Telangana

News May 28, 2024

ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా బాధాకరం: మానకొండూరు ఎమ్మెల్యే

image

ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా బాధాకరమని మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం సిగ్గు చేటని కరీంనగర్‌లో జరిగిన సమావేశంలో తెలిపారు. మాజీ ఐజీ రాధాకిషన్ రావు వారి వాంగ్మూలంలో తన పేరు చెప్పడం చాలా బాధాకరమని పేర్కొన్నారు.

News May 28, 2024

పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ హనుమంతు

image

యాదాద్రి జిల్లాలో పదో తరగతి సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖల జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ హనుమంత్ ఆదేశించారు. వచ్చే జూన్ 3 నుంచి 11 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష సమయానుకూలంగా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

News May 28, 2024

ఆదిలాబాద్: ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ షురూ

image

జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఈవీఏంల ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పోస్టల్, ఈవీఎం ఓట్ల లెక్కింపుకు వేరువేరుగా టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా మొత్తం పూర్తి స్థాయి ఫలితాల వెల్లడికి మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం పడుతుందని పేర్కొన్నారు..

News May 28, 2024

నాగర్‌కర్నూల్: చిన్నారుల మృతి.. రీజన్ ఇదే!

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో దారుణం జరిగింది. నీటిగుంతలో నీళ్లు తీసుకురావడానికి వెళ్లిన 3 చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిగుంతలో పడ్డారు. చిన్నారుల అర్తనాదాలు విన్న స్థానికులు గుంత దగ్గరికి వెళ్లి ఒకరిని బయటికి తీయగా ఇద్దరు <<13332379>>చిన్నారులు<<>> మహమ్మద్ ఫుర్ఖాన్ (10) , మహమ్మద్ హుస్సేన్ (13) నీటమునిగి మృతిచెందారు. మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది.

News May 28, 2024

నిర్మల్: ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

image

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన తానూర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కర్బలా గ్రామానికి చెందిన సాయినాథ్ (35) వ్యవసాయ భూమిలో భూమిని చదను చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపు తప్పి డ్రైవర్ పై పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికుల తెలిపారు. భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News May 28, 2024

నాగర్‌కర్నూల్: ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

image

నాగర్‌కర్నల్ జిల్లా బిజినేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. వారి మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

News May 28, 2024

సాలూర్ అంతరాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద ఏసీబీ తనిఖీలు

image

రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ జిల్లా సాలూర అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. చెక్ పోస్టు వద్ద ఆర్టీఏ అధికారులు వాహనదారుల నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నారనే సమాచారంతో నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 28, 2024

సెమీఫైనల్‌లో మెదక్ జట్టు విజయం

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో మెదక్ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మెదక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం జిల్లా జట్టు 17.4 ఓవర్లలో 84 పరుగులకు అలౌట్ అయింది. 53 పరుగుల తేడాతో ఖమ్మంపై మెదక్ జట్టు విజయం సాధించింది.

News May 28, 2024

రేపటి నుంచి కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు

image

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 29 నుంచి 1 వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. మూడు రోజుల పాటు ఆలయంలో నిర్వహించనున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, దీక్షాపరులు లక్షల సంఖ్యలో తరలిరానున్నందున ఆర్జిత సేవలు రద్దు చేశారు. కాగా, జయంతికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మ తెలిపారు.

News May 28, 2024

రేపటి నుంచి కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు

image

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 29 నుంచి 1 వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. మూడు రోజుల పాటు ఆలయంలో నిర్వహించనున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, దీక్షాపరులు లక్షల సంఖ్యలో తరలిరానున్నందున ఆర్జిత సేవలు రద్దు చేశారు. కాగా, జయంతికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండెంట్  శ్రీనివాస్ శర్మ తెలిపారు.