Telangana

News May 25, 2024

నిజామాబాద్: SRH గెలవాలని ప్రత్యేక పూజలు

image

రేపు జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో హైదరాబాద్ జట్టు గెలవాలని ఇందల్వాయి గ్రామంలో ప్రత్యేక పూజలు చేశారు. కోల్‌కతాతో జరిగే ఫైనల్ మ్యాచులో హైదరాబాద్ జట్టు సభ్యులు రాణించాలని కోరారు. ఈ మేరకు రామాలయంలో దీపక్ పంతులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. గోపి, అశోక్, సతీశ్ కుమార్, మను సందీప్ తదితరులు ఉన్నారు.

News May 25, 2024

MBNR: భూముల విలువ పెంపునకు కసరత్తు !

image

భూముల మార్కెట్ విలువలు సవరించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ద్వారా ఖజానాకు ఏటా రూ.250 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వం 2సార్లు భూముల విలువలు పెంచింది. ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో గజం కనిష్టంగా రూ.1000లకు గరిష్టంగా రూ. 5వేలు, పట్టణ ప్రాంతాల్లో కనిష్టంగా రూ.10వేల, గరిష్టంగా రూ.20 వేలకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News May 25, 2024

ఆదిలాబాద్: పదిరోజుల్లో ఫలితాలు.. MPఎవరో?

image

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఈనెల 13న ముగిసింది. పోలింగ్ జరిగి నేటికి 12 రోజులు కావస్తుండగా ఫలితాలు మరో 10 రోజుల్లో జూన్ 4న వెలువడనున్నాయి. ఇక ఫలితాల్లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది. అటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం మేమే గెలుస్తున్నామన్న ధీమాలో ఎవరికి వారు ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి ఎవరు పార్లమెంట్‌లో అడుగు పెడతారో తెలియాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.
-మరి గెలిచేదెవరో మీ కామెంట్

News May 25, 2024

ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ హత్య..?

image

ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. చింతలమానేపల్లి మండలం కోర్చిని గ్రామానికి చెందిన సదయ్యను కుమార్ అనే వ్యక్తి రాడ్‌తో తలపై కొట్టి హత్య చేసినట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

News May 25, 2024

వరంగల్: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు 3 రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుని ప్రచారం చేశాయి. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రేమేందర్ రెడ్డి, రాకేశ్ రెడ్డిలు వరంగల్ జిల్లాకు చెందిన వారే కాగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న నల్గొండ జిల్లాకు చెందిన వారు. 27వ తేదీన జరిగే ఎన్నికల్లో వరంగల్ గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం కడతారో చూడాల్సి ఉంది.

News May 25, 2024

మెదక్: కుంటలో యువకుడి మృతదేహం

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన దోమకొండ సాయి(20) ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కాళ్లకల్లో నివాసముండే సాయి మూడు రోజులుగా కనిపించకుండా పోయారు. ఈరోజు గ్రామ శివారులోని మాదన్న కుంటలో మృతదేహం దొరికింది. సాయి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మనోహరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 25, 2024

పిట్లం: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పిట్లం మండలం చిల్లర్గిలో జరిగింది. SI నీరేశ్ వివరాలిలా.. చిల్లర్గి వాసి చాకలి సాయిలు (52) గురువారం సాయంత్రం తన పొలంలో వరి కొయ్య కాళ్ళు కాల్చుతుండగా.. ఒకే సారి మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో నీళ్లతో మంటలు ఆర్పడానికి బోరు స్టార్టర్ బాక్స్ వద్దకు వెళ్లి మోటారు ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 25, 2024

మెదక్: నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు

image

ఉమ్మడి జిల్లాలో ఎవరైన నకిలీ విత్తనాలను, ఎరువులు, నాసిరకం పురుగు మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పి డా.బాలస్వామి ఒక ప్రకటనలో హెచ్చరించారు. దేశానికి రైతు వెన్నెముక లాంటివాడని గుర్తుచేశారు. ఆరుగాలం కష్టించి దేశం కడుపు నింపే రైతులను మోసం చేస్తూ కొంతమంది నకిలీ విత్తనాలు సరఫరా చేసి వారిని అప్పుల్లోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు.

News May 25, 2024

భద్రాచలం: నేత్ర పర్వంగా రామయ్య నిత్య కల్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో బుధవారం సీతరాముల నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ తలుపులు తీసి రామయ్యకు సుప్రభాత సేవ నిర్వహించారు. పవిత్ర గోదావరి జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి, ఆరాధన, సేవకాలం, నిత్య బలిహరణ మొదలగు నిత్య పూజ కార్యక్రమాలు జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణ వైభవాన్ని కనుల పండువగా నిర్వహించారు.

News May 25, 2024

HYD: దొంగ మెసేజ్, లింకులను నమ్మకండి జాగ్రత్త!

image

HYD, RR, MDCL,VKB జిల్లాల విద్యుత్ వినియోగదారులకు TGSPDCL సూచనలు చేసింది. గుర్తుతెలియని వాట్సప్ నంబర్ల నుంచి, ఈమెయిల్ తదితర వెబ్ సైట్ల నుంచి కరెంటు బిల్లులు చెల్లించండి, నూతన లింకుల కోసం క్లిక్ చేయండి అని వచ్చే దొంగ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. లింకు నొక్కిన తర్వాత CVV,OTP లాంటివి అడుగుతే ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దన్నారు. విద్యుత్ అధికారుల నుంచి అలాంటి కాల్స్ ఎప్పుడు రావన్నారు.