Telangana

News May 27, 2024

నిర్మల్: రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

image

మామడ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం ఒకరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్‌హెచ్‌ 61పై దిమ్మదుర్తి గ్రామం నుంచి వస్తున్న బొలెరో, నిర్మల్‌ వైపు నుంచి వస్తున్న బైక్‌ ఢీకొనగా బైక్‌పై ఉన్న ప్రవీన్‌ అక్కడికక్కడే చనిపోయాడు. బైక్‌ వెనుక కూర్చున్న శేఖర్‌కు గాయాలు కాగా నిర్మల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 27, 2024

ఓయూలో ఎంఫార్మసీ పరీక్షా తేదీల మార్పు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఫార్మసీ పరీక్షా తేదీలను మార్చినట్లు అధికారులు తెలిపారు. ఎంఫార్మసీ మొదటి, మూడో సెమిస్టర్ మెయిన్, బ్యాక్ లాగ్, రెండో సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించినప్పటికీ, వివిధ కారణాల రీత్యా వాటిని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలను తిరిగి వచ్చే నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఖమ్మం: పార్లమెంట్ ఎన్నిక కౌంటింగ్‌పై టెలికాన్ఫరెన్స్

image

లోకసభ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధంగా ఉండాలని భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్, అధికారులు ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ, సన్నద్ధతపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఖమ్మం జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్లపై కలెక్టర్ గౌతమ్ వారికి వివరించారు.

News May 27, 2024

MBNR: నిరుపేద బాలికల భవితకు భరోసా..

image

నిరుపేద, అనాథ బాలికల కోసం ప్రభుత్వం ప్రతి మండలంలో కస్తూర్బా బాలికల విద్యాలయం (KGBV) ఏర్పాటుచేసింది. ఇంటర్‌కు విద్య అందిస్తున్న KGBVల్లో MPC, BIPC, MEC, MHIW కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్య అందించటం, పదో తరగతిలో మెరుగైన ఫలితాలు వస్తుండటంతో KGBVలకు ఆదరణ పెరుగుతోంది. MBNR, NGKL, WNP, GDL, NRPT జిల్లాల్లో ఉన్న నిరుపేద, అనాథ బాలికల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

News May 27, 2024

NLG: అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్టు.. 67 బైకులు స్వాధీనం

image

విలువైన మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకొని 67 మోటార్ సైకిల్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ చందనా దీప్తి వివరాలను వెల్లడించారు. ఐదుగురు సభ్యులు గల ఈ ముఠా TG, APల్లో బైకుల దొంగతనం చేస్తున్నారని తెలిపారు. దొంగతనం చేసిన బైకులను నంబర్ ప్లేట్లు మార్చి అమ్ముతున్నారని తెలిపారు.

News May 27, 2024

ఖమ్మం జిల్లాలో 65.54 శాతంగా పోలింగ్ నమోదు

image

ఖమ్మంలో పట్టభద్రుల ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 65.54 శాతంగా పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. నాలుగు గంటల సమయంలో కేంద్రానికి వచ్చిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు. గతంతో పోల్చుకుంటే పట్టభద్రులు భారీసంఖ్యలో ఎన్నికలో పాల్గొన్నారు.

News May 27, 2024

భూపాలపల్లి: కరెంట్ షాక్.. అమ్మమ్మ, మనవడు మృతి

image

భూపాలపల్లి జిల్లాలో విషాదం జరిగింది. మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామంలో దుంప సాయిచరణ్(14), అతడి అమ్మమ్మ రామలక్ష్మి (55) కరెంట్ షాకుతో మరణించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 27, 2024

వరంగల్ జిల్లా వ్యాప్తంగా 70.83 శాతం పోలింగ్ నమోదు

image

వరంగల్ – నల్గొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ జిల్లా వ్యాప్తంగా సా.4 గంటల వరకు 70.83% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు అన్నారు. వరంగల్ జిల్లాలో ఈరోజు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది తమ సామగ్రితో జిల్లా కేంద్రానికి బస్సులలో తరలివెళ్ళనున్నారు.