Telangana

News June 1, 2024

PU పరిధిలో డిగ్రీ పరీక్ష వాయిదా

image

పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ సెమిస్టర్-4 రెగ్యులర్, బ్యాక్లాగ్, సెమిస్టర్-5 బ్యాక్లాగ్ పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి రాజ్ కుమార్ తెలిపారు. జూన్ 6న జరిగే ఈ పరీక్షలను మే 18కి పోస్ట్ ఫోన్ చేస్తున్నట్లు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆయా సెమిస్టర్ల విద్యార్థులు గమనించాలని కోరారు.

News June 1, 2024

అవతరణ వేడుకలకు సిద్దిపేట కలెక్టరేట్ ముస్తాబు

image

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సిద్దిపేట జిల్లా ముస్తాబవుతోంది. జూన్ 2 అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని ప్రభుత్వ కార్యాలయాలు ప్రత్యేక లైటింగ్‌తో ధగధలాడుతున్నాయి. జిల్లా ప్రభుత్వ కార్యాలయాల సమీకృత భవనం(కలెక్టరేట్) విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా మారింది. జాతీయ జెండా రంగులతో శుక్రవారం రాత్రి న్యూ లుక్‌తో చూపరనులను ఆకట్టుకుంంటుంది.

News June 1, 2024

గ్రూప్-1 పరీక్షలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

image

జూన్ 9న జరిగే గ్రూప్-1 పరీక్షకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సంగారెడ్డి ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 16 కేంద్రాల్లో 9,672 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. 6 ఎస్కార్ట్ రూట్లుగా విభజించి ఆర్మూడ్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు.

News June 1, 2024

నిజామాబాద్: ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ఇంటర్మీడియట్ కామర్స్, కెమిస్ట్రీలతో సప్లిమెంటరీ పరీక్షలు ముగిసాయి. శుక్రవారం ఉదయం మొదటి సంవత్సరం పరీక్షలు జరగగా మధ్యాహ్నం రెండవ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలియజేశారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 6164 మంది విద్యార్థులు హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 2999 మంది విద్యార్థులు హాజరయ్యారు.

News June 1, 2024

హైదరాబాద్‌‌లో ACB తగ్గేదేలే!

image

HYDలో ACB మెరుపుదాడులు కొనసాగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే‌ 8 మందికి చెక్ పెట్టింది. లంచం తీసుకొంటున్న ఇరిగేషన్‌ శాఖ AE భన్సీలాల్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్స్‌ కార్తీక్‌, నిఖేష్‌కుమార్‌తో పాటు సర్వేయర్‌ గణేశ్‌ను పట్టుకొంది. కుషాయిగూడ PSలో రూ. 3 లక్షలు డిమాండ్ చేసిన CI వీరాస్వామి, SI షఫీ ఆట కట్టించింది. గొర్రెల పంపిణీ స్కాం విచారణలో భాగంగా మాజీ మంత్రి OSDతో పాటు మరో అధికారిని ACB అరెస్ట్ చేయడం విశేషం.

News June 1, 2024

ప్రపంచ వరి సదస్సుకు సన్నాహాలు ముమ్మరం: మంత్రి తుమ్మల

image

ఈ నెల 7, 8 వ తేదిలలో హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో ప్రపంచ వరి సదస్సుకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల అన్నారు. వివిధ దేశాల నుండి వరి శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ సదస్సు నిర్వహిస్తున్న అంతర్జాతీయ పంటల సంస్థ డైరెక్టర్ మెర్సిడెస్ జోన్స్, స్థానిక నిర్వాహుకులు ఈరోజు మంత్రి తుమ్మలను కలిశారు.

News June 1, 2024

కొండగట్టు: పెద్ద హనుమాన్ జయంతికి ఘనంగా ఏర్పాట్లు

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామివారి పెద్ద జయంతి నేపథ్యంలో దేవాదాయశాఖ అధికారులు ఆలయ ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులు, మాలాధారులు వేలాదిగా ఆలయానికి తరలిరానుండటంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. కలెక్టర్ యాస్మిన్‌బాష ఏర్పాట్లను పర్యవేక్షించారు.

News June 1, 2024

NLG: గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు ఏర్పాట్లు

image

జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని NLG జిల్లా స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర ఆదేశించారు. గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ విషయమై నల్లగొండలో శుక్రవారం ఆయన నిర్వహించిన కో- ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని.. 16,899 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

News June 1, 2024

హైదరాబాద్‌‌లో ACB తగ్గేదేలే!

image

HYDలో ACB మెరుపుదాడులు కొనసాగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే‌ 8 మందికి చెక్ పెట్టింది. లంచం తీసుకొంటున్న ఇరిగేషన్‌ శాఖ AE భన్సీలాల్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్స్‌ కార్తీక్‌, నిఖేష్‌కుమార్‌తో పాటు సర్వేయర్‌ గణేశ్‌ను పట్టుకొంది. కుషాయిగూడ PSలో రూ. 3 లక్షలు డిమాండ్ చేసిన CI వీరాస్వామి, SI షఫీ ఆట కట్టించింది. గొర్రెల పంపిణీ స్కాం విచారణలో భాగంగా మాజీ మంత్రి OSDతో పాటు మరో అధికారిని ACB అరెస్ట్ చేయడం విశేషం.

News May 31, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> పాప కిడ్నాప్ కేసును ఛేదించిన RGIA పోలీసులు
> శంషాబాద్‌‌లో క్యాబ్‌‌ డ్రైవర్ హల్‌చల్
> లాలాపేటలో‌ డ్రగ్స్ అమ్మకం.. అరెస్ట్
> ఉప్పల్‌లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
> జూపార్కులో ఖడ్గ మృగాల కోసం నైట్ ఎన్‌క్లోజర్
> ఓయూలో అమరవీరుల సంస్మరణ సభ పోస్టర్ ఆవిష్కరణ
> కుషాయిగూడ పీఎస్ లో లంచం తీసుకుంటూ దొరికిన సీఐ, ఎస్సై