Telangana

News May 28, 2024

WGL: గుండెపోటుతో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మృతి

image

గుండెపోటుతో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మృతి చెందిన ఘటన MHBD జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తొర్రూరు మండలానికి చెందిన రాపోలు ప్రభాకర్ దేవరుప్పుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన ఇంట్లో ఉన్న సమయంలో సోమవారం తెల్లవారుజామున హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారు.

News May 28, 2024

HYD: నేడు పలు MMTS రైళ్ల రద్దు

image

హఫీజ్‌పేట్-సనత్‌నగర్ మధ్య పాదచారుల వంతెన మరమ్మతుల కారణంగా పలు ఎంఎంటీఎస్ రైళ్లను కొన్నింటిని పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. నేడు (మంగళవారం) 7 ఎంఎంటీఎస్ లోకల్ సర్వీసులను పూర్తిగా.. 3 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మేడ్చల్-సికింద్రాబాద్ మధ్య నడిచే 6 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 28, 29, 30 తేదీల్లో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News May 28, 2024

HYD: నేడు పలు MMTS రైళ్ల రద్దు

image

హఫీజ్‌పేట్-సనత్‌నగర్ మధ్య పాదచారుల వంతెన మరమ్మతుల కారణంగా పలు ఎంఎంటీఎస్ రైళ్లను కొన్నింటిని పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. నేడు (మంగళవారం) 7 ఎంఎంటీఎస్ లోకల్ సర్వీసులను పూర్తిగా.. 3 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మేడ్చల్-సికింద్రాబాద్ మధ్య నడిచే 6 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 28, 29, 30 తేదీల్లో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News May 28, 2024

అమెరికాలో యాక్సిడెంట్.. యాదగిరిగుట్ట యువతి మృతి

image

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదగిరిగుట్టకు చెందిన యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. యాదగిరిపల్లి కాలనీకి చెందిన కోటేశ్వర్‌రావు, బాలమణి దంపతుల కుమార్తె సౌమ్య(24) 2022లో అమెరికాకు వెళ్లి 4 నెలల క్రితం ఫోరిడాలోని అట్లాంటిక్ యూనివర్శిటీలో MS పూర్తి చేసింది. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్న సౌమ్య ఆదివారం మార్కెట్‌కి వెళ్లి వస్తుండగా వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో మృతి చెందింది.

News May 28, 2024

MDK: సర్పంచ్ ఎన్నికలపై ప్రభుత్వం ఫోకస్.!

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో జరిగేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వాటిని సమకూర్చడంపై ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 647 పంచాయతీలు, 5,778 వార్డులు, సిద్దిపేట జిల్లాలో 499 పంచాయతీలు 4,476 వార్డులు, మెదక్​ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు, 4,086 వార్డులు ఉన్నాయి.

News May 28, 2024

MBNR: కొత్త రేషన్ కార్డులపై చిగురిస్తున్న ఆశలు!

image

ఉమ్మడి జిల్లాలో పదేళ్లుగా కొత్త ఆహార భద్రత (రేషన్) కార్డుల మంజూరు కాలేదు. ఏటా కుటుంబాల సంఖ్య పెరుగుతున్నా కార్డుల జారీ లేక ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు దక్కక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఊరట నిస్తోంది. గతం మాదిరి కాకుండా నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతోంది.

News May 28, 2024

నిజామాబాదీలు రూ.129 కోట్ల బీర్లు తాగేశారు

image

వేసవిలో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 151 వైన్స్, 29 బార్లు ఉన్నాయి. ఇక్కడ రోజుకు రూ.5కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా అందులో రూ.1.50కోట్ల బీర్ల విక్రయాలు జరుగుతున్నాయి. వేసవి మొదలైనప్పటి నుంచి బీర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ ఏడాది మార్చి నుంచి మే 27 నాటికి జిల్లా వాసులు రూ.129 కోట్ల విలువైన బీర్లు తాగారు.

News May 28, 2024

వరంగల్: 2021లో 76.82%, 2024లో 72.66 శాతం?

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పట్టభద్రులు సోమవారం పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారు. 2021లో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 76.82 శాతం పోలింగి నమోదయితే నిన్న జరిగిన ఎన్నికల్లో 72.66 శాతం అంటే.. 4.16% తక్కువ నమోదయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,68,727 మంది ఓటర్లు ఉండగా.. నిన్న సాయంత్రం వరకు 1,21,230 మంది ఓటేశారు. పలు చోట్ల సా.6గంటల వరకూ పోలింగ్ జరిగింది.

News May 28, 2024

ఆసిఫాబాద్: అన్న మందలించడంతో చెల్లి ఆత్మహత్య

image

అన్నయ్య మందలించాడని చెల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసిఫాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పల్ నవేగాం గ్రామానికి చెందిన గుమ్మూల సుష్మా పదో తరగతి పూర్తి చేసి ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది. అన్నయ్య అరుణ్.. తన చెల్లెలిని ‘ఇంట్లోనే ఖాళీగా ఉంటావు ఏదైనా పని చేసుకోవచ్చు’ అని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన సుష్మా పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

News May 28, 2024

కొండగట్టు అంజన్న భక్తులకు శుభవార్త

image

కొండగట్టు పుణ్యక్షేత్రంలో రాత్రి 8 గంటలకే గుడి తలుపులు మూసి వేస్తుండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని చొప్పదండి MLA సత్యం దృష్టికి భక్తులు తీసుకెళ్లడంతో ఆయన స్పందించారు. జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో MLA మాట్లాడి.. రాత్రి 10.30 గంటల వరకు గుడి తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ EOతో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.