Telangana

News May 27, 2024

ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

జూన్ 4న కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా, పకడ్బందీగా నిర్వహించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News May 27, 2024

ఓయూ ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్), ఎంబీఏ (ఈవినింగ్) సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాల కోసం ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. సోమవారం ఉమ్మడి జిల్లా ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ మండలంలో 44.8°C, ధర్మపురి మండలం జైనలో 44.7.°C, ధర్మపురిలో 44.4°C, నేరెళ్లలో 44.4°C, కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలంలో 44.5°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News May 27, 2024

సంగారెడ్డి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

image

టీ-పీసీసీ పదవిపై ఆ పార్టీ నేత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. అధ్యక్ష పదవిని అడిగే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటుందన్నారు. బీజేపీలో ఆ స్వేచ్ఛ ఉండదన్నారు. ఇక బీఆర్ఎస్‌లో అయితే మరొకరికి అవకాశమే రాదని తెలిపారు. కాంగ్రెస్‌లో ఎవరైనా ధైర్యంగా పదవిని అడగవచ్చని వెల్లడించారు.

News May 27, 2024

నిర్మల్: రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

image

మామడ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం ఒకరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్‌హెచ్‌ 61పై దిమ్మదుర్తి గ్రామం నుంచి వస్తున్న బొలెరో, నిర్మల్‌ వైపు నుంచి వస్తున్న బైక్‌ ఢీకొనగా బైక్‌పై ఉన్న ప్రవీన్‌ అక్కడికక్కడే చనిపోయాడు. బైక్‌ వెనుక కూర్చున్న శేఖర్‌కు గాయాలు కాగా నిర్మల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 27, 2024

ఓయూలో ఎంఫార్మసీ పరీక్షా తేదీల మార్పు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఫార్మసీ పరీక్షా తేదీలను మార్చినట్లు అధికారులు తెలిపారు. ఎంఫార్మసీ మొదటి, మూడో సెమిస్టర్ మెయిన్, బ్యాక్ లాగ్, రెండో సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించినప్పటికీ, వివిధ కారణాల రీత్యా వాటిని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలను తిరిగి వచ్చే నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.