Telangana

News June 1, 2024

ADB: రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత లేదు: వ్యవసాయశాఖ డైరెక్టర్

image

రాష్ట్రంలో పత్తివిత్తనాల కొరత లేదని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి అన్నారు. ఆదిలాబాద్‌లో రాశి కాటన్ సీడ్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉండటం, సరిపడా విత్తనాలు లేకపోవడంతో గందరగోళం ఏర్పడిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తమిళనాడు నుంచి 30 వేల ప్యాకెట్లను తెప్పించి ఆదిలాబాద్ పంపించినట్టు ఆయన తెలిపారు. మరో 4, 5 రోజుల్లో 40 వేల ప్యాకెట్లను అందుబాటులోకి తెస్తామని ఆయన స్పష్టం చేశారు.

News June 1, 2024

FLASH: HYD: డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ అరెస్ట్

image

HYDలో పలువురికి డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ నైజీరియన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపిన వివరాలు.. నైజీరియా దేశానికి చెందిన కాస్మోస్ రాంసి అలియాస్ ఆండి బిజినెస్ వీసాపై 2014లో భారతదేశానికి వచ్చాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చి డ్రగ్స్ పెడ్లర్‌గా మారాడు. టెలిగ్రామ్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్న రాంసిని అరెస్టు చేసి 16 గ్రా. కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

News June 1, 2024

MDK: కాలువ పనులు కంచికేనా?

image

మెదక్‌ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు 18వ ప్యాకేజీ కింద నిర్మిస్తున్న కాలువ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. తూప్రాన్‌ మండలం గుండ్రెడ్డిపల్లిలో కాళేశ్వరం కాలువ పనులు ప్రారంభమై నర్సాపూర్‌ మండలం నాగులపల్లి వరకు కొనసాగున్నాయి. ఈ క్రమంలో ఇటీవల పనులు నిలిచిపోవడంతో నర్సాపూర్, సంగారెడ్డి నియోజకవర్గాల ప్రజలు నిరాశకు గురవుతున్నారు. కాలువ పూర్తైతే తమ పొలాలకు నీళ్లు వస్తాయని భావించిన రైతులకు నిరాశే మిగిలింది.

News June 1, 2024

FLASH: HYD: డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ అరెస్ట్

image

HYDలో పలువురికి డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ నైజీరియన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపిన వివరాలు.. నైజీరియా దేశానికి చెందిన కాస్మోస్ రాంసి అలియాస్ ఆండి బిజినెస్ వీసాపై 2014లో భారతదేశానికి వచ్చాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చి డ్రగ్స్ పెడ్లర్‌గా మారాడు. టెలిగ్రామ్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్న రాంసిని అరెస్టు చేసి 16 గ్రా. కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

News June 1, 2024

పెద్ద జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

image

కొండగట్టు అంజన్న క్షేత్రంలో జరుగుతున్న పెద్ద జయంతి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ముందుగా స్థానిక హరిత హోటల్‌లో నేసిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే స్వామివారికి సమర్పించారు. అనంతరం యాగశాలలోని వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని తిలకించారు. అర్చకులు ఆశీర్వదిoచి, తీర్థ ప్రసాదం అందజేశారు. ఇక్కడ ఎంపీపీ రవళి, ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, సతీశ్ రెడ్డి, అనిల్ ఉన్నారు.

News June 1, 2024

NLG: చెరువుల్లో నీరే లేదు.. చేప పిల్లలు పోశారట!

image

గతేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా నల్గొండ జిల్లాలో రిజర్వాయర్లు చెరువులు, కుంటల్లో నీరు చేరలేదు. చెరువులు కుంటల్లో నీరు లేకున్నా చేప పిల్లలు వదిలినట్లు కాంట్రాక్టర్లు మాయాజాలం ప్రదర్శించడంపై పలువురు మండిపడుతున్నారు. ఇదే విషయమై రూ.6 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి సిఫార్సులు పంపారట. దీనిపై మత్స్య సహకార సంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

News June 1, 2024

ఖమ్మం: వడదెబ్బతో ఒక్కరోజే ఇద్దరు మృతి

image

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాపటపల్లిలో వడదెబ్బతో శనివారం ఒక్కరోజే ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ఎండ తీవ్రతకు పోతన బోయిన గురవయ్య (80), పుప్పాల రామయ్య (85) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ కన్నుమూశారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

News June 1, 2024

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో డ్రెస్ కోడ్ అమలు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నట్లు ఈవో భాస్కర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పక సంప్రదాయ దుస్తులు ధరించాలని తెలిపారు. మహిళలు చీర, చుడీదార్, పురుషులు దోతి, తెల్ల లుంగీ, షర్ట్ ధరించవచ్చని సూచించారు.

News June 1, 2024

NZB: ట్రాక్టర్ కింద పడి బాలిక మృతి

image

భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురాణిపేట్ గ్రామంలో విషాదం నెలకొంది. నిలిపి ఉన్న ట్రాక్టర్ కింద పడి బాలిక మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన బ్రహ్మ రౌతు సంతోష్ పెద్ద కుమార్తె కల్పిత (9) ఇంటి సమీపంలో ఎరువు నింపేందుకు నిలిపి ఉంచిన ట్రాక్టర్ పై ఎక్కి ఆడుకుంటుంది. ఈ క్రమంలో ఒక్కసారి ట్రాక్టర్ మూవ్ చేయడంతో టైర్ కింద పడి మృతి చెందినట్లు ఆమె కుంటుంబీకులు తెలిపారు.

News June 1, 2024

MBNR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ.. రేపే కౌంటింగ్..!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. కౌన్ బనేగా ఎమ్మెల్సీ అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆయన ఎన్నికను ఎంతోప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ముందుకు సాగారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్నికలలో గెలుపొందాలని బీఆర్ఎస్ నేతల సైతం తీవ్రంగా ప్రయత్నించారు. ఫలితం ఎవరిని వరిస్తుందో చూడాలి.