Telangana

News May 26, 2024

మహబూబ్‌నగర్ ఎంపీగా గెలవబోతున్నా: డీకే అరుణ

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఎంపీగా గెలవబోతున్నానని, సర్వేలన్నీ తమకే అనుకూలంగా చూపిస్తున్నాయని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో పార్లమెంటు పరిధిలోని వివిధ మండలాలకు చెందిన పలువురు పార్టీ శ్రేణులు డీకే అరుణను కలిశారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. మోదీ గ్యారంటీ నినాదంతో ప్రజలు బీజేపీ వైపు ముగ్గు చూపారని ఈ సారి గెలుపు మనదే అని శ్రేణులు చెప్పారు.

News May 26, 2024

HYD: నలుగురు BRS నాయకులు రిమాండ్

image

పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య గొడవ జరిగిన ఘటనలో BRS నాయకులను శనివారం రిమాండ్‌కు తరలించినట్లు చెన్‌గోముల్‌ పోలీసులు తెలిపారు. ఈనెల 13న పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ సమయంలో BRS, కాంగ్రెస్‌ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఈ కేసులో కడ్మూరుకు చెందిన నలుగురు BRS నాయకులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మధు తెలిపారు.

సిద్దిపేట: ‘నకిలీ విత్తనాల కట్టడికి జాయింట్ టాస్క్‌ఫోర్స్’

image

జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టడానికి జాయింట్ టాస్క్‌ఫోర్స్ బృందాలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తామని సిద్దిపేట కమిషనర్ డాక్టర్ అనురాధ పేర్కొన్నారు. దుకాణాలలో, ఏజెంట్లు, మధ్యవర్తుల ముసుగులో కల్తీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలలో తరచూ కేసులు నమోదైతే పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు.

News May 26, 2024

హైదరాబాద్‌లో జూన్ 1 నుంచి మాన్సూన్ టీమ్స్

image

జూన్ 1 నుంచి అక్టోబరు నెలాఖరు వరకు వర్షాకాల అత్యవసర బృందాల(మాన్సూన్ టీమ్స్)‌ను రంగంలోకి దింపేందుకు GHMC టెండర్లు పిలిచింది. రూ.36.98 కోట్లతో 64 సంచార బృందాలు, 104 మినీ అత్యవసర బృందాలు, 160 స్టాటిక్ బృందాలతో పని చేయించనున్నట్లు బల్దియా వెల్లడించింది. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా, ప్రతి చెరువుకు ఓ ఇంజినీరును బాధ్యులుగా ఉంటారని అధికారులు స్పష్టం చేశారు.

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత: కలెక్టర్ క్రాంతి

image

జహీరాబాద్ పార్లమెంట్ ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. పటాన్‌చెరు మండలం రుద్రారం సమీపంలోని గీతం యూనివర్సిటీలో కౌంటింగ్ ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. కౌంటింగ్ సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లకు వేర్వేరు మార్గాలు ఉంటాయని చెప్పారు. ఆమె వెంట అధికారులు ఉన్నారు.

News May 26, 2024

వరంగల్ జిల్లాలో 43,812 మంది పట్టభద్రులు

image

వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి. ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 27న వరంగల్ జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు. జిల్లాలో మొత్తం 43 వేల 812 మంది పట్టభద్రుల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు.

News May 26, 2024

NRPT: ‘నేరాల నియంత్రణపై దృష్టి పెట్టాలి’

image

జిల్లాలో నేరాల నియంత్రణకై పోలీసులు దృష్టి సారించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. శనివారం నారాయణపేట ఎస్పీ కార్యాలయ కాన్ఫిరెన్స్ హాలులో జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారానికి కోర్టు పోలీసులు సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు.

News May 26, 2024

అమెరికా యూత్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న అనన్య

image

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలానికి చెందిన అనన్యకు ఆమెరికా ప్రభుత్వం యూత్ అచీవ్మెంట్ అవార్డు అందించింది. వాషింగ్టన్‌లో పలు సేవా కార్యాక్రమాలు చేసినందుకు గాను ఈ అవార్డు వరించింది. కాగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో ఈ అవార్డును అనన్య అందుకున్నారు.