Telangana

News May 31, 2024

గోల్కొండ, శాతవాహన రైళ్లు రద్దు

image

ఖమ్మం మీదుగా వెళ్లే గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ రైళ్లను నిర్ణీత తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ఖమ్మం రైల్వే కమర్షియల్ ట్యాక్స్ అధికారి ఎండీ జాఫర్ గురువారం తెలిపారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ జూన్ 1, 2, 5, 6, 8, 9 తేదీల్లో, విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే శాతవాహన ఎక్స్ప్రెస్(12713), పై తేదీల్లో రద్దు చేసినట్లు వివరించారు.

News May 31, 2024

ఆసుపత్రి సిబ్బంది మోసం చేశారని యజమాని ఆవేదన

image

తన ఆసుపత్రిలో పనిచేసే అటెండర్ రాహుల్, డా.నవ్యశ్రీ మోసం చేశారంటూ ఓ ఆసుపత్రి యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. తను మెడికో కానందున SKZRలో నూతనంగా ప్రారంభించిన ఆసుపత్రిని నవ్యశ్రీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయంచగా ఇప్పుడు ఆ ఆసుపత్రిని వారు ఆక్రమించారన్నారు. గురువారం ఆసుపత్రి సామగ్రి షిఫ్ట్ చేస్తుంటే వీడియో తీసినందుకు తనపై దాడి చేశారని పేర్కొన్నాడు. వారిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

News May 31, 2024

MBNR: తక్కువ ధరకే బంగారం పేరుతో.. మోసం

image

తక్కువ ధరకే బంగారం అంటూ ఓ వ్యక్తి మోసపోయిన ఘటన MBNR జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాలానగర్‌కు చెందిన శంకర్ సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. శంషాబాద్‌కు చెందిన మధుతో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. తన వద్ద 12 తులాల బంగారం ఉందని, డబ్బులు అవసరముందని ఈనెల 29న ఫోన్ చేసి రూ.2 లక్షలకు బంగారం అమ్మాడు. అనుమానంతో తనిఖీ చేయించగా బిస్కెట్ బంగారంగా తేలింది. గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 31, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక సమీక్షా సమావేశం
∆} తిరుమలాయపాలెం మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాల అంతరాయం
∆} వైరా మండలంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మంలో పవర కట్

News May 31, 2024

ఖమ్మం జిల్లాలో జూన్ 3 నుంచి బడిబాట కార్యక్రమం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జూన్ 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. జూన్ 1 నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం అవనుండగా.. తాజాగా షెడ్యూల్‌ను మార్చింది. రోజూ ఉ.7 నుంచి ఉ.11 వరకు స్కూల్ టీచర్లు తమ పరిధిలోని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చదువుకు దూరంగా ఉంటున్న పిల్లల్ని టీచర్లు ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకోనున్నారు.

News May 31, 2024

విత్తనాలు అందించే బాధ్యత కలెక్టర్లదే : మంత్రి తుమ్మల

image

ఎరువులు, విత్తనాలు రైతులకు అందించే బాధ్యత కలెక్టర్లదేనని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సెక్రటేరియట్లో పత్తి, పచ్చిరొట్ట విత్తనాల పంపిణీపై మంత్రి సమీక్ష చేపట్టారు. ఈ మేరకు నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విత్తనాల సరఫరాలో లోపాలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామన్నారు.

News May 31, 2024

UPDATE.. NZB: చిన్నారిని హత్య చేసిన తండ్రి

image

నాలుగేళ్ల చిన్నారిని సవితి తండ్రి హత్య చేసిన విషయం తెలిసిందే. మాక్లూర్‌లోని ధర్మోరాకు చెందిన అరుణ్‌కు మొదటి భార్యతో విడాకులు కాగా NZBకి చెందిన సునీతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే లక్కీ(4) అనే కూతురు ఉంది. పెళ్లికి ముందు పాప తమతోనే ఉంటుందని ఒప్పుకొని తర్వాత పాపను మీ అమ్మగారింట్లో ఉంచు అంటూ గొడవపడేవాడు. పాప తన ఇంట్లో ఉండటం నచ్చని అరుణ్ ఇంట్లో నిద్రిస్తున్న పాపను గొంతునులిమి చంపేశాడు.

News May 31, 2024

ఉరి వేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

ఉరి వేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన వనం రేవతికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లక్ష్మణ్ చౌటుప్పల్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. ఫెయిల్ అవ్వడంతో సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నాడు. ఈ నేపథ్యంలో సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News May 31, 2024

HYD: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల రిహార్సల్స్‌.. ట్రాఫిక్‌ ఆంక్షలు

image

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల రిహార్సల్స్‌ సందర్భంగా గన్‌పార్క్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌, ట్యాంక్‌బండ్‌ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై శుక్రవారం ఆంక్షలుంటాయని పోలీస్‌ అధికారులు తెలిపారు. గన్‌పార్క్‌ పరిసరాల్లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, పరేడ్‌ గ్రౌండ్స్‌ వద్ద ఉదయం 10నుంచి 11 గంటల వరకు, ట్యాంక్‌బండ్‌పై రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయన్నారు.

News May 31, 2024

రంగారెడ్డి: జిల్లాలో విత్తనాల కొరత లేదు: కలెక్టర్

image

RR జిల్లాలో పత్తి, పచ్చిరొట్ట విత్తనాల కొరత లేదని కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్ లో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గీతారెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, అగ్రో రైతు సేవ కేంద్రాల్లో రైతులకు అందజేస్తారని తెలిపారు. మేలు రకం పత్తి విత్తనాలు ప్రైవేటు డీలర్ల ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు.