Telangana

News June 1, 2024

ప్రమాదంలో చిలకలగూడ పోలీస్ స్టేషన్

image

చిలకలగూడ పోలీస్ స్టేషన్​ భవనం శిథిలావస్థకు చేరుకుంది. సెల్లార్‌తో పాటు పిల్లర్లు, స్లాబ్​, కిటికీల పెచ్చులు ఊడి కింద పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. PS భవనం ఎప్పుడు కుప్ప కూలుతుందోనని అటు పోలీస్​ సిబ్బంది, ఇటు సందర్శకులు బిక్కు, బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. భవనం ఖాళీ చేయాలని GHMC పలుమార్లు నోటీసులిచ్చినా ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం.

News June 1, 2024

ఆరా మస్తాన్ SURVEY: పెద్దపల్లి కాంగ్రెస్‌దే..!

image

పెద్దపల్లి పార్లమెంట్ స్థానం కాంగ్రెస్‌దే అని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ పోటీ చేశారు. BJP నుంచి గోమాస శ్రీనివాస్, BRS నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీలో ఉన్నారు. కాగా తొలుత కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

News June 1, 2024

ఆరా మస్తాన్ SURVEY: మహబూబాబాద్ కాంగ్రెస్‌దే..!

image

మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్‌దే అని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ పోటీ చేశారు. BJP నుంచి అజ్మీరా సీతారాం నాయక్, BRS నుంచి మాలోతు కవిత పోటీలో ఉన్నారు. కాగా తొలుత కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

News June 1, 2024

ఆదిలాబాద్: జూన్ 2 నుంచి అందుబాటులోకి 90 వేల ప్యాకెట్లు

image

రైతులు కోరుకుంటున్న రాశీ 659 పత్తి విత్తనాలను గత సంవత్సరం కంటే ఎక్కువ ప్యాకెట్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 1.50 లక్షల ప్యాకెట్లను కంపెనీని నుంచి తెప్పిస్తున్నామని, ఇప్పటి వరకు రైతులు 60 వేల ప్యాకెట్లు కొనుగోలు చేశారన్నారు. జూన్ 2 నుంచి మరో 90 వేల ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. దశల వారీగా రాశీ 659 స్టాకు వస్తుందని స్పష్టం చేశారు.

News June 1, 2024

ఆరా మస్తాన్ SURVEY: మహబూబ్‌నగర్‌లో టఫ్ ఫైట్..!

image

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుందని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ బీజేపీ నుంచి డీకే అరుణ, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, BRS నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు. తాజాగా విడుదలైన సర్వేలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉంటుందని అంచనా వేసింది. చివరకు డీకే అరుణకు అవకాశం ఉందన్నారు. దీనిపై మీ కామెంట్?

News June 1, 2024

SURVEY RESULTS: హైదరాబాద్‌ MIMదే..!

image

హైదరాబాద్ పార్లమెంట్ స్థానం MIMదే అని సర్వేలన్నీ తేల్చి చెప్పాయి. ఇక్కడ MIM నుంచి అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేశారు. BJP నుంచి మాధవీలత, BRS నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి మహమ్మద్ సమీర్ పోటీలో ఉన్నారు. కాగా తొలుత MIM, BJPకి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా తాజాగా విడుదలైన అన్ని సర్వేల్లో MIMదే విజయమని అంచనా వేశాయి. దీనిపై మీ కామెంట్?

News June 1, 2024

SURVEY RESULTS: హైదరాబాద్‌ MIMదే..!

image

హైదరాబాద్ పార్లమెంట్ స్థానం MIMదే అని సర్వేలన్నీ తేల్చి చెప్పాయి. ఇక్కడ MIM నుంచి అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేశారు. BJP నుంచి మాధవీలత, BRS నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి మహమ్మద్ సమీర్ పోటీలో ఉన్నారు. కాగా తొలుత MIM, BJPకి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా తాజాగా విడుదలైన అన్ని సర్వేల్లో MIMదే విజయమని అంచనా వేశాయి. దీనిపై మీ కామెంట్?

News June 1, 2024

ఆరా మస్తాన్ SURVEY: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌దే..!

image

నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్‌దే అని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మల్లు రవి పోటీ చేశారు. BJP నుంచి భరత్ ప్రసాద్, BRS నుంచి RS ప్రవీణ్ కుమార్ పోటీలో ఉన్నారు. కాగా తొలుత కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

News June 1, 2024

AARA: నిజామాబాద్, జహీరాబాద్ BJPవే!

image

నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలు BJPవేనని ఆరా మస్తాన్ సర్వే తేల్చి చెప్పింది. నిజామాబాద్‌లో BRSనుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌, కాంగ్రెస్ నుంచి టి.జీవన్‌రెడ్డి, BJP నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేశారు. ఇక జహీరాబాద్‌లో BRS నుంచి గాలి అనిల్‌కుమార్, కాంగ్రెస్ నుంచి సురేశ్‌షెట్కార్, BJP నుంచి బీబీపాటిల్ పోటీలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో BJP అభ్యర్థులే గెలుస్తారని సర్వే అంచనా వేసింది.

News June 1, 2024

AARA SURVEY: సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి BJPవే..!

image

సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాలు BJPవే అని ఆరా మస్తాన్ సర్వే తేల్చి చెప్పింది. చేవెళ్లలో BRS నుంచి కాసాని, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, BJP నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేశారు. మల్కాజిగిరిలో BRSనుంచి రాగిడి, కాంగ్రెస్ నుంచి సునీత, BJPనుంచి ఈటల పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్‌లో BRS నుంచి పద్మారావు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, BJPనుంచి కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు.