Telangana

News May 26, 2024

ఖమ్మం: పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఖమ్మం ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక కోసం స్థానిక ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ కళాశాలలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. రూట్ల వారిగా ఎన్నికల సామాగ్రి పంపిణీకి ఏర్పాటుచేసిన టేబుళ్లు, టేబుళ్లపై పోలింగ్ కేంద్రాల సంఖ్య, పోలింగ్ సిబ్బందికి చేపట్టాల్సిన వసతులపై చర్చించారు.

News May 26, 2024

ఎమ్మెల్సీ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్ హరిచందన

image

వరంగల్- ఖమ్మం -నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై శనివారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ నుండి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న 12 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు.

News May 25, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి TOPNEWS

image

> జిల్లా వ్యాప్తంగా ముగిసిన MLC ఎన్నికల ప్రచారం
> రామప్ప ఆలయాన్ని సందర్శించిన ఆసిఫాబాద్ MLA
> శాయంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్
> WGL- KMM రహదారిపై సైకిల్ ని ఢీ కొట్టిన లారీ
> ఉరివేసుకొని 4వ తరగతి విద్యార్థి సూసైడ్
> వరంగల్లో విత్తన షాపులలో తనిఖీలు
> విద్యుత్ షాక్ తో 8ఏళ్ల బాలికకు గాయాలు
> భూపాలపల్లి కాలేశ్వరం ఆలయానికి పోటెత్తిన భక్తులు

News May 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మల్లాపూర్ మండలంలో గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి. @ రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం. @ సిరిసిల్లలో నేల కూలిన వందేళ్ల నాటి మహా వృక్షం. @ తిమ్మాపూర్ మండలంలో కారు అదుపుతప్పి ఒకరి మృతి. @ కోరుట్ల మండలం పైడిమడుగులో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ. @ ఎల్లారెడ్డిపేట మండలంలో అధిక వేడి తాళలేక కోళ్ల ఫారం లో మూడు వేల కోళ్లు మృతి. @ జగిత్యాలలో ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్.

News May 25, 2024

మెదక్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

image

మెదక్ జిల్లాలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి వద్ద హైవే-44పై రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందారు. హైవే దాటుతున్న వ్యక్తిని హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ముప్పిరెడ్డిపల్లికి చెందిన <<13316285>>మూల నరేందర్<<>>(55) మనోహరాబాద్ వద్ద ముందు జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు.

News May 25, 2024

MBNR: మూడు విడతల్లో ఇంటర్ మూల్యాంకనం

image

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. మొత్తం మూడు విడతల్లో మూల్యాంకనం ప్రక్రియ జరగనుందని జిల్లా ఇంటర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రధమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చేపట్టనున్నారు.

News May 25, 2024

WGL: ఉరి వేసుకొని 4th క్లాస్ విద్యార్థి సూసైడ్

image

జనగామ మండలంలోని గానుగపహడ్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సంపత్ (11) నాల్గవ తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. సంపత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంపత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 25, 2024

కొలిక్కిరాని శ్రీధర్‌ రెడ్డి హత్య కేసు !

image

పాలమూరులో సంచలనం సృష్టించిన BRS నేత శ్రీధర్‌ రెడ్డి హత్య జరిగి 56 గంటలు గడుస్తున్నా కేసు కొలిక్కిరాలేదు. హత్యకు దారితీసిన పరిణామాలు, వ్యక్తిగత, రాజకీయ కక్షలు, వివాహేతర సంబంధాలు, భూవివాదాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలపై పోలీసులు విచారిస్తున్నారు. వారి కుటుంబాల్లో భూ తగాదాల సమస్య ఉందని, వారిలో వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తోన్నారు. కేసు కొలిక్కి రాకపోవడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది.

News May 25, 2024

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌లో గెలుపెవరిది..?

image

పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత MBNR పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపుపై కాంగ్రెస్, BJP, BRS పార్టీల నేతలు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ MLAలు ఉండడంతో తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దేశంలో ప్రధాని మోదీ అందించిన సంక్షేమ పథకాలతో తమ గెలుపు ఖాయమని BJP నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో BRS నామమాత్రంగానే బరిలోకి దిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

News May 25, 2024

గజ్వేల్: కాలం చెల్లిన 610 కిలోల విత్తనాలు స్వాధీనం

image

గజ్వేల్ పట్టణంలోని సీడ్స్ & ఫర్టిలైజర్ షాపుల్లో గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి, ఇన్స్పెక్టర్ సైదా తనిఖీలు నిర్వహించారు. 610 కిలోల కాలం చెల్లిన విత్తనాలు, మెంతులు గంగవాయిలు కూర, బీర్నిస్, వరి ధాన్యం, కొన్ని రకాల పురుగుల మందులు ఫర్టిలైజర్స్ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. సీపీ ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణంలో ఉన్న సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.