India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మందుల కొరతతో వెలవెలబోతోంది. మూడు నెలలుగా ఇక్కడ మందులు అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం వచ్చే రోగులు రిక్తహస్తాలతో వెనుదిరుగుతున్నారు. పెద్ద సంఖ్యలో బాధితులు ఈ ఆసుపత్రిని ఆశ్రయిస్తుంటారు. వైద్యులు పరీక్షించి చీటీలు రాసిస్తున్నా, మందుల కౌంటర్‌లో నిల్వలు లేవని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మందుల సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

నిజాంసాగర్ కెనాల్ ఆధునీకరణకు రూ.1,500 కోట్లు కేటాయించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. నిజాం కాలంలో నిర్మించిన ఈ కాలువ పూడికతో అధ్వానంగా మారిందన్నారు. మదనపల్లి నుంచి ఫత్తేపూర్ వరకు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల క్రితం కాలిపోయిన మోటార్లను ఇంతవరకు మార్చలేదని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం కనికరించాలన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ వదిలిన రాజకీయ బాణంగా కవిత వ్యవహరిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న నేతలను దూరం చేసేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. కవిత అసలు బీఆర్‌ఎస్‌లో ఉన్నారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌పై విమర్శలకే స్పందిస్తున్న ఆమె.. హరీశ్‌రావుపై వస్తున్న ఆరోపణల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని మంత్రి ప్రశ్నించారు.

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయి చైతన్య కీలక ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా జనవరి 1 నుంచి 15 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా విగ్రహ ప్రతిష్ఠలు చేయకూడదన్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు DJలు నిషేధించినట్లు చెప్పారు. బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు ఉంటాయని, డ్రోన్లు, భారీ సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

GHMC డీలిమిటేషన్ మీద BRS నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ మ్యాప్‌తో విభజన చేయడం ఏంటని నిలదీస్తున్నారు. సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ సాధించేందుకు ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని తలసాని శ్రీనివాస్ తేల్చిచెప్పారు. జంట నగరాలను ఇష్టం వచ్చినట్లు విడదీసి, ప్రజల మనోభావాల తోటి ఆడుకోవడం ఏంటని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు BRS పోరాటం చేస్తుందని తలసాని పేర్కొన్నారు.

విజయవాడలో ఈనెల 15 నుంచి 18 వరకు జరిగే జూనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు జిల్లాకు చెందిన పాండు నాయక్, హేమంత్ యాదవ్ ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన సెలక్షన్స్‌లో వీరు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. క్రీడాకారుల ఎంపికపై జిల్లా అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లావాసులు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలకు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సందర్భాలలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు, నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఈరోజు పరేడ్ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరేడ్‌కు హాజరై గౌరవ వందనం స్వీకరించి పరిశీలించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం అవసరమని సిబ్బందికి సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించి ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.

హైదరాబాద్ వాసులకు అదిరిపోయే న్యూస్ బాస్. ట్రాఫిక్ జామ్‌లు చూసి తల పట్టుకుంటున్నారా? అందుకే NHAI ఒక క్రేజీ స్కెచ్ వేసింది. మన రీజినల్ రింగ్ రోడ్డు (RRR) పరిధిలోని ఇండస్ట్రియల్ పార్కుల నుంచి భారీ వాహనాలను నేరుగా పంపేందుకు ‘అండర్‌గ్రౌండ్ కార్గో టన్నెల్స్’ నిర్మించబోతున్నారు. అంటే రోడ్డుపైన మనం రయ్యిమని దూసుకుపోవచ్చు. భారీ కంటైనర్లు మాత్రం నేల లోపలి నుంచే సైలెంట్‌గా వాటి డెస్టినేషన్‌కి వెళ్తాయి.

జిల్లా కేంద్రంలో రేపటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. టెట్ రాసేందుకు చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఫీజు కట్టారు. కొంతమంది వచ్చే విడతలో చెల్లించి రాయాలని చూస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. టెట్ పరీక్ష రోజున ఉపాధ్యాయులందరూ స్కూల్‌ను విడిచి వెళ్లే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వేర్వేరు తేదీల్లో 6 రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. 1,557 మంది ఉపాధ్యాయులు పరీక్షలకు వెళ్లనున్నారు.
Sorry, no posts matched your criteria.