India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జడ్పీ సీఈఓ సాయాగౌడ్ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఇల్లందకుంటలోని సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం సందర్భంగా సోమవారం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం కమిటీ సభ్యులు CITU రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ యర్రా శ్రీకాంత్ అంతక్రియల నేపథ్యంలో బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఒక రోజు సెలవు ఇచ్చినట్లు అధికారులు ఈరోజు ఓ ప్రకటనలో తెలిపారు. కావున ఖమ్మం జిల్లా రైతాంగ సోదరులు గమనించి తమకు సహకరించాలని కోరారు.
గచ్చిబౌలిలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. అనంతరం స్కిల్స్ యూనివర్సిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణను స్కిల్ పవర్ హౌస్‌గా తీర్చిదిద్దుతామని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. గ్రామీణ యువతకు సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు.
బీజేపీ ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, సీ.అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల, NVSS ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బీజేపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు సోమవారం ట్యాంక్‌బండ్ కూడలి వద్ద డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా శాసనమండలికి బయలుదేరారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఈనెల 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ దృష్ట్యా 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, HCU విద్యార్థులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
బాటసింగారంలోని పండ్ల మార్కెట్‌కి భారీగా మామిడికాయలు వస్తున్నాయి. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల నుంచి మామిడికాయల లారీలు పోటెత్తుతున్నాయి. సీజన్ ఆరంభంలోనే పెద్ద ఎత్తున మామిడికాయలు రావడంతో సీజన్ చివరి వరకు కనీసం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఒక్కరోజే 300 ట్రక్కుల్లో సుమారు 7వేల టన్నుల పంట వచ్చినట్లు అధికారులు తెలిపారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి మహాపట్టాభిషేకం వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సోమవారం సారపాక బీపీఎల్ ఐటీసీ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు స్వాగతం పలికారు. గవర్నర్ ఐటీసీ గెస్ట్ హౌస్‌కు చేరుకొని గౌరవ వందనం స్వీకరించారు.
వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసేందుకు TG ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా OUకు సంబంధించి 601 పోస్టులకు 131 మంది పనిచేస్తుండగా 470 ఖాళీలు ఉన్నాయి. JNTUH పరిధిలో 224 పోస్టుల్లో 86 మంది పనిచేస్తుండగా 138 ఖాళీలు ఉన్నాయి. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి 68 పోస్టులు మంజూరు కాగా 23 మంది పనిచేస్తుండగా 45 ఖాళీలు ఉన్నాయి. కొత్త రిక్రూట్మెంట్ కు జీవో 21 జారీ చేసింది.
దేవాలయాలలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని గుమ్మడిదల పోలీసులు అరెస్ట్ చేశారు. జిన్నారం సీఐ నయుముద్దీన్ వివరాలు.. మెదక్ జిల్లా శివంపేట (M) శభాష్ పల్లికి చెందిన ఫయాజ్(30) సంజీవ్(27) కలిసి గుమ్మడిదల, రామ్ రెడ్డి బావి, కానుకుంట, నల్లవల్లి గ్రామాలలో రాత్రి వేళలో తిరుగుతూ ఊరి బయట ఉన్న దేవాలయాలను ఎంచుకొని హుండీలలో చోరీకి పాల్పడుతున్నట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.