Telangana

News May 31, 2024

HYD: స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు

image

స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిర్వాహకులు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లోని ఓ అపార్ట్‌మెంట్లో స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను పోలీసులు రైడ్స్ చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.

News May 31, 2024

ఇక రెగ్యులర్ సిబ్బందితో పన్ను వసూళ్లు

image

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పురపాలికలో అవకతవకలు జరగకుండా రాష్ట్ర పురపాలక శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆస్తి పన్ను వసూలు విధానంలో మార్పు చేసింది. ఇకనుంచి పట్టణాల్లో రెగ్యులర్ సిబ్బందికే పన్ను వసూలు బాధ్యతలు అప్పగించేలా కసరత్తు చేపట్టింది. మున్సిపాలిటీలో పనిచేసే పొరుగు సేవల సిబ్బంది ఔట్సోర్సింగ్ ను నగదు లావాదేవీల నుంచి తప్పించేలా ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశాలు జారీచేసింది.

News May 31, 2024

మంచిర్యాలలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

ఉమ్మడి ADB జిల్లాలో గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా భీమారం గ్రామంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లా దహెగంలో 46., ఆదిలాబాద్ జిల్లా పిప్పల్‌దరిలో 45.2, నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలెవరూ మధ్యాహ్నం వేళల్లో బయటకి రాకూడదన్నారు.

News May 31, 2024

ఖమ్మం: పంచాయతీ ఎన్నికలు.. వారు మళ్లీ పోటీ చేయొచ్చు!

image

2019లో పంచాయతీ ఎన్నికలు జరగ్గా రూల్స్ పాటించని కారణంగా 98 మంది వార్డు సభ్యులపై అనర్హత విధించారు. ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోగా అభ్యర్థులు ఆదాయ, వ్యయ వివరాలను అధికారులకు సమర్పించాలి. కొందరు వార్డు సభ్యులు నిరక్షరాస్యత, అవగాహన లోపంతో ఆ వివరాలను అందజేయలేదు. 2021లో మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు. జూన్‌తో నిషేధం ముగియడంతో వారికి మళ్లీ పోటీ చేసే ఛాన్స్ లభించింది.

News May 31, 2024

బాలానగర్: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలంలోని ఈదమ్మగడ్డ తండాలో చోటుచేసుకుంది. ఎస్సై తిరుపాజీ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అంజమ్మ (41) ఆమె భర్త శంకర్‌తో పాటు ఇద్దరు కుమారులు ఆస్తి పంపకం విషయంలో తరచూ గొడవపడేవారు. తల్లిని కుమారులు తిట్టడంతో బుధవారం పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంది. MBNR ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. గురువారం మృతి చెందింది. కేసు నమోదు చేశారు.

News May 31, 2024

BREAKING.. HYD: నీటిపారుదల శాఖలో ఏసీబీ రైడ్స్, ముగ్గురి అరెస్టు

image

ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు వివిధ శాఖలపై రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లిలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అదేవిధంగా రెడ్ హిల్స్‌లో ఉన్న రంగారెడ్డి జిల్లా పర్యవేక్షక ఇంజినీరింగ్ శాఖలో రాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్, ఇల్లు కార్తీక్, నికేష్ అధికారులకు పట్టుపడ్డారు.

News May 31, 2024

BREAKING.. HYD: నీటిపారుదల శాఖలో ఏసీబీ రైడ్స్, ముగ్గురి అరెస్టు

image

ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు వివిధ శాఖలపై రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లిలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అదేవిధంగా రెడ్ హిల్స్‌లో ఉన్న రంగారెడ్డి జిల్లా పర్యవేక్షక ఇంజినీరింగ్ శాఖలో రాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బన్సీలాల్, ఇల్లు కార్తీక్, నికేష్ అధికారులకు పట్టుపడ్డారు.

News May 31, 2024

జూన్ 3, 4వ తేదీల్లో మేడ్చల్ ఉచిత చెవి వైద్య శిబిరం 

image

మేడ్చల్ పట్టణంలోని ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో వచ్చే జూన్ 3, 4వ తేదీల్లో ఉచిత వినికిడి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్టు ఆస్పత్రి డాక్టర్ కిశోర్ తెలిపారు. రెండు రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 8 గంటల వరకు వైద్యశిబిరం ఉంటుందన్నారు. వినికిడి
లోపం ఉన్న వారికి అత్యాధునిక పరికరాల తో పరీక్షలు నిర్వహిస్తామని, వినికిడి లోపంతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News May 31, 2024

తిరుపతిలో గుండెపోటుతో మద్నూర్ వాసి మృతి

image

మద్నూర్ కు చెందిన యువకుడు చౌడేకర్ రూపమ్ (31) గుండె పోటుతో తిరుపతిలో గురువారం రాత్రి మృతి చెందాడు. స్నేహితులతో కలిసి తిరుపతి వెళ్లిన రూపమ్ తిరుమల దర్శనం చేసుకుని గోవిందరాజ స్వామి దర్శనం కోసం క్యూలో ఉండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతడి స్నేహితులు తెలిపారు. కాగా మూడు నెలల క్రితం రూపమ్‌కు వివాహం అయింది.

News May 31, 2024

చెన్నారావుపేట: కుటుంబ కలహాలతో వ్యకి సూసైడ్

image

కుటుంబ కలహాలతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌లో చోటుచేసుకుంది. తిమ్మరాయినిపహాడ్‌కు చెందిన దాసరి బాలస్వామి(47) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంట్లో తరుచు గొడవల కారణంగా ఆయన మద్యానికి బానిసయ్యాడు. దీంతో బాలస్వామి భార్య తన ఇద్దరు పిల్లలకు తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.