Telangana

News June 1, 2024

HYD: పుణ్య క్షేత్రాలకు వెళ్లేందుకు సువర్ణ అవకాశం

image

సికింద్రాబాద్ నుంచి దివ్య దక్షిణ యాత్ర పేరిట ప్రత్యేక రైలు జూన్ 22వ తేదీన అందుబాటులో ఉంటుందని IRCTC తెలిపింది. ఒక వ్యక్తికి రూ.14,250 ఛార్జి ఉంటుందని, అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, తంజావూరు లాంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని పేర్కొంది. ఆసక్తి ఉంటే https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG25 లింక్ ద్వారా బుక్ చేసుకోవాలని తెలిపింది. SHARE IT

News June 1, 2024

ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. శనివారం జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్ మండలం కోల్వైలో 45.5°C, ధర్మపురి మండలం జైనలో 45.3°C, కోరుట్ల మండలం ఐలపూర్ లో 45.0°C, రాయికల్ మండలం ఆల్లిపూర్‌లో 44.7°C, కోరుట్లలో 44.3°C, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట్ లో 44.6°C, కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండలం ఈదులగట్టుపల్లిలో 43.6°C, పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో 42.7°C ఉష్ణోగ్రత నమోదైంది.

News June 1, 2024

HYD: వైభవంగా వేడుకలు నిర్వహిస్తాం: మంత్రులు

image

రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఈరోజు పరిశీలించారు. 10వ ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో MLA దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, MP అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ శ్రీలత, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MBNR: సైబర్ మోసం రూ.2.58 లక్షలు మాయం

image

ఓ వ్యక్తి వాట్సాప్‌లో వచ్చిన లింక్‌ను క్లిక్ చేయగా రూ.లక్షలు పొగొట్టుకున్నాడు. రాజోళి మండల కేంద్రానికి చెందిన ఎల్లప్ప వాట్సాప్‌లో వచ్చిన లింక్‌ను ఓపెన్ చేశాడు. అందులో సూచించిన విధంగా నమోదు చేస్తూ వెళ్లగా, తనకు చెందిన మూడు క్రెడిట్ కార్డుల నుంచి రూ.2.58లక్షలు మాయమైనట్లు గ్రహించాడు. ఆందోళనకు గురైన ఆ వ్యక్తి సైబర్‌ క్రైం‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. శుక్రవారం రాజోలి పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

News June 1, 2024

BREAKING: నకిరేకల్ యువతి ఆత్మహత్య

image

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన సంగీత(24) తన సోదరుడితో కలిసి HYD వచ్చింది. మేడ్చల్‌లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉంటూ గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని చనిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు.

News June 1, 2024

BREAKING: HYD: యువతి ఆత్మహత్య

రామగుండం: తాను మరణిస్తూ.. చూపునిచ్చాడు!

image

రామగుండం NTPC అన్నపూర్ణ కాలనీకి చెందిన ఈదునూరి కిశోర్ వడదెబ్బతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్రదానం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ బాధిత కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. ఫౌండేషన్ ప్రతినిధులు శ్రవణ్ కుమార్, లింగమూర్తి, సానా రామకృష్ణా రెడ్డి, రమేశ్, బీష్మాచారి, వాసు, చంద్రశేఖర్, శశికళ, శారద, లక్ష్మీనారాయణ ఉన్నారు.

News June 1, 2024

BREAKING: HYD: యువతి ఆత్మహత్య

image

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన సంగీత(24) తన సోదరుడితో కలిసి HYD వచ్చింది. మేడ్చల్‌లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉంటూ గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని చనిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు.

News June 1, 2024

మెదక్: మూడు నుంచి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు

image

మార్చి 2024లో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో అనుత్తీర్ణులైన విద్యార్ధుల కోసం జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరిక్షలు నిర్వహిస్తున్నట్లు డిఇఓ రాధాకిషన్ తెలిపారు. మెదక్ జిల్లాలో 783 మంది విద్యార్థులుండగా, మెదక్ పట్టణ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ఉ. 9.30 గం. నుంచి మ.12.30 గం వరకు నిర్వహించనున్నారు.