Telangana

News May 28, 2024

KNR: మాతాశిశు ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం!

image

మాతాశిశు ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం పేషెంట్ల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. తాజాగా ఓ మహిళ రక్తస్రావం కావడంతో మాతాశిశు కేంద్రంలో చేరగా.. రక్త పరీక్షలు నిర్వహించి ‘బీ పాజిటివ్‌’గా నిర్ధారించారు. ఈ క్రమంలో బ్లడ్ కోసం కుటుంబీకులు ఎంత వెతికినా దొరక్కపోవడంతో అనుమానం వచ్చి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చెక్ చేయించుకున్నారు. అది కాస్తా ‘ఓ పాజిటివ్‌’ రావడంతో కుటుంబీకులు మాతాశిశు కేంద్రాన్ని నిలదీశారు.

News May 28, 2024

MBNR: తాగి పోలీస్ బండి ఎత్తుకెళ్లాడు..!

image

మద్యం మత్తులో ఓ యువకుడు పోలీసు వాహనాన్ని అపహరించిన ఘటన గద్వాల జిల్లా ఎర్రవల్లి‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హైవే పెట్రోలింగ్ కానిస్టేబుల్ తమ వాహనాలు పక్కకు నిలిపి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో నిమగ్నమైయ్యాడు. మద్యం మత్తులో ఓ యువకుడు హల్ చల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడని పక్కకు పంపించారు. తర్వాత చూస్తే పెట్రోలింగ్ వాహనం అపహరణకు గురైంది. కోదండపురం ఓ పెట్రోల్ బంక్ వద్ద సోమవారం పోలీసులు గుర్తించారు.

News May 28, 2024

HYD: ఆర్టీసీ ITI కాలేజీలో ప్రవేశాలకు గోల్డెన్ ఛాన్స్

image

HYD శివారు మేడ్చల్ జిల్లా హకీంపేట్ వద్ద ఉన్న TGSRTC ITI కాలేజీలో మోటార్ మెకానికల్ వెహికల్, డీజిల్ మెకానిక్, పెయింటర్, వెల్డర్ విభాగాల్లో ఐటీఐ చేయడానికి గోల్డెన్ ఛాన్స్ ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 8, పదో తరగతి చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు HYD ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లను 9100664452, 040-23450033 సంప్రదించాలని సూచించారు. SHARE IT

HYD: వైద్యురాలిని వేధించిన విభాగాధిపతిపై బదిలీ వేటు

image

ఉస్మానియా ఆసుపత్రి సీటీ తొరాసిక్ సర్జరీ విభాగాధిపతి శ్రీనివాస్ రెడ్డి తనను మానసిక వేధింపులకు గురిచేస్తున్నట్లు డీఎంఈకి పీజీ వైద్యురాలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యా సంచాలకురాలు వాణి ప్రత్యేక కమిటీని నియమించారు. కమిటీ విచారణ చేపట్టి పీజీ వైద్యురాలిని వేధించిన ఘటనలో సంబంధిత విభాగాధిపతి శ్రీనివాస్ రెడ్డిని వనపర్తి మెడికల్ కళాశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

HYD: తెరుచుకున్న జేఎన్టీయూ కళాశాల

image

వేసవి సెలవులు అనంతరం JNTU ఇంజినీరింగ్ కళాశాల తెరుచుకుంది. మూడో ఏడాది వారికి ఇంటర్న్‌షిప్‌లను దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల 3వ తేదీ వరకు సెలవులు ఇవ్వగా, ఇటీవల నాలుగో ఏడాది విద్యార్థులు పరీక్షలు ముగించుకున్నారు. దీంతో కళాశాల మొదటి రోజు 1, 2వ ఏడాది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. కళాశాలలో మళ్లీ విద్యార్థుల కోలాహలం మొదలైంది. కాగా నాలుగో ఏడాది ఐడీపీ విద్యార్థులకు ప్రాజెక్ట్ వైవా కొనసాగుతుంది.

News May 28, 2024

పెరుగుతున్న సైబర్ మెసాలు.. జగిత్యాలో 546 కేసులు

image

ఉమ్మడి KNRవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. జగిత్యాల జిల్లాలో మొత్తం 546 కేసులు నమోవ్వగా.. వీటిలో UPI ద్వారా నగదు దోచుకున్న కేసులే 288 ఉన్నాయి. కోరుట్లకు చెందిన ఓ వ్యక్తిని పలువురు బెదిరించి రూ.4.23 కోట్లు కాజేశారు. వీరిలో పోలీసులు కొందరిని గుర్తించి అరెస్టు చేశారు. ఎవ్వరికీ బ్యాంకు డీటెయిల్స్ చెప్పొద్దని, మోసపోయామని గుర్తిస్తే 1903కి కాల్ చేసి చెప్పాలని జగిత్యాల DSP రఘు చందర్ తెలిపారు.

News May 28, 2024

HYD: తెరుచుకున్న జేఎన్టీయూ కళాశాల

image

వేసవి సెలవులు అనంతరం JNTU ఇంజినీరింగ్ కళాశాల తెరుచుకుంది. మూడో ఏడాది వారికి ఇంటర్న్‌షిప్‌లను దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల 3వ తేదీ వరకు సెలవులు ఇవ్వగా, ఇటీవల నాలుగో ఏడాది విద్యార్థులు పరీక్షలు ముగించుకున్నారు. దీంతో కళాశాల మొదటి రోజు 1, 2వ ఏడాది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. కళాశాలలో మళ్లీ విద్యార్థుల కోలాహలం మొదలైంది. కాగా నాలుగో ఏడాది ఐడీపీ విద్యార్థులకు ప్రాజెక్ట్ వైవా కొనసాగుతుంది.

News May 28, 2024

HYD: కాల్పులు జరిపిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి: ఒవైసీ

image

ఏఐఎంఐఎం మాలేగావ్ అధ్యక్షుడు అబ్దుల్ మాలిక్ పై కాల్పులు జరిపిన దుండగులను తక్షణమే గుర్తించి అరెస్ట్ చేయాలని హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. పథకం ప్రకారం తమ పార్టీ మాలేగావ్ అధ్యక్షుడిపై దుండగులు ఆదివారం రాత్రి మూడుసార్లు కాల్పులు జరిపి పారిపోయారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గాయపడ్డ అబ్దుల్‌ను ప్రైవేటు చేర్పించి చికిత్స జరిపిస్తున్నామని.. కాల్పుల ఘటనపై విచారణ జరపాలని కోరారు.