Telangana

News June 1, 2024

AARA SURVEY: ఆదిలాబాద్ బీజేపీ, పెద్దపల్లి కాంగ్రెస్!

image

ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీదేనని ఆరామస్తాన్ సర్వే తెలిపింది. బీజేపీ నుంచి గొడం నగేశ్, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవనుందని సర్వే పేర్కొంది. కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు.

News June 1, 2024

ఆరా మస్తాన్ SURVEY: కరీంనగర్ బీజేపీదే..!

image

కరీంనగర్ పార్లమెంట్ స్థానం బీజేపీదే అని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, BRS నుంచి వినోద్ కుమార్ పోటీలో ఉన్నారు. కాగా తొలుత బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో బీజేపీదే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

News June 1, 2024

AARA SURVEY: సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి BJPవే..!

image

సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాలు BJPవే అని ఆరా మస్తాన్ సర్వే తేల్చి చెప్పింది. చేవెళ్లలో BRS నుంచి కాసాని, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, BJP నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేశారు. మల్కాజిగిరిలో BRSనుంచి రాగిడి, కాంగ్రెస్ నుంచి సునీత, BJPనుంచి ఈటల పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్‌లో BRS నుంచి పద్మారావు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, BJPనుంచి కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు.

News June 1, 2024

ఆరా SURVEY: ఖమ్మం కాంగ్రెస్‌దే..!

image

ఖమ్మం పార్లమెంట్ స్థానం కాంగ్రెస్‌దే అని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి రఘురాం రెడ్డి పోటీ చేశారు. BJP నుంచి తాండ్ర వినోద్ రావు, BRS నుంచి నామా నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. కాగా తొలుత కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

News June 1, 2024

AARA SURVEY: నల్గొండ, భువనగిరి కాంగ్రెస్‌దే..!

image

నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్‌దే అని ఆరా మస్తాన్ సర్వే తేల్చి చెప్పింది. నల్గొండలో BRS నుంచి కంచర్ల కృష్ణరెడ్డి, కాంగ్రెస్ కందూరు రఘువీర్ రెడ్డి, BJP నుంచి సైదిరెడ్డి రెడ్డి పోటీ చేశారు. ఇక భవనగిరిలో BRS నుంచి క్యామ మల్లేశ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్, BJP నుంచి బూర నర్సయ్య పోటీలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారని సర్వే అంచనా వేసింది.

News June 1, 2024

ఆరా మస్తాన్ SURVEY: మెదక్ బీజేపీదే..!

image

మెదక్ పార్లమెంట్ స్థానం బీజేపీదే అని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ BJP నుంచి రఘునందన్‌రావు, BRS నుంచి వెంకట్రామ్ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి నీలం మధు పోటీలో ఉన్నారు. కాగా తొలుత బీజేపీ, కాంగ్రెస్‌కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో బీజేపీదే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

News June 1, 2024

ఆరా మస్తాన్ SURVEY: వరంగల్ కాంగ్రెస్‌దే..!

image

వరంగల్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్‌దే అని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పోటీ చేశారు. BJP నుంచి ఆరూరి రమేశ్, BRS నుంచి సుధీర్ కుమార్ పోటీలో ఉన్నారు. కాగా తొలుత కాంగ్రెస్, BJPకి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

News June 1, 2024

HYD: ‘తెలంగాణ పునర్నిర్మాణానికి మనందరం కృషి చేయాలి’

image

తెలంగాణ పునర్నిర్మాణానికి మనందరం కృషి చేయాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత అధ్యాపకుడు, ప్రొఫెసర్ జి.హరగోపాల్ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులకి పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

News June 1, 2024

HYD: ‘తెలంగాణ పునర్నిర్మాణానికి మనందరం కృషి చేయాలి’

image

తెలంగాణ పునర్నిర్మాణానికి మనందరం కృషి చేయాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత అధ్యాపకుడు, ప్రొఫెసర్ జి.హరగోపాల్ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులకి పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

News June 1, 2024

ఉప్పల్ శిల్పారామంలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు

image

ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వినాయక కౌతం, తక్కువేమి మనకు, రామకోదండ రామ, శ్రీమన్నారాయణ, పలుకే బంగారమయేహ్న, వినరో భాగ్యం, వింతలు వింటివా యశోద, నాటకరంజిని పదవర్ణం, త్యాగరాజ కీర్తన అంశాలను లక్ష్మీప్రియా, సహస్ర, వైష్ణవి, రిధి, నిహారిక, హిరణ్య, ఈషా, సాన్విక, అధిత్రి, వైద్య, సంకీర్త్ ప్రదర్శించారు.