Telangana

News May 29, 2024

ADB: దాడికి పాల్పడిన భర్తపై కేసు నమోదు

image

ఆదిలాబాద్‌లోని మహాలక్ష్మివాడకు చెందిన మహమూద్-అఫ్సాన దంపతుల మధ్య గతేడాది నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే గతేడాది అఫ్సాన పోలీసు స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసి పుట్టింట్లోనే ఉంటోంది. సోమవారం మహమూద్ అత్తారింటికి వెళ్లి కాపురానికి రావాలని భార్యను కోరాడు. ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడై బండరాయితో కడుపులో కొట్టాడు. దీంతో బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేశారు.

News May 29, 2024

హైదరాబాద్‌లో హోటళ్ల‌కు నోటీసులు

image

ఫుడ్ సేఫ్టీ అధికారులు గత 42 రోజుల్లో 83 రెస్టారెంట్లు, తదితర హోటల్స్‌ను తనిఖీ చేసినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 16 నుంచి మే 27 వరకు రైడ్స్‌ జరిగాయన్నారు. గ్రేటర్‌‌లో నిల్వచేసిన మాంసం, ఎక్స్‌పైరీ అయిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డించిన 58 రెస్టారెంట్‌లు, అపరిశుభ్రత‌తో పాటు లైసెన్స్‌ లేని మరో 10 హోటళ్లకు నోటీసులు అందించామన్నారు. ఇక జూన్ 1 నుంచి నిబంధనలు పాటించని హోటళ్లకు FINE విధించనున్నారు. SHARE IT

News May 29, 2024

హైదరాబాద్‌లో హోటళ్ల‌కు నోటీసులు

image

ఫుడ్ సేఫ్టీ అధికారులు గత 42 రోజుల్లో 83 రెస్టారెంట్లు, తదితర హోటల్స్‌ను తనిఖీ చేసినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 16 నుంచి మే 27 వరకు రైడ్స్‌ జరిగాయన్నారు. గ్రేటర్‌‌లో నిల్వచేసిన మాంసం, ఎక్స్‌పైరీ అయిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డించిన 58 రెస్టారెంట్‌లు, అపరిశుభ్రత‌తో పాటు లైసెన్స్‌ లేని మరో 10 హోటళ్లకు నోటీసులు అందించామన్నారు. ఇక జూన్ 1 నుంచి నిబంధనలు పాటించని హోటళ్లకు FINE విధించనున్నారు.
SHARE IT

News May 29, 2024

2024@ ఎలక్షన్.. జనగామ ఫస్ట్, మహబూబాబాద్ లాస్ట్

image

ఈనెల 27న WGL-KMM-NLG ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో ఉమ్మడి WGL వ్యాప్తంగా 73.80 శాతం పోలింగ్ నమోదయింది. 2021తో పోలిస్తే 3.02శాతం పోలింగ్ తగ్గింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ పరిశీలిస్తే 76.34శాతంతో జనగామ అగ్రస్థానంలో నిలవగా.. ములుగు రెండో స్థానంలో నిలిచింది. WGL-3, BHPL-4, HNK-5 స్థానంలో ఉండగా.. 72.15శాతంతో మహబూబాబాద్ చివరి స్థానంలో నిలిచింది.

News May 29, 2024

గోదావరిఖని: పుట్టినరోజు.. ఆదర్శవంతమైన నిర్ణయం

image

గోదావరిఖని గంగానగర్‌కు చెందిన అపరాధి ప్రశాంత్ కుమార్ మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. తన మరణానంతరం నేత్ర, అవయవ దానం చేస్తున్నట్లు సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులకు అంగీకార పత్రాన్ని అందించారు. ఈ మేరకు ఫౌండేషన్ ప్రతినిధులు ఆయనకు డోనర్‌ కార్డును అందించి అభినందించారు. లింగమూర్తి, వాసు, సురేష్ కుమార్, అవినాష్, రాజు, పవన్, శేఖర్, సతీశ్ ఉన్నారు.

News May 29, 2024

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు: కలెక్టర్ వెంకట్రావు

image

జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ పార్లమెంట్, శాసన మండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం సూచనల మేరకు ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడకూడా వేడుకల్లో కోడ్ వైలేషన్ కాకుండా చూడాలన్నారు.

News May 29, 2024

జూన్ 1లోపే పూర్తి చేయాలి: వికాస్ రాజ్

image

జూన్ 4న నిర్వహించనున్న ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అన్ని జిల్లాలలో ఏర్పాట్లను జూన్ 1లోపే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుపై మంగళవారం ఆయన HYD నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు , ఎస్పీలు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News May 29, 2024

ఓట్ల లెక్కింపుపై వీడియో కాన్ఫరెన్స్.. పాల్గొన్న కలెక్టర్

image

జూన్ 4వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రక్రియపై ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, తదితరులు పాల్గొన్నారు.

News May 29, 2024

కొండగట్టులో పెద్ద జయంతి ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

image

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం సాయంత్రం సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని, తర్వాత పెద్ద జయంతి ఏర్పాట్లను ఆలయ ఈఓతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రత ఏర్పాట్లపై పలు సూచనలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవిచందర్, సీఐ నీలం రవి ఉన్నారు.

News May 29, 2024

ఆదిలాబాద్‌లో బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు

image

బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఆయనకు జిల్లా బీసీ సంఘం నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు హన్మండ్లు యాదవ్,
నారాయణ, దేవేందర్, రవికాంత్ యాదవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.