Telangana

News May 27, 2024

నల్గొండ: ఎమ్మెల్సీ ఎన్నికలలో 49.53% పోలింగ్ నమోదు

image

నల్గొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53% పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 606 పోలింగ్ కేంద్రాలలో 4,63,839 ఓట్లు ఉండగా ఇప్పటివరకు 2,29,762 ఓట్లు పోలయ్యాయి. నల్లగొండ, సూర్యపేట జిల్లాలలో పోలింగ్ కేంద్రాల వద్ద గ్రాడ్యుయేట్ ఓటర్లు పెద్దసంఖ్యలో బారులు తీరారు.

News May 27, 2024

BREAKING: MDK: యువకుడి ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కౌడిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన సురేశ్ ఆదివారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఈరోజు ఎవరూ లేని సమయం చూసి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు చూసి అతడిని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతిచెందాడని తెలిపారు.

News May 27, 2024

ఉస్మానియా యూనివర్సిటీ ఎంపీఈడీ పరీక్ష తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను వచ్చే నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.

సికింద్రాబాద్: అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గట్టురట్టు

image

ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర స్మగ్లింగ్ ముఠా గుట్టును సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు రట్టు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10వ ప్లాట్ ఫారం పైన అనుమానాస్పదంగా ఉన్న చందు వద్ద రూ.15.50 లక్షల విలువైన 62 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ఎస్ఎన్ జావేద్ తెలిపారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

KNR: బావమరిది కోసం మోకాళ్లపై నడిచి మొక్కు తీర్చుకున్న బావ

image

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తన బావమరిది రజినీకాంత్ కోలుకుంటే మోకాళ్ల మీద ఐనవోలు మల్లికార్జున స్వామి వారి దర్శనానికి నడుచుకుంటూ వస్తానని కమలాపూర్ మండలం అంబాలకు చెందిన నాగరాజు మొక్కుకున్నారు. ఈ మేరకు రజినీకాంత్ ఆరోగ్యం మెరుగుపడటంతో నాగరాజు మొక్కు తీర్చుకునేందుకు మోకాళ్లపై 70 కి.మీ నడుచుకుంటూ ఐనవోలు వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు నాగరాజును అభినందిస్తున్నారు.

News May 27, 2024

HNK: బావమరిది కోసం మోకాళ్లపై నడిచి మొక్కు తీర్చుకున్న బావ 

image

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తన బావమరిది రజినీకాంత్ కోలుకుంటే మోకాళ్ల మీద ఐనవోలు మల్లికార్జున స్వామి వారి దర్శనానికి నడుచుకుంటూ వస్తానని కమలాపూర్ మండలం  అంబాలకు చెందిన నాగరాజు మొక్కుకున్నారు. ఈ మేరకు రజినీకాంత్ ఆరోగ్యం మెరుగుపడటంతో నాగరాజు మొక్కు తీర్చుకునేందుకు మోకాళ్లపై 70 కి.మీ నడుచుకుంటూ ఐనవోలు వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు నాగరాజును అభినందిస్తున్నారు.

News May 27, 2024

దహేగాం: ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి

image

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండల వ్యవసాయ అధికారి సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రూ‌.38,000 డబ్బులు తీసుకుంటుండగా వ్యవసాయ అధికారి వంశీ క్రిష్ణను ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు వ్యవసాయ అధికారిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ దాడులకు సంబంధించి మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.