Telangana

News May 29, 2024

వనపర్తి: గ్రూప్1 అభ్యర్థుల సందేహాల నివృత్తికి హెల్ప్‌డెస్క్ : కలెక్టర్

image

జూన్ 9న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు పరీక్ష కేంద్రం లేదా మరేదైనా సందేహాల నివృతి కోసం కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. జూన్ 8 ఉ.10 నుంచి సా. 6 వరకు తిరిగి 9న ఉ. 6 నుంచి మ. 2 వరకు 08545-233525 సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సందేహాలనివృత్తికి అభ్యర్థులు హెల్ప్‌లైన్ నంబరు‌ను వాడుకోవాలన్నారు.

News May 29, 2024

సిద్దిపేట: గ్రూప్-1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

గ్రూప్-1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి అన్నారు. TGPSC గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో భాగంగా మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని మంగళవారం సమావేశం నిర్వహించారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్, అబ్జర్వర్స్, రూట్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్‌తో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్‌తో కలిసి చర్చించారు.

News May 29, 2024

ఆర్మూర్ పట్టణంలో పర్యటించిన ఎంపీ అరవింద్

image

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంగళవారం రోజు ఆర్మూర్ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఆర్మూర్ పట్టణానికి చెందిన రాజశేఖర్ ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఎంపీ అరవింద్‌ను కలవడం ఆనందంగా ఉందన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో పలు అంశాలపై చర్చించామన్నారు.

News May 28, 2024

MBNR: ప్రైవేట్ వ్యక్తులు ఆర్టీవో కార్యాలయంలో విధులు

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు మంగళవారం తెలిపారు. నేడు ఏసీబీ అధికారులు ఆర్టీవో కార్యాలయంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ముగ్గురు పట్టుబడ్డారు. ఎలాంటి అధికారం లేకున్నా అధికారులతో కుమ్మక్కై విధులు నిర్వహించడం చాలా విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News May 28, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం చెరువులో యువకుడి గల్లంతు. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ముస్తాబాద్ మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య. @ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ను సజావుగా నిర్వహించాలన్న జగిత్యాల కలెక్టర్. @ కరీంనగర్ నుండి హనుమకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్ డ్రైవర్ పై దాడి. @ మల్యాల మండలంలో చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఎన్టీఆర్ జయంతి.

News May 28, 2024

లక్షెట్టిపేట: ఉరేసుకొని ఒకరి ఆత్మహత్య

image

మంచిర్యాల లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి గ్రామానికి చెందిన అంజన్న(29)అనే వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. మృతుడు కూలి పని చేసుకునేవాడన్నారు. సంవత్సర కాలంగా కడుపునొప్పి, సైనస్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ ఉండేవాడు. ఆసుపత్రులలో చూపించి మందులు వాడినా వ్యాధి నయం కాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని తెలిపారు.

News May 28, 2024

మాక్లూర్: ప్రమాదవశాత్తు చెరువులో పడి గేదెల కాపరి మృతి

image

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్రపల్లి గ్రామ చెరువులో పడి గేదెల కాపరి మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన దుర్గయ్య (65) గేదెలను చెరువులోకి తీసుకెళ్లాడు. కాగా అక్కడ దుర్గయ్య కాలుజారి చెరువులో పడగా ఊపిరాడక మృతి చెందాడు. మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి, పంచనామ నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News May 28, 2024

ఆర్మూర్: రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంక్ 

image

ఆర్మూర్ పట్టణం మామిడిపల్లికి చెందిన దొండి హర్షిని మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన డోండి ప్రకాష్, సునీత కుమార్తె హర్షిని మోడల్ స్కూల్ ఆరవ తరగతిలో చేరడానికి ప్రవేశ పరీక్ష రాసింది. ఈ ప్రవేశ పరీక్షలో 100కు గాను 90 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించగా జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది.

News May 28, 2024

HYD: వృష‌ణాల్లో‌ డంబెల్‌ ఆకారంలో కణితి.. ఆపరేషన్ సక్సెస్

image

HYDలో డాక్టర్లు అరుదైన ఆపరేషన్‌ చేశారు. కడప జిల్లా వాసి(39)కి ఏడాది క్రితం మూత్రపిండాలు ఫెయిల్ కావడంతో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. నాటి నుంచి తదితర మెడిసిన్స్ వాడారు. ఇటీవల వృష‌ణాల్లో వాపు రావడంతో బంజారాహిల్స్‌లోని AINUలో అడ్మిట్ అయ్యారు. టెస్టులు చేసిన డాక్టర్లు డంబెల్ ఆకారంలోని క‌ణితి పెరిగినట్లు గుర్తించారు. సోమవారం ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి పేషెంట్‌ను కాపాడారు.

News May 28, 2024

HYD: వృష‌ణాల్లో‌ డంబెల్‌ ఆకారంలో కణితి.. ఆపరేషన్ సక్సెస్

image

HYDలో డాక్టర్లు అరుదైన ఆపరేషన్‌ చేశారు. కడప జిల్లా వాసి(39)కి ఏడాది క్రితం మూత్రపిండాలు ఫెయిల్ కావడంతో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. నాటి నుంచి తదితర మెడిసిన్స్ వాడారు. ఇటీవల వృష‌ణాల్లో వాపు రావడంతో బంజారాహిల్స్‌లోని AINUలో అడ్మిట్ అయ్యారు. టెస్టులు చేసిన డాక్టర్లు డంబెల్ ఆకారంలోని క‌ణితి పెరిగినట్లు గుర్తించారు. సోమవారం ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి పేషెంట్‌ను కాపాడారు.