India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లాలో నీట మునిగిన ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం మెదక్ ఎస్పీ కార్యాలయంలో వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలపై సమీక్ష చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఇన్‌ఛార్జ్ మంత్రి డా.వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను హరీశ్ రావు సైతం సందర్శించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
స్థానిక సంస్థలు ఎన్నికలు, నగరంలో ఉపఎన్నిక, రానున్న GHMC ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్న ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు గణపతి ఉత్సవాలు వేదికయ్యాయని గ్రామాల్లో, నగరంలో యువకుల మాట. వీరికి దగ్గరయ్యేందుకు యువజన సంఘాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎంత ఖర్చైనా చేసేందుకు నేతలు పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ కామెంట్.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నందున అటువైపు వెళ్లవద్దని, రోడ్లపైకి వర్షం నీరు చేరడంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంటికే పరిమితం కావాలని సూచించారు.
మెదక్ జిల్లా హవేలీ ఘనాపూర్ మండలం సర్ధనలో అత్యధికంగా 31 సెంమీ (316 మిమీలు) వర్షపాతం నమోదయింది. నాగపూర్‌లో 277.3 మిమీలు, చేగుంటలో 230.5 మిమీలు, రామాయంపేటలో 208, మెదక్‌లో 206 మిమీల వర్షపాతం నమోదైంది. మెదక్ ప్రాంతంలో అత్యధిక వర్షం కురవడంతో మంజీరా నది, పుష్పాల వాగు, నక్క వాగు, మహబూబ్నగర్ కెనాల్ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో భక్తిశ్రద్ధలతో గణనాథునికి ఘనంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని స్వయంగా మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్ఠించారు. గణపతి ఉత్సవాలను ప్రజలందరూ పోలీసుల సూచనలను పాటిస్తూ, వర్షం దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తూ ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. ఏఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఇంద్రవర్ధన్ ఉన్నారు.
HYDలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు తెలిపారు. గ్రేటర్లో ఇప్పటికి 500కుపైగా ఈ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, జాయింట్ పెయిన్స్, బీపీ తగ్గటం, కాళ్లు చేతులు చల్లబడటం, కాళ్ల వాపు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని OUMC ప్రిన్సిపల్ రాజారావు సూచించారు. శివారులో పారిశుద్ధ్యం లోపించడం, కొందరు ప్రైవేట్ స్థలాలను శుభ్రంగా ఉంచకపోవడంతో దోమలు వ్యాపిస్తున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈనెల 28న సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విద్యార్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
యాలాల మండలం అన్నసాగర్ గ్రామం ఐక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ సుమారు 200 కుటుంబాలు ఏకతాటిపై పండుగలు జరుపుకుంటాయి. ప్రతి సంవత్సరం అంజనేయస్వామి ఆలయంలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఐదు రోజుల పాటు పూజలు, అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం గ్రామస్థుల మధ్య సోదరభావాన్ని పెంచుతోంది.
ఎంతటి వర్షం పడినా వరదలు సంభవించకుండా, ఎక్కడి నీరు అక్కడ భూమిలోకి ఇంకేలా హైడ్రా చర్యలు చేపట్టనుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వర్షం కురిసినపుడు 100 లీటర్లు కురిస్తే అందులో 40 లీటర్లు భూమిలోకి ఇంకుతుంది. HYD నగరంలో ఇలాంటి పరిస్థితి లేదు. 98 లీటర్ల నీరు మురుగు కాలువల్లో కలుస్తోందని 2 లీటర్ల నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతోందని హైడ్రా ఓ రిపోర్టులో పేర్కొంది.
హైదరాబాద్‌లో త్వరలో మరో 4 చెరువులు అందుబాటులోకి రానున్నాయి. ఉప్పల్ నల్ల చెరువు, బమృక్ దౌలా చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, తమ్మిడికుంట అందుబాటులోకి వస్తాయని హైడ్రా తెలిపింది. అంతేకాక రాబోయే కొద్ది నెలలలోనే రెండో విడతలో మరో 13 చెరువుల అభివృద్ధిని చేపడతామని పేర్కొంది. చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించింది.
Sorry, no posts matched your criteria.