Telangana

News August 28, 2025

సత్తుపల్లి: పాముకాటుతో చిన్నారి మృతి

image

సత్తుపల్లి మండలం పాకలగూడెంలో విషాదం నెలకొంది. తల్లికూతుర్లను పాము కాటు వేయగా చిన్నారి మౌనిక (5) మృతి చెందింది. ఆమె తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇంట్లో నేలపై పడుకుని ఉండగా రాత్రి 2 గంటల సమయంలో పాము కాటు వేసిందని చిన్నారి తండ్రి గోపి తెలిపాడు. పాప మృతితో విషాదం నెలకొంది.

News August 28, 2025

HYD: ఎవరూ చూడటంలేదని తోక జాడించకండి..!

image

గణేశ్ నవరాత్రుల సందర్భంగా మండపాలు, నిమజ్జనవేడుకల్లో యువతులు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే పోకిరీల పని పట్టేందుకు SHE టీమ్స్ సిద్ధమైంది. మూడు కమిషనరేట్ల పరిధిలో అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా పోకిరీలపై నిఘా వేశారు. ఎవరూ చూడటం లేదని తోకజాడించాలని చూస్తే వారి కదలికలన్నీ పసిగడతాం అని స్పష్టం చేశారు. ఎక్కడైనా పోకిరీలు ఇబ్బంది పెడితే 94906 17444, 949061655, 8712662111 నెంబర్లకు కాల్ చేయాలన్నారు. 

News August 28, 2025

మొన్న అలా.. నిన్న ఇలా: ఏమిటండీ కొండా గారూ?

image

బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కామెంట్స్ ఆ పార్టీలోనే చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ నాయకులు తనతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారని.. అందుకే ఫుట్‌బాల్‌ను గిఫ్ట్‌గా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శికి ఇవ్వడానికి తెచ్చానని మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో వ్యాఖ్యానించారు. అయితే బుధవారం దీనికి భిన్నంగా.. కాంగ్రెస్ పార్టీని ఎలా ఫుట్‌బాల్ ఆడుకోవాలో కార్యకర్తలకు చెప్పేందుకే ఇచ్చానని చెప్పడం ఆశ్చర్యకరం.

News August 28, 2025

ఈ ఆదివారం గచ్చిబౌలి స్టేడియం వద్ద సైకిల్ ర్యాలీ

image

ఈ నెల 31న గచ్చిబౌలిలో సైక్లింగ్ ర్యాలీ జరుగనుంది. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఈ సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి తెలిపారు. ర్యాలీ ఆదివారం ఉ.7గం.కు గచ్చిబౌలి స్టేడియం మెయిన్ గేటు వద్ద ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పలువురు ప్రముఖులు వేడుకకు హాజరవుతారని వివరించారు. 

News August 28, 2025

HYD: వెస్ట్ జోన్‌లో 1,638 గణపయ్య విగ్రహాలు

image

సిటీ వెస్ట్ జోన్ పరధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 1,638 మండపాల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించారు. బంజారాహిల్స్ PS పరిధిలో 274, బోరబండ పరిధిలో 268, మాసబ్‌ట్యాంక్ పరిధిలో 44, ఎస్ఆర్‌నగర్ లిమిట్స్‌లో 239, పంజగుట్ట పరిధిలో 185, ఫిలింనగర్‌లో 215, మధురానగర్‌లో 287, జూబ్లీహిల్స్ PS పరిధిలో 126 విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో 278 మంది పోలీసులను భద్రత కోసం కేటాయించారు.

News August 28, 2025

మెదక్: నేడు ముంపు ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే

image

మెదక్ జిల్లాలో నీట మునిగిన ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం మెదక్ ఎస్పీ కార్యాలయంలో వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలపై సమీక్ష చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఇన్‌ఛార్జ్ మంత్రి డా.వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను హరీశ్ రావు సైతం సందర్శించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

News August 28, 2025

HYD: ఎంజాయ్‌ చేయండి.. ఖర్చు మాది..!

image

స్థానిక సంస్థలు ఎన్నికలు, నగరంలో ఉపఎన్నిక, రానున్న GHMC ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్న ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు గణపతి ఉత్సవాలు వేదికయ్యాయని గ్రామాల్లో, నగరంలో యువకుల మాట. వీరికి దగ్గరయ్యేందుకు యువజన సంఘాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎంత ఖర్చైనా చేసేందుకు నేతలు పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ కామెంట్.

News August 28, 2025

KMM: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నందున అటువైపు వెళ్లవద్దని, రోడ్లపైకి వర్షం నీరు చేరడంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంటికే పరిమితం కావాలని సూచించారు.

News August 28, 2025

మెదక్: అత్యధికంగా సర్ధనలో 31 సెంమీల వర్షం

image

మెదక్ జిల్లా హవేలీ ఘనాపూర్ మండలం సర్ధనలో అత్యధికంగా 31 సెంమీ (316 మిమీలు) వర్షపాతం నమోదయింది. నాగపూర్‌లో 277.3 మిమీలు, చేగుంటలో 230.5 మిమీలు, రామాయంపేటలో 208, మెదక్‌లో 206 మిమీల వర్షపాతం నమోదైంది. మెదక్ ప్రాంతంలో అత్యధిక వర్షం కురవడంతో మంజీరా నది, పుష్పాల వాగు, నక్క వాగు, మహబూబ్నగర్ కెనాల్ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

News August 28, 2025

గణనాథునికి పూజలు నిర్వహించిన ADB ఎస్పీ

image

ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో భక్తిశ్రద్ధలతో గణనాథునికి ఘనంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని స్వయంగా మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్ఠించారు. గణపతి ఉత్సవాలను ప్రజలందరూ పోలీసుల సూచనలను పాటిస్తూ, వర్షం దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తూ ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. ఏఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఇంద్రవర్ధన్ ఉన్నారు.