Telangana

News May 28, 2024

వరద భయం.. బిక్కుమంటూ ధర్మపురి పట్టణ ప్రజలు

image

ధర్మపురిలో ఏటా గోదావరి వరదల వల్ల తీర ప్రాంత ప్రజలు సర్వం కోల్పోతున్నారు. నిర్మల్ జిల్లాలో ఉన్న కడెం ప్రాజెక్ట్ కారణంగా అధిక వర్షాలతో వరద పోటెత్తి.. ఆ ప్రభావం ధర్మపురి పట్టణంపై పడుతోంది. ధర్మపురిలో తెనుగువాడ, కుమ్మరివాడ, భ్రాహ్మణసంఘం, తెలుగు కళాశాల, రామాలయం. మంగళిగడ్డ, బోయవాడ, ఒడ్డెర కాలనీలను ముంపు ప్రాంతాలుగా గుర్తించి, వరద నివారణకై కరకట్ట నిర్మాణానికి రూ.4 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశారు.

News May 28, 2024

MBNR: హరితహారం కార్యక్రమానికి సిద్దమవుతున్న యంత్రాంగం

image

హరితహారం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పేరుతో తొమ్మిది విడతలుగా కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే తొలి విడత కానుంది. అయితే ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో మొక్కలు పెంచుతున్నారు. కాగా ఈసారి జిల్లాకు హరితహారం కింద 30.87 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు.

News May 28, 2024

HYD: వీధి దీపాలు లేక ప్రజల ఇబ్బందులు

image

గ్రేటర్ HYD పరిధిలో పాడైపోయిన లైట్లకు మరమ్మతులు జరగట్లేదు. కొత్త ప్రాంతాల్లో, ప్రమాదాలు జరిగే చీకటి ప్రాంతాల్లో కొత్త వీధిలైట్ల ఏర్పాటు అందని ద్రాక్షగా మారింది. దీని వల్ల ప్రజలు నరకం చూస్తున్నారు. పాదచారులు రహదారులపై నడవలేకపోతున్నారు. ముందు నడుస్తూ వెళ్లే వారిని వాహనదారులు గమనించలేకపోతున్నారు. దుర్భర పరిస్థితులతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని సర్వాత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

HYD: పిల్లలను ఎత్తుకెళుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

image

HYDలో పిల్లలను ఎత్తుకెళుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. 16 మంది చిన్నారులను ఘట్‌కేసర్ పరిధి మేడిపల్లి పోలీసులు కాపాడారు. ఇందులో HYDతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన చిన్నారులు సైతం ఉన్నట్లు వారు గుర్తించారు. తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ఒంటరిగా బయటకు పంపించొద్దని పోలీసులు సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే తమకు తెలియజేయాలన్నారు. SHARE IT

బిక్కనూర్‌లో ఉపాధి హామీ కూలి మృతి

image

ఉపాధి పని చేస్తూ కూలి మృతి చెందిన ఘటన బిక్కనూర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలానికి చెందిన అంబల్ల పెద్ద మల్లయ్య(60) మంగళవారం ఉపాధి పనికి వెళ్లాడు. పని చేస్తుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలాడు. దీంతో తోటి కూలీలు ఆసుపత్రికి తరలించారు. కాగా అతడు గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News May 28, 2024

ADB: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకంలో జనరల్ వర్క్, సూపర్ వైజర్, వెల్డింగ్, ఎలక్ట్రిషియన్, పైపు ఫిట్టర్, ప్లంబింగ్, పెయింటింగ్ అండ్ డెకరేషన్ కోర్సుల్లో 3 నెలలపాటు ఉచిత శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News May 28, 2024

భద్రాద్రి: రూ.1.23 కోట్ల గంజాయి పట్టివేత

image

భద్రాద్రి జిల్లా పోలీసులు గంజాయిని భారీగా పట్టుకున్నారు. దీని విలువ రూ.1.23 కోట్లుగా లెక్కగట్టారు. సీఐ శివప్రసాద్ వివరాల ప్రకారం.. ఎస్సై పురుషోత్తం తన బృందంతో కలిసి స్థానిక పాత బస్‌డిపో వద్ద సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఓ డీసీఎం వ్యానును సోదా చేయగా క్యాబిన్ వెనుక అనుమానం రాకుండా నిర్మించిన బాడీ(అర) కనిపించింది. దాంట్లో 492 కిలోల గంజాయి పొట్లాలు లభ్యమయ్యాయి. 4గురిపై కేసు నమోదు చేశారు.

News May 28, 2024

వరంగల్: 2024 MLC ‘ఎలక్షన్ HIGH LIGHTS’

image

* జనగామ జిల్లాలో అత్యధిక ఓటింగ్ శాతం. 2021లోనూ జనగామనే టాప్.
* ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎన్నికల కంటే స్వల్పంగా పెరిగిన ఓటింగ్ శాతం.
* పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన MLC అభ్యర్థులు.
* సాయంత్రం 6గంటల వరకూ కొనసాగిన పోలింగ్.
* ఓటు హక్కును వినియోగించుకున్న ఉమ్మడి జిల్లా కలెక్టర్లు.
* భారీ బందోబస్తులో బ్యాలెట్ పెట్టెలను నల్గొండకు తరలింపు.