Telangana

News June 1, 2024

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన నృత్య ప్రదర్శనలు

image

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా HYD మాదాపూర్‌లోని శిల్పారామంలో శనివారం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. కుమారి ప్రణవి తుమ్మటి వారి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహుతులను ఎంతో ఆకట్టుకుంది. నగరవాసులు పెద్ద ఎత్తున శిల్పారామానికి విచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు.

News June 1, 2024

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన నృత్య ప్రదర్శనలు 

image

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా HYD మాదాపూర్‌లోని శిల్పారామంలో శనివారం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. కుమారి ప్రణవి తుమ్మటి వారి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహుతులను ఎంతో ఆకట్టుకుంది. నగరవాసులు పెద్ద ఎత్తున శిల్పారామానికి విచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు.

News June 1, 2024

PL SURVEY: మహబూబ్‌నగర్‌లో BJP, నాగర్‌కర్నూల్‌లో BRS..!

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో BJP, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానంలో BRS గెలుస్తాయని పొలిటికల్ ల్యాబొరేటరీ (PL) సర్వే అంచనా వేసింది. మహబూబ్‌నగర్‌లో BRS నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, BJP నుంచి డీకే అరుణ పోటీ చేశారు. ఇక నాగర్‌కర్నూల్‌లో BRS నుంచి RS ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, BJP నుంచిభరత్ ప్రసాద్ పోటీలో ఉన్నారు.

News June 1, 2024

చాణక్య X సర్వే: మెదక్‌లో టఫ్ ఫైట్..!

image

మెదక్ పార్లమెంట్ స్థానంలో టఫ్ ఫైట్ ఉందని చాణక్య X సర్వే అంచనా వేసింది. ఇక్కడ BJP నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు, BRS నుంచి వెంకట్రామ్ రెడ్డి పోటీలో ఉన్నారు. కాగా ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి పోటాపోటీ ఉంటుందని చాణుక్య x సర్వే అంచనా వేసింది. ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎంత మెజార్టీ వస్తుందని ఆసక్తి నెలకొంది. దీనిపై మీ కామెంట్?

News June 1, 2024

చాణక్య X SURVEY: పెద్దపల్లి కాంగ్రెస్‌దే..!

image

పెద్దపల్లి పార్లమెంట్ స్థానం కాంగ్రెస్‌దే అని చాణక్య X సర్వే అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ పోటీ చేశారు. BJP నుంచి గోమాస శ్రీనివాస్, BRS నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీలో ఉన్నారు. కాగా తొలుత కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

News June 1, 2024

PL SURVEY : ఆదిలాబాద్ టఫ్, పెద్దపల్లి కాంగ్రెస్‌దే!

image

పెద్దపల్లి ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌దే గెలుపని పొలిటికల్ ల్యాబరేటరీ (PL) సర్వే తెలిపింది. అయితే ఆదిలాబాద్ స్థానంలో టఫ్ ఫైట్ ఉండనుందని ఆ సర్వే పేర్కొంది. ADB నియోజకవర్గంలో బీజేపీ నుంచి గొడం నగేశ్, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. పెద్దపల్లి స్థానంలో కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు.

News June 1, 2024

PL SURVEY : నిజామాబాద్‌లో బీజేపీ, జహీరాబాద్‌లో టఫ్

image

నిజామాబాద్‌లో బీజేపీ విజయం సాధించనుందని పోలిటికల్ ల్యాబరేటరీ (PL) సర్వే తేల్చింది. అయితే జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో టఫ్ ఫైట్ ఉండనుందని తెలిపింది. నిజామాబాద్‌లో BRSనుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌, కాంగ్రెస్ నుంచి టి.జీవన్‌రెడ్డి, BJP నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేశారు. ఇక జహీరాబాద్‌లో BRS నుంచి గాలి అనిల్‌కుమార్, కాంగ్రెస్ నుంచి సురేశ్‌షెట్కార్, BJP నుంచి బీబీపాటిల్ పోటీలో ఉన్నారు.

News June 1, 2024

చాణక్య X SURVEY: మహబూబాబాద్ కాంగ్రెస్‌దే..!

image

మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్‌దే అని చాణక్య X సర్వే అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ పోటీ చేశారు. BJP నుంచి అజ్మీరా సీతారాం నాయక్, BRS నుంచి మాలోతు కవిత పోటీలో ఉన్నారు. కాగా తొలుత కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

News June 1, 2024

చాణక్య X SURVEY: మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌దే..!

image

మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్‌దే అని చాణక్య X సర్వే అంచనా వేసింది. మహబూబ్‌నగర్‌లో BRS నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ వంశీచంద్ రెడ్డి, BJP నుంచి డీకే అరుణ పోటీ చేశారు. ఇక నాగర్‌కర్నూల్‌లో BRS నుంచి RS ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, BJP నుంచిభరత్ ప్రసాద్ పోటీలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారని సర్వే అంచనా వేసింది.

News June 1, 2024

CHANAKYA X SURVEY: సికింద్రాబాద్‌లో నువ్వానేనా!

image

HYDలో MIM అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ, చేవెళ్లలో BJP అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరిలో BJP అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని చాణక్య X సర్వే తేల్చి చెప్పింది. ఇక సికింద్రాబాద్‌లో మాత్రం BRS అభ్యర్థి పద్మారావు గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, BJP అభ్యర్థి కిషన్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉందని అంచనా వేసింది. ఇక్కడ ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.