Telangana

News June 1, 2024

NLG: వడదెబ్బతో ఇద్దరు మృతి

image

జిల్లాలో వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. మునుగోడు మండలం ఊకోండి గ్రామానికి చెందిన కమ్మలపల్లి మమత (30), రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో నివాసం ఉంటున్న భీమవరానికి చెందిన కర్రీ రాజు (40) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. జిల్లాలో మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల పైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

News June 1, 2024

పదేళ్లు: హైదరాబాద్‌లో పెను మార్పు!

image

TG ఏర్పాటైన‌ పదేళ్లలో ప్రపంచ నగరాలతో‌ HYD పోటీ పడిందని చెప్పొచ్చు. వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డ్‌ (2022) గెలుచుకోవడం ఇందుకు నిదర్శనం. HYD‌లో జరిగిన కీలక ఘట్టాలు.. 1. మెట్రో‌ ప్రారంభం, 2. SRDP‌తో 36 ఫ్లై ఓవర్లు, 3. ట్యాంక్‌బండ్, HMDA పార్కుల సుందరీకరణ, 5. కేబుల్ బ్రిడ్జి, 6. IT కారిడార్‌, 7. నూతన సెక్రటేరియట్, 8. అమరవీరుల స్తూపం, 9. అంబేడ్కర్ విగ్రహం, 10. SNDP పనులు. ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి.

News June 1, 2024

పదేళ్లు: హైదరాబాద్‌లో పెను మార్పు!

image

TG ఏర్పాటైన‌ పదేళ్లలో ప్రపంచ నగరాలతో‌ HYD పోటీ పడిందని చెప్పొచ్చు. వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డ్‌ (2022) గెలుచుకోవడం ఇందుకు నిదర్శనం. HYD‌లో జరిగిన కీలక ఘట్టాలు.. 1. మెట్రో‌ ప్రారంభం, 2. SRDP‌తో 36 ఫ్లై ఓవర్లు, 3. ట్యాంక్‌బండ్, HMDA పార్కుల సుందరీకరణ, 5. కేబుల్ బ్రిడ్జి, 6. IT కారిడార్‌, 7. నూతన సెక్రటేరియట్, 8. అమరవీరుల స్తూపం, 9. అంబేడ్కర్ విగ్రహం, 10. SNDP పనులు. ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి.

News June 1, 2024

ములుగు: వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య

image

వరకట్న వేధింపులు కారణంగా వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దీకొండ శ్రీనాథ్ భార్య అంజలితో తనకు రావాల్సిన వరకట్నం ఇంకా ఇవ్వలేదని తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన అంజలి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా అంజలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 1, 2024

నేటి నుంచి బాసర ట్రిపుల్ఐటీలో దరఖాస్తుల స్వీకరణ

image

బాసర ట్రిపుల్ఐటీలో 2024-25 విద్యాసంవత్సరానికి శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు VC వెంకట రమణ తెలిపారు. ఈ ఏడాది ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని ఎస్సెస్సీ బోర్డు సర్వర్‌తో అనుసంధానం చేసినట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి హాల్‌టికెట్ నంబర్, పేరు తదితర వివరాలు ఆటోమేటిక్‌గా కనిపిస్తాయన్నారు. జూన్ 1నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

News June 1, 2024

ఆదిలాబాద్: PG విద్యార్థులకు ONLINEలో అసైన్‌మెంట్

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అసైన్‌మెంట్‌లు www.braou.online.in వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి అసైన్‌మెంట్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. అసైన్మెంట్లు పూర్తి చేసిన అనంతరం ఆన్‌లైన్‌లోనే ఈనెల20వ తేదీ లోపు సబ్మిట్ చేయాలన్నారు.

News June 1, 2024

“ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి కార్యక్రమాలు”

image

✓ ఉమ్మడి జిల్లాలో నేటి నుండి ఇంటర్మీడియట్ కళాశాలలు ప్రారంభం.
✓ కొడంగల్, నందిగామ, ఫరూక్నగర్ మండలాల్లో నేడు విద్యుత్ నిలిపివేత.
✓ పాలమూరులో నేడు హనుమాన్ జయంతి వేడుకలు.
✓ రేపు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం.
✓ రేపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు ఏర్పాట్లు.
✓ అలంపూర్: నేడు పెద్ద కిస్తీ దర్గా ఉత్సవాలు.
✓ అచ్చంపేట: నేడు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన.
✓ నేడు TGPSC గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల.

News June 1, 2024

MBNR:రేపే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం

image

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై రేపు ఉత్కంఠకు తెరపడనుంది. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఆదివారం కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉ.8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం ఐదు టేబుళ్లలో ఓట్లు లెక్కిస్తారు. మన్నె జీవన్ రెడ్డి(INC), నవీన్ కుమార్ రెడ్డి(BRS), స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో నిలిచారు.

News June 1, 2024

వరంగల్: ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండడంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. వరంగల్, MHBD పరిధిలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. కాగా ఎవరికే వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ద్వారా గెలుపు ఓటములపై ఓ అంచనాకు రానున్నారు. దీని ద్వారా తీవ్ర ఉత్కంఠకు కొంత తెరపడనుంది. ఓటరు నాడీ తెలియాలంటే ఈనెల 4 వరకు వేచిచూడాల్సిందే.!

News June 1, 2024

కరీంనగర్: ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండడంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. KNR, PDPL పరిధిలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. కాగా ఎవరికే వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ద్వారా గెలుపు ఓటములపై ఓ అంచనాకు రానున్నారు. దీని ద్వారా తీవ్ర ఉత్కంఠకు కొంత తెరపడనుంది. ఓటరు నాడీ తెలియాలంటే ఈనెల 4 వరకు వేచిచూడాల్సిందే.!