India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై చర్చించేందుకు నేడు కీలక సమావేశం జరుగనుంది. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్ ఈ సమావేశానికి వేదిక కానుంది. తెలంగాణ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటైన తర్వాత ఇది మొదటి సమావేశం. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. సంజీవ్ గోయంకా, కావ్య మారన్, ఉపాసన, పుల్లెల గోపీచంద్, కపిల్ దేవ్, శశిధర్ తదితరులు రానున్నట్లు సమాచారం.
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం రాజ్ పేట వద్ద బుధవారం వరద ప్రవాహంలో చిక్కుకున్న 10 మందిని రెస్క్యూ టీమ్ కాపాడింది. రాజ్ పేట గ్రామానికి చెందిన మరో ఇద్దరు రాజాగౌడ్, సత్యనారాయణ గల్లంతయ్యారు. ఇందులో సత్యనారాయణ మృతదేహం లభ్యమైనట్లు గ్రామస్థులు తెలిపారు. మరో వ్యక్తి రాజాగౌడ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. రాజ్ పేటకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు గందరగోళంలో పడిపోయారు. వర్షాలు ఇంకా కురిసే అవకాశముండటంతో మరికొన్ని రైళ్లు రద్దుచేసి దారి మళ్లించే అవకాశముంది. అందుకే ప్రయాణికుల సహాయార్థం రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ 040-27786170, కాచిగూడ- 9063318082
భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ పరిధిలో వేలాది గణపతి మండపాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వాటి పక్కన కరెంట్ పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్లు ఉంటే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, అగ్నిమాపకశాఖ, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు అధికారులు వర్షం పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. పురాతన ఇళ్లల్లోఉన్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు.
హయత్‌నగర్‌లో బుధవారం ఓ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఇద్దరు పిల్లలు గణపయ్యను ఇంటికి తీసుకెళ్తుండగా వర్షం మొదలైంది. వెనక కూర్చున్న బాలుడు గణపయ్య ప్రతిమ తడవకుండా తన చొక్కాను విప్పి కప్పాడు. తనకు లేకున్నా.. దేవుడు ప్రతిమ సురక్షితంగా ఉండాలని పసి ప్రాయంలో అతడు చూపిన భక్త, ప్రేమ అందరి హృదయాలను కదిలించింది. ‘వర్షంలో కరగకపోయినా నీ భక్తికి కురుగుతాడు’ ‘జాగ్రత్త బ్రో’ అంటూ SMలో పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో నిన్న ఉదయం 8.30 గంటల నుంచి నేడు ఉదయం 6 గంటల వరకు 1201.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. కొనిజర్లలో 95.1, YRP 92, వేంసూరు, KMM(R) 84.8, వైరాలో 84.1, రఘునాథపాలెంలో 82.4 మి.మీ. వర్షం పడింది. చింతకాని 74.2, కల్లూరు, SPL 57, ENKR 56, సింగరేణి 54, ఖమ్మం అర్బన్‌లో 51.8 మి.మీ.గా నమోదైందని జిల్లా సగటు వర్షపాతం 57.2 మి.మీ.గా ఉందన్నారు.
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు విధిగా సెలవు పాటించాలని సూచించారు. వర్షాల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టమన్నారు.
గ్రామాల్లో పొలిటికల్ హీట్ మొదలైంది. ఓవైపు జిల్లాలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తుండడంతో ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు గ్రామాల్లో ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. వినాయక చవితి వేడుకలు తమకు కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో గణేష్ మండపాల వద్ద లోకల్ లీడర్లు ఫోటోలతో ఫ్లెక్సీలు, హోర్డింగులు దర్శనమిస్తున్నాయి.
అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరానికి తెరలేచింది. పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్న నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడంతో ఆ పార్టీ నేతల్లో తీవ్ర నైరాశ్యం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటుకు మునుపు జెండా మోసిన వారంతా ఆశలు పెట్టుకున్నారు. కాగా గణేష్ నిమజ్జనం జరిగే లోపు నామినేటెడ్ పదవులు భర్తీ పూర్తి చేయాలని నిర్ణయించడంతో నేతల్లో మళ్లీ ఆశలు పుట్టుకొస్తున్నాయి.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా ముసురు పడుతూనే ఉంది. ఈ వానతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. అయితే మూడు రోజులుగా సాధారణ వర్షపాతమే నమోదు అవుతోంది. ఎక్కడా భారీ వర్షాలు నమోదు కాలేదు. గీసుగొండ, దుగ్గొండి, నెక్కొండ, పర్వతగిరి, రాయపర్తి, నర్సంపేట, ఖానాపూర్, నల్లబెల్లి, చెన్నరావుపేట, సంగెం, వర్ధన్నపేట తదితర మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా వరంగల్, ఖిలావరంగల్‌లో తక్కువే పడింది.
Sorry, no posts matched your criteria.