Telangana

News September 9, 2025

NLG: రైతు వేదికలో యూరియా

image

రైతులకు <<17654369>>యూరియా సరఫరాలో<<>> ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్‌ల వద్ద రద్దీని తగ్గించడానికి, రైతు వేదికల నుంచి యూరియాను విక్రయించనున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 34 రైతు వేదికల్లో ఇప్పటికే నిల్వలు అందుబాటులో ఉంచారు. రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చూడటం, రద్దీని తగ్గించడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం అని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్‌ తెలిపారు.

News September 9, 2025

ఖమ్మం: నత్తనడకన రోడ్ల విస్తరణ పనులు

image

ఖమ్మం నగరం సుందరీకరణ, ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని రోడ్ల విస్తరణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ పనులు చాలా వరకు సగంలోనే మిగిలిపోయాయి. రిక్కాబజార్, చెరువు బజార్, రైల్వే స్టేషన్ రోడ్డు, PSR రోడ్డు, RTA కార్యాలయ రోడ్ల విస్తరించేందుకు పనులను ప్రారంభించగా.. వీటిలో కొన్ని రోడ్లు వెడల్పు చేయకుండానే నిలిచిపోయాయి. ఇలాగైతే పనులు ఎప్పటికి పూర్తి చేస్తారోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News September 9, 2025

HYD: మోత మోగిన కరెంట్ బిల్లు.. హీటర్ కారణమే

image

గ్రేటర్ HYD పరిధి తార్నాక, మల్లాపూర్, ఉప్పల్, చాంద్రాయణగుట్ట సహా అనేక ప్రాంతాల్లో వాటర్ హీటర్లతో మీటర్ల రీడింగ్‌లు గిర్రుమని తిరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలలో కరెంటు బిల్లు రాగా, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం ఉన్నవారికి 200 యూనిట్లు దాటింది. దీంతో కరెంటు బిల్లు చెల్లించక తప్పని పరిస్థితి. పలువురికి రీడింగ్ ఎక్కువగా రావటానికి కారణాలు పరిశీలిస్తే, అనేక మంది అత్యధికంగా వాటర్ హీటర్లు వాడినట్లు తేలింది.

News September 9, 2025

వరంగల్: 136 ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

image

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా ప్రజల నుంచి 136 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ సమస్యలు 60, జీడబ్ల్యూఎంసీ 21, విద్యాశాఖ 11, సహకార శాఖ 9, గృహ నిర్మాణ శాఖ 7, ఇతర శాఖలకు 28 ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News September 9, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష
∆} ఎర్రుపాలెంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన
∆} కూసుమంచి: విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} మధిర ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు సొసైటీలో యూరియా సరఫరా
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

News September 9, 2025

NZB: మూడేళ్ల చిన్నారికి అరుదైన చికిత్స

image

NZBలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో మూడేళ్ల చిన్నారికి అరుదైన గుండె ప్రొసీజర్ విజయవంతమైంది. పుట్టిన వెంటనే సహజంగా మూసుకుపోవాల్సిన రక్తనాళం తెరుచుకొని ఉండటంతో చిన్నారి తీవ్ర సమస్యలు ఎదుర్కొంది. ఈ క్రమంలో వైద్యులు శస్త్రచికిత్స చేయకుండా ప్రత్యేక గుండె ప్రొసీజర్ ద్వారా రంద్రం మూసేసినట్లు Dr. సందీప్ రావు, సదానంద రెడ్డి ప్రకటించారు. చిన్నారికి సకాలంలో సరైన చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.

News September 9, 2025

NLG: ఓపెన్ టెన్త్, ఇంటర్‌కు గడువు పెంపు

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఓపెన్ టెన్త్, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు చిట్యాల ఎంఈవో సైదా నాయక్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఆలస్య రుసుముతో ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

News September 9, 2025

ADB: ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో పోస్ట్.. ఐదుగురిపై కేసు

image

ఆదిలాబాద్ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. పట్టణానికి చెందిన గణేష్, గౌతం, ప్రశాంత్, మునీశ్వర్, మహేష్ ఎమ్మెల్యే పేరుతో వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారన్నారు. వాటిని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసిన పోస్టులు గొడవలకు దారి తీసేలా ఉండటంతో నిందితులపై కేసులు నమోదు చేశామన్నారు.

News September 9, 2025

NZB: బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి నియామకం

image

బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి నియమితులయ్యారు. ఈ అవకాశం కల్పించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించి పార్టీ ఎదుగుదలకు శాయశక్తులా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

News September 9, 2025

KNR: మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్ మానవాళికి ఆదర్శం

image

నగరంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మర్కజి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ఘనంగా నిర్వహించారు. హుస్సేనీపురా బొంబాయి స్కూల్ నుంచి రాజీవ్ చౌక్ కరీముల్లాషా దర్గా వరకు ర్యాలీ తీశారు. తెలంగాణ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన పండుగ వేడుకల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మతపెద్దలు ప్రసంగిస్తూ మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్ మానవాళికి ఆదర్శమన్నారు.