Telangana

News May 28, 2024

గ్రూప్ 1 పరీక్షకు భద్రాద్రి జిల్లాలో 21 సెంటర్లు

image

రాష్ట్ర ప్రభుత్వం TSPSC ద్వారా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ ప్రవేశ పరీక్షకు జిల్లాలో 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. జూన్ 9న (ఆదివారం) ఉదయం 10:30 గంటల నుంచి 1:00 గంటల వరకు పరీక్షా ఉంటుందన్నారు. డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌ను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.

News May 27, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ధర్మారం మండలంలో కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య. @ మల్హర్రావు మండలంలో మామిడి చెట్టు పైనుండి పడి వ్యక్తి మృతి. @ వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఆలయాలలో భక్తుల రద్దీ. @ మెట్ పల్లి పట్టణంలో మురికి కాలువలో లభ్యమైన పసికందు మృతదేహం. @ ధర్మారం మండలంలో వడదెబ్బతో వృద్ధుడి మృతి. @ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఫర్టిలైజర్ షాప్ లలో తనిఖీలు.

News May 27, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి HEADLINES

image

> జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల MLC ఎన్నికలు
> కొత్తగూడ: న్యూమోనియాతో బాలుడు మృతి
> మొగుళ్లపల్లి: పిడిసిల్లలో కరెంటు షాకుతో మనవడు, అమ్మమ్మ మృతి
>కేసముద్రంలో ఓటు వేయకుండా వెనుదిరిగిన పట్టభద్రుడు
>బామ్మర్ది కోసం ఐనవోలుకు మోకాళ్లపై నడిచిన బావ
> 9వ రోజుకు చేరిన మల్లూరు లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
>MHBD: అస్వస్థతకు గురైన పోలింగ్ అధికారి
>WGL: ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్

News May 27, 2024

ALERT: రాష్ట్రంలో.. మంచిర్యాలలోనే అత్యధికం

image

రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాలో సోమవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని రోజుల పాటు వర్షాలు పడినప్పటికీ ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గడంలేదు. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బెల్లంపల్లిలో 45.7 హజీపూర్‌లో 44.9 డిగ్రీలు, అసిఫాబాద్‌లో 44.9, తిర్యాణిలో 44.9, మంచిర్యాల కొండాపూర్ 44.8, కౌటాల 44.7, వాంకిడిలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 27, 2024

RR: ధాన్యం కొనుగోళ్లలో తరగు సహించేదే లేదు..!

image

RR, మేడ్చల్, VKB జిల్లాల పరిధిలో వరి ధాన్యం కొనుగోళ్లలో తరగు సహించేది లేదని రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ DT మాచన రఘునందన్ హెచ్చరించారు. తాలు సహా ఇతర కారణాల పేరిట తరగు తీసి కొనుగోలు చేసే మిల్లర్లను ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎన్ని ట్రక్కులు ఎగుమతి అయ్యాయనే విషయంపై తనిఖీలు నిర్వహించారు.

News May 27, 2024

MBNR: రంగారెడ్డి మృతి.. సీఎం రేవంత్ రెడ్డి​ సంతాపం

image

నీటి పారుదల ప్రాజెక్టుల సలహాదారుడు, రిటైర్డ్‌ ఎస్ఈ ఎన్‌.రంగారెడ్డి మృతిపై సీఎం రేవంత్​ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌‌నగర్​ జిల్లా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పనులు పూర్తి చేయడానికి ఇటీవలే ఆయనను సలహాదారుగా నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

News May 27, 2024

HYD: రంగారెడ్డి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి​ సంతాపం

KMR: ఆటో, ట్రాక్టర్ ఢీ.. మహిళ మృతి

image

ఆటో, ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి చెందింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సోమవారం రాత్రి జరిగింది. రాంపూర్ గడ్డకు చెందిన ముగ్గురు మహిళలు ఆటోలో ఇంటికి వెళ్తుండగా.. కామారెడ్డి వైపు నుంచి అతివేగంగా ట్రాక్టర్ వచ్చి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్యావల లచ్చవ్వ (40) అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News May 27, 2024

ఉమ్మడి వరంగల్‌లో ఎమ్మెల్సీ పోలింగ్ వివరాలు ఇలా..

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం వరంగల్ -నల్గొండ -ఖమ్మం పట్టభద్రుల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో 70.83%, ములుగు 74.54%, జనగామ 76.28%, భూపాలపల్లి 69.16%, హనుమకొండ 72.16%, మహబూబాబాద్ జిల్లాలో 69.52% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. జనగామ జిల్లాలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది.