Telangana

News May 28, 2024

పాల్వంచ: ఉరి వేసుకుని ఆటో డ్రైవర్ సూసైడ్

image

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం పాల్వంచ మండలంలో జరిగింది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. పాల్వంచ మండలం జగన్నాథపురానికి చెందిన మాలోత్ రాము(52), ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాము సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు

News May 28, 2024

HYD: అక్రమ హోర్డింగుల తొలగింపుపై దృష్టి

image

నగరంలో కొన్ని రోజులుగా గాలిదుమారం రేగుతోంది. ఆదివారం పలు ప్రాంతాల్లో విపరీతమైన వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో అనేక ప్రాంతాల్లో హోర్డింగులపై ఏర్పాటు చేసిన ప్లెక్సీ బోర్డులు చెల్లాచెదురయ్యాయి. ఒకవేళ అవి వాహనాలపై పడితే. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో GHMC ప్రకటనల విభాగం అప్రమత్తమైంది. నగరవ్యాప్తంగా అక్రమ హోర్డింగులు, ఫ్లెక్సీ బోర్డులను తొలగించేందుకు ప్రైవేటు ఏజెన్సీలను ఆహ్వానించింది.

HYD: బిర్యానీ కోసం వెళ్లారు.. ఇంతలోనే విషాదం

image

HYDలో విషాద ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్ రాజు తెలిపిన వివరాలు.. గుంటూరు వాసులు యజ్ఞ నారాయణ(25), సత్యనారాయణ (30), సాయిపవన్(32) సికింద్రాబాద్ పద్మారావునగర్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ముగ్గురు కలిసి బైక్‌పై బిర్యానీ తినేందుకు బయటకు వెళ్లగా కవాడిగూడ క్రాస్ రోడ్ వద్ద ఓ మినీ బస్సు వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో యజ్ఞ నారాయణ, సాయిపవన్ మృతిచెందగా సత్యనారాయణకు గాయాలయ్యాయి. కేసు నమోదైంది.

KMM: ఓటేసేందుకు వస్తూ దంపతుల దుర్మరణం

image

భార్యతో ఓటు వేయించేందుకు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొని దంపతులిద్దరూ మృతి చెందిన ఘటన టేకులపల్లి మండలోని చోటుచేసుకుంది. SI సైదా రవూఫ్ వివరాలు.. సంపత్‌నగర్‌కు చెందిన పాయం జానకి(35)తో ఓటు వేయించేందుకు భర్త కృష్ణయ్య(39) బైక్‌పై టేకులపల్లికి వెళ్తుండగా లాలుతండా సమీపంలో కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిని వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. వీరికి కుమార్తె షణ్ముకప్రియ ఉన్నారు.

News May 28, 2024

KNR: ఈనెల 28, 29న సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లలో భాగంగా స్పోర్ట్స్, అంగవైకల్యం, NCC అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు దోస్త్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సుజాత తెలిపారు. దోస్త్ హెల్ప్ సెంటర్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులో వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుందని.. మిగతా వివరాలకు యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్ సంప్రదించాలని కోరారు.

News May 28, 2024

NLG: కుమారుడి మృతి తట్టుకోలేక తల్లి సూసైడ్

image

కుమారుడి మృతిని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హుజూర్‌నగర్ మండలం గోపాలపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ASI బలరాం రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఆత్కూరి అనంతరావమ్మ భర్తతో విడిపోయి కుమారుడితో కలిసి జీవిస్తుంది. ఇటీవల కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మనోవేదనకు గురై అనంతరావమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఆమె చెల్లెలు రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News May 28, 2024

కేసీఆర్ కాలనీలో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య

image

తాగుడుకు బానిసై ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ముస్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. చిప్పలపల్లి గ్రామం కేసీఆర్ కాలనీకి చెందిన శంకర్(45) తాగుడుకు బానిసయ్యాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేరు సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న లింగం సోమవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.

News May 28, 2024

ఖమ్మంలో 67.63%.. భద్రాద్రిలో 70.01%

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 2021లో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 78.36 శాతం పోలింగ్ నమోదైతే నిన్న జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 67.63 శాతం, భద్రాద్రి జిల్లాలో 70.01 శాతం పోలీంగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,23,985 మంది ఓటర్లు ఉండగా.. సాయంత్రం వరకు 51,053 మంది పురుషులు, 33,752 మహిళలు, 2 ఇతరులు ఓటేశారు.