Telangana

News May 31, 2024

HYD: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల రిహార్సల్స్‌.. ట్రాఫిక్‌ ఆంక్షలు

image

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల రిహార్సల్స్‌ సందర్భంగా గన్‌పార్క్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌, ట్యాంక్‌బండ్‌ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై శుక్రవారం ఆంక్షలుంటాయని పోలీస్‌ అధికారులు తెలిపారు. గన్‌పార్క్‌ పరిసరాల్లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, పరేడ్‌ గ్రౌండ్స్‌ వద్ద ఉదయం 10నుంచి 11 గంటల వరకు, ట్యాంక్‌బండ్‌పై రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయన్నారు.

News May 31, 2024

నేటి నుంచి తెరుచుకోనున్న సినిమా థియేటర్లు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పది రోజులకు పైగా మూతబడి ఉన్న
థియేటర్లు శుక్రవారం తెరుచుకోనున్నాయి. ఈనెల 17 నుంచి సినిమా హాళ్లను మూసి ఉంచుతున్నట్లు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. నాటి నుంచి మూతబడిన హాళ్లను తిరిగి తెరవాలని అసోసియేషన్ గురువారం నిర్ణయించడంతో నేటి నుంచి ఉమ్మడి జిల్లాలోని 30 థియేటర్లలో సినిమాలు ప్రదర్శించనున్నారు.

News May 31, 2024

WGL: ఈ ఫుడ్ తింటే బెడ్డే

image

WGL నగరంలోని పలు ఖరీదైన రెస్టారెంట్లలో గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీళ్లో బూజుపట్టిన చికెన్, బొద్దింకలతో కూడిన ఇండ్లీ పిండి, ఈగల చెట్నీ, కుళ్లిన గుడ్లు, కూరగాయలు వెలుగు చూశాయి. దీంతో అధికారుల పర్యవేక్షణ లేక యాజమాన్యాలు ఇష్టారీతిన ఆహారం తయారు చేస్తూ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఫుడ్ తింటే బెడ్ ఎక్కడం ఖాయమని ప్రజలు ఫైర్ అవుతున్నారు.

News May 31, 2024

KNR: అధికారిని బురిడీ కొట్టించిన తల్లీకూతుళ్లు

image

ఓ ప్రభుత్వ అధికారిని తల్లీకూతుళ్లు మోసం చేసిన ఘటన గోదావరిఖనిలో జరిగింది. శ్రీరాంపూర్‌‌కి చెందిన ఓ సింగరేణి అధికారికి అదే ప్రాంతానికి చెందిన శ్రీలత, భవానీ పరిచయమయ్యారు. అతడి వద్ద ఉన్న బంగారాన్ని కాజేయాలని శ్రీలత భర్త వెంకటేశ్వర్లుతో కలిసి పథకం వేశారు. అతడి వద్దకు భవానీని పంపించి వారిద్దరు కలిసి ఉండగా పట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి 9 తు. బంగారం, రూ.1.90లక్షల నగదు, రూ.20 లక్షల చెక్కు రాయించుకున్నారు.

News May 31, 2024

మంచిర్యాల: అధికారిని బురిడీ కొట్టించిన తల్లీకూతుళ్లు

image

ఓ ప్రభుత్వ అధికారిని తల్లీకూతుళ్లు మోసం చేసిన ఘటన గోదావరిఖనిలో జరిగింది. శ్రీరాంపూర్‌‌కి చెందిన ఓ సింగరేణి అధికారికి అదే ప్రాంతానికి చెందిన శ్రీలత, భవానీ పరిచయమయ్యారు. అతడి వద్ద ఉన్న బంగారాన్ని కాజేయాలని శ్రీలత భర్త వెంకటేశ్వర్లుతో కలిసి పథకం వేశారు. అతడి వద్దకు భవానీని పంపించి వారిద్దరు కలిసి ఉండగా పట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి 9 తు. బంగారం, రూ.1.90లక్షల నగదు, రూ.20 లక్షల చెక్కు రాయించుకున్నారు.

News May 31, 2024

నానో యూరియా వినియోగం అంతంత మాత్రమే!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు నానో ఎరువు 2, 3 శాతం కూడా వినియోగించడం లేదని తెలుస్తోంది. సాధారణ యూరియా బస్తా వేస్తే 30 శాతం పంటకు అందుతుండగా, నానో యూరియా వినియోగిస్తే 80 శాతం అందుతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. అరలీటర్ సీసాలో లభించే నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాతో సమానం. రాయితీ పోను యూరియా బస్తా ధర రూ.266 ఉండగా, నానో యూరియా రూ.240కే లభ్యమవుతుంది.

News May 31, 2024

ఉద్యమానికి ఊపిరి ‘భాగ్యనగరం’

image

ప్రజల బలిదానాలు, అనేక మంది పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా ఇప్పటికీ నగరంలోని పలు ప్రాంతాలు ఆనాటి ఘటనలను గుర్తుచేస్తుంటాయి. 2009నవంబర్ 9న LBనగర్ చౌరస్తాలో శ్రీకాంతచారి బలిదానం, 2010జనవరి 3న OUలో విద్యార్థి మహాగర్జన, 2011మార్చి 10న HYDలో మిలియన్ మార్చ్, 2011సెప్టెంబర్ 13న ప్రారంభించిన సకలజనుల సమ్మె మలిదశోద్యమంలో ఓ మైలురాయిగా నిలిచింది.

ఖమ్మం ఎంపీ ఎవరో.. ! తేలేందుకు 4 రోజులే

image

మరో నాలుగు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థుల భవిష్యత్తు ఏంటో తేలిపోనుంది. జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందుతారని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సైతం తమ అభ్యర్థి గెలుస్తారనే ధీమాతో ఉన్నారు. మరి ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి!

News May 31, 2024

ఖమ్మం: భూగర్భ జలాలు పెరిగాయి..

image

ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా ఇటీవల కొన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. దీంతో ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్‌తో పోలిస్తే మేలో భూగర్భజలాలు పెరిగాయి. బోనకల్ మండలంలో 0.34, ముదిగొండ 0.25, కొణిజర్ల 0.71, సింగరేణి 1.88, కామేపల్లి 0.06, ఎర్రుపాలెం 1.83, రఘునాథపాలెం 0.46, సత్తుపల్లి 1.26, వేంసూరులో 1.11 మీటర్ల మేర నీటి మట్టం పెరిగింది. జిల్లాలో సగటున 0.26 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయి.