Telangana

News May 25, 2024

కొలిక్కిరాని శ్రీధర్‌ రెడ్డి హత్య కేసు !

image

పాలమూరులో సంచలనం సృష్టించిన BRS నేత శ్రీధర్‌ రెడ్డి హత్య జరిగి 56 గంటలు గడుస్తున్నా కేసు కొలిక్కిరాలేదు. హత్యకు దారితీసిన పరిణామాలు, వ్యక్తిగత, రాజకీయ కక్షలు, వివాహేతర సంబంధాలు, భూవివాదాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలపై పోలీసులు విచారిస్తున్నారు. వారి కుటుంబాల్లో భూ తగాదాల సమస్య ఉందని, వారిలో వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తోన్నారు. కేసు కొలిక్కి రాకపోవడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది.

News May 25, 2024

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌లో గెలుపెవరిది..?

image

పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత MBNR పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపుపై కాంగ్రెస్, BJP, BRS పార్టీల నేతలు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ MLAలు ఉండడంతో తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దేశంలో ప్రధాని మోదీ అందించిన సంక్షేమ పథకాలతో తమ గెలుపు ఖాయమని BJP నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో BRS నామమాత్రంగానే బరిలోకి దిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

News May 25, 2024

గజ్వేల్: కాలం చెల్లిన 610 కిలోల విత్తనాలు స్వాధీనం

image

గజ్వేల్ పట్టణంలోని సీడ్స్ & ఫర్టిలైజర్ షాపుల్లో గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి, ఇన్స్పెక్టర్ సైదా తనిఖీలు నిర్వహించారు. 610 కిలోల కాలం చెల్లిన విత్తనాలు, మెంతులు గంగవాయిలు కూర, బీర్నిస్, వరి ధాన్యం, కొన్ని రకాల పురుగుల మందులు ఫర్టిలైజర్స్ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. సీపీ ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణంలో ఉన్న సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.

News May 25, 2024

KNR: గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి

image

జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మల్లాపూర్ మండలంలో ఓ లారీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ ఖాదర్ ఓ ఫర్టిలైజర్ దుకాణంలో ఎరువులను కొనడానికి లారీని తీసుకొని వచ్చాడు. కాగా అదే సమయంలో ఒక్కసారిగా పిడుగులతో కూడిన వర్షం కురవడంతో ఆ శబ్దానికి భయానికి గురైన ఖాదర్ గుండెపోటుతో మృతి చెందాడు.

News May 25, 2024

ప్రభుత్వ వైద్య కాలేజీల్లో EWS కోటా అమలు: మంత్రి దామోదర్

image

SRD: ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్/డెంటల్ కోర్సులకు ఆల్ ఇండియా కోటా స్కీమ్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు తీసుకున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈ కోటా కింద ఇప్పటివరకు 103 సీట్లు అందుబాటులో ఉండేవని, ఈ నిర్ణయంతో అదనంగా 350 సీట్లకు ఛాన్స్ ఉంటుందన్నారు.

News May 25, 2024

కామారెడ్డి DMHO సస్పెన్షన్

image

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా వైద్యులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. రాష్ట్ర ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ సస్పెన్షన్ ఉత్తర్వులను శనివారం జారీ చేశారు. ఆయనపై పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదు కావడం, విచారణ నివేదిక ఆధారంగా ఆయనను సస్పెండ్ చేశారు.

News May 25, 2024

వనపర్తి: బైక్ అదుపుతప్పి ఒకరి మృతి

image

వనపర్తి జిల్లాలో ఇవాళ సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం.. ఇద్దరు బైక్‌పై గొల్లపల్లి నుంచి ఆదిరాల వెళ్తుండగా ఏదుల గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే వనపర్తి ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 25, 2024

WGL: బరిలో 52 మంది..!

image

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఈనెల 27న జరగనుంది. 3 జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉ. 8 నుంచి సా. 4 వరకు పోలింగ్ జరగనుంది. బరిలో BRS నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, BJP నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 52 మంది బరిలో ఉన్నారు. జూన్ 5న ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.

News May 25, 2024

MBNR: పంట రుణాలపై సీఐడీ విచారణ !

image

రైతులు DCCB అచ్చంపేట బ్రాంచి నుంచి 2017-19 మధ్య కాలంలో తీసుకున్న పంట రుణాలపై CID అధికారులు విచారణ చేపట్టారు. అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 1,827 మంది రైతులు DCCB నుంచి పంట రుణాలు తీసుకున్నారు. ఖాతాలను ఆడిట్ చేసే క్రమంలో చెల్లింపుల్లో సుమారు రూ.10 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు గ్రామాల్లో ఖాతాల వారీగా రైతులను కలిసి వివరాలు సేకరిస్తున్నారు.

News May 25, 2024

ఆదిలాబాద్: అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

image

పలు జిల్లాల్లో దొంగతనాలు చేసిన నిందితుడిని సిద్దిపేట 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన రామారావు సిద్దిపేట 2 టౌన్, 3 టౌన్, చేర్యాల PSల పరిధితో పాటు ఆయా స్టేషన్లలోని మొత్తం 24 దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి 47.70 తులాల బంగారం, 65 తులాల వెండి, రూ.34,500, స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.