Telangana

News September 15, 2024

దుబ్బాక: చెరువులో పడి బాలుడి మృతి

image

దుబ్బాక మండలం అప్పనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కొమురవెల్లి మండలం గౌరాయపల్లికి చెందిన బండి నవీన పిల్లలతో కలిసి అప్పనపల్లి తల్లిగారింటికి వచ్చింది. తల్లి రేణుక, మరదలు కావ్య, కుమారుడు సాయి (7)తో కలిసి నవీన చెరువు వద్దకు దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. చెరువు కట్టపై ఆడుకుంటున్న సాయి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

News September 15, 2024

భద్రాచలం వద్ద శాంతిస్తున్న గోదారమ్మ

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 34.9 అడుగులకు చేరిందని సీడబ్ల్యూసీ అధికారులు ప్రకటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండవ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన గోదావరి క్రమేపి తగ్గుతూ వచ్చింది. గణేష్ నిమజ్జనం కోసం వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News September 15, 2024

MBNR: షాపింగ్ మాల్స్ కార్మికుల సమస్యలపై సర్వే

image

మహబూబ్‌నగర్ పట్టణంలో షాపింగ్ మాల్స్ కార్మికుల సమస్యలపై సర్వే చేపట్టినట్లు సీఐటీయూ జిల్లా కోశాధికారి బి.చంద్రకాంత్, టౌన్ కన్వీనర్ రాజ్ కుమార్ ఆదివారం తెలిపారు. మాల్స్, రైల్వే కార్మికుల్లో నాన్ ఎంప్లాయిమెంట్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను వివరించారు.

News September 15, 2024

MBNR: వెంకన్న సన్నిధిలో కలెక్టర్ సంతోష్

image

బిజినేపల్లి మండలం వట్టెం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నాగర్‌కర్నూలు కలెక్టర్ బాధావత్ సంతోష్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రసాద్ ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామికి కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్‌కు స్వాగతం పలుకగా, అర్చకులు శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ ఆలయ పరిసరాలను 2గంటల పాటు పరిశీలించారు.

News September 15, 2024

MDK: సమన్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం: మంత్రి

image

అన్ని వర్గాలకు సమన్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నూతన టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి, సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గౌడ్, సిద్దిపేట ఇన్‌ఛార్జ్ పూజల హరికృష్ణతో కలిసి ఆయన గాంధీభవన్‌కు బయలుదేరారు.

News September 15, 2024

జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం పొలాస మూలమలుపు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్తున్న ట్రావెల్ బస్సు, వెల్గొండ నుంచి జగిత్యాల వైపు వస్తోన్న స్కూటీ, బైకును ఢీకొంది. దీంతో అల్లీపూర్‌కు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 15, 2024

‘NCC శిక్షణను కెడెట్లు సద్వినియోగం చేసుకోవాలి’

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ లో NCC సీఏటీసీ-7 శిక్షణ శిబిరం ఆదివారం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాకు చెందిన 600 మంది కెడెట్లు ఈ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. జిల్లా NCC కమాండింగ్ అధికారి కల్నల్ వికాస్ శర్మ మాట్లాడుతూ.. ఈనెల 23వ తేదీ వరకు ఈ శిబిరం కొనసాగుతుందని తెలిపారు. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సైనికులకు ఇచ్చే తరహాలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

News September 15, 2024

NZB: తాళం వేసిన ఇంట్లో చోరీ

image

నిజామాబాద్ నగరంలోని బాబన్ సాహబ్ పహాడ్ లో తాళం వేసి ఇంట్లో చోరీ జరిగింది. బాబన్ సాహబ్ పహాడ్‌కుచెందిన షేక్ అబ్బుత్ ఆలిక్ శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న ఉన్న 2 తులాల బంగారం, 50 వేల రూపాయల నగదు అపహరించుకుపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు 5వ టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు.

News September 15, 2024

MHBD: 6 నెలల క్రితం వివాహం.. ఉరేసుకొని ఆత్మహత్య

image

MHBD జిల్లా సీరోల్ మండలం మన్నెగూడెంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన వినేశ్ అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి గత 6 నెలల క్రితం వివాహమైంది. సమాచారం తెలుసుకున్న డోర్నకల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, భార్యాభర్తల మధ్య గొడవలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.

News September 15, 2024

MBNR: రైతుకు’భరోసా’వచ్చేనా?

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వేలాది వ్యవసాయేతర భూములకు గతంలో రైతుబంధు పథకం ద్వారా పలువురు రూ.కోట్లు అందుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా కేవలం సాగు పొలాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో రైతులకు రాష్ట్ర సర్కారు రైతు భరోసా ద్వారా తీపికబురు చెప్పేందుకు కార్యచరణ పూర్తి చేసే పనిలో నిమగ్నమయింది.