిరికి చెందిన చొల్లేటి శ్రీనివాసచారి బంగారం, వెండితో సూక్ష్మసైజులో వివిధ రకాల వస్తువులు తయారు చేయడంలో ప్రావీణ్యుడు. గతంలో క్రికెట్ స్టేడియం, పార్లమెంట్ భవనం, పీసా టవర్, హరితహారం, ICC కప్, బంగారు బతుకమ్మ, వరల్డ్ కప్ తయారు చేశాడు.

News June 2, 2024

KNR: ఉద్యమ జ్ఞాపకాల్లో పోరుగడ్డ

image

స్వరాష్ట్ర సాధనలో ఉమ్మడి కరీంనగర్ కీలక పాత్ర పోషించింది. 2009 నవంబర్‌ 29‌న కేసీఆర్‌ ఇక్కడి నుంచి ‌మొదలు పెట్టిన ఆమరణ దీక్ష మలి దశ ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచింది. 2004లో అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన సభలోనే సోనియాగాంధీ తెలంగాణ ఆకాంక్షను నెరవేరుస్తామన్నారు. సుల్తానాబాద్ చౌరస్తాలో మహాదీపాన్ని దాదాపు 1600 రోజులపాటు వెలిగించి ఉద్యమ ఆకాంక్షను చాటారు.

News June 2, 2024

విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్న మెదక్ కలెక్టరేట్ 

image

మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ముస్తాబైంది. ఈసందర్భంగా కలక్టరేట్‌ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. విద్యుత్ కాంతుల్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

News June 2, 2024

ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ పరీక్షల టైం టేబుల్

image

కాకతీయ విశ్వవిద్యాలయ MA, M.Com, M.Sc 2nd year (2nd semester) M.Sc. 5సం. ఇంటిగ్రేటెడ్ (కెమిస్ట్రీ) 6వ సెమిస్టర్ టైం టేబుల్ ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సౌజన్య విడుదల చేశారు. జూన్ 11న మొదటి పేపర్, 13న రెండో పేపర్, 15న మూడవ పేపర్, 18న నాల్గో పేపర్, 20న ఐదో పేపర్, 22న ఆరో పేపర్ జరుగుతాయని, మ. 2 గంటల నుంచి 5 గం.వరకు ఉంటుందన్నారు.

News June 2, 2024

HYDలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!

image

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా జూన్ 2న HYDలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్యాట్నీ క్రాస్ రోడ్ నుంచి స్వీకర్ ఉపకార్ వరకు.. పరేడ్ గ్రౌండ్ రోడ్డులో టివోలీ క్రాస్ రోడ్డు వరకు..అక్కడి నుంచి బ్రోక్ బ్యాండ్ క్రాస్ రోడ్డు వరకు.. CTOనుంచి YMCAక్రాస్ రోడ్డు, సెయింట్ జాన్ రోటరీ మార్గంలో వాహనాలను అనుమతించబోమన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలన్నారు.