Telangana

News May 25, 2024

కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి కలకలం

image

కామారెడ్డి జిల్లాలో ఎలుగు బంటి కలకలం రేపింది. లింగంపేటలోని మేంగారం-బోనాల్ మధ్య ఉన్న రోడ్డు పై ఎలుగుబంటి సంచరించడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నీరు తాగేందుకు వచ్చిందని ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

News May 25, 2024

వరంగల్: ‘అమ్మ నేను చనిపోతున్నా.. నాకోసం వెతకొద్దు’

image

‘అమ్మ నేను చనిపోతున్నా.. నాకోసం వెతకొద్దు’ అని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన కొద్ది నిమిషాల్లోనే ఖమ్మంకు చెందిన ఓ మైనర్ హంటర్ రోడ్డు సమీపంలో 2 మోరీల జంక్షన్ వద్ద రైలు కింద పడి మృతి చెందింది. ఓ బాలికకు వరంగల్ కాశిబుగ్గకు చెందిన చెన్నకేశవ మధ్య ఫోన్ కాల్ ద్వారా బంధం ఏర్పడింది. ఇద్దరూ మైనర్లు కావడంతో ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమనే చర్చ జరుగుతుంది.

News May 25, 2024

తంగళ్లపల్లి: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

image

తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్లో శుక్రవారం వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చల్ల నర్సయ్య(53) ముగ్గురు కుమార్తెల వివాహాల కోసం రూ.8 లక్షలు అప్పు చేశాడు. అప్పు భారం పెరగడంతో ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో శుక్రవారం ఇంటి ఎదుట ఉన్న రేకుల షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News May 25, 2024

HYD: బుల్లెట్ బండి పేలుడు ఘటన.. మరో యువకుడి మృతి

image

బుల్లెట్ బండి ట్యాంక్ పేలిన ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. శుక్రవారం మరో యువకుడు ప్రాణాలొదిలాడు. భవానీనగర్‌లో ఈ నెల 12న బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్ పేలిన ప్రమాద ఘటనలో 10 మంది గాయపడి మొఘల్‌పురలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చికెన్ సెంటర్‌లో పని చేసే జహంగీర్ నగర్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ ఖురేషి(18) 13 రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృత్యువాతపడ్డారు.

News May 25, 2024

మెదక్: రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మెదక్ మండలం కాజిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్‌కు చెందిన మేకల మహేశ్ (35), హుస్నాబాద్‌లో జరిగిన ప్రమాదంలో కోహెడ మండలం రామచంద్రాపురం‌కు చెందిన దావ రాము (40), దుబ్బాక మండలం ఆరేపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో గంభీర్పూర్‌కు చెందిన పర్స కనకయ్య (56), గుమ్మడిదల వద్ద జరిగిన ప్రమాదంలో నక్క శ్రీశైలం (30) మృతి చెందారు.

News May 25, 2024

HYD: బుల్లెట్ బండి పేలుడు ఘటన.. మరో యువకుడి మృతి

image

బుల్లెట్ బండి ట్యాంక్ పేలిన ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. శుక్రవారం మరో యువకుడు ప్రాణాలొదిలాడు. భవానీనగర్‌లో ఈ నెల 12న బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్ పేలిన ప్రమాద ఘటనలో 10 మంది గాయపడి మొఘల్‌పురలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చికెన్ సెంటర్‌లో పని చేసే జహంగీర్ నగర్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ ఖురేషి(18) 13 రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృత్యువాతపడ్డారు.

News May 25, 2024

HYD: బుల్లెట్ బండి పేలుడు ఘటన.. మరో యువకుడి మృతి

image

బుల్లెట్ బండి ట్యాంక్ పేలిన ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. శుక్రవారం మరో యువకుడు ప్రాణాలొదిలాడు. భవానీనగర్‌లో ఈ నెల 12న బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్ పేలిన ప్రమాద ఘటనలో 10 మంది గాయపడి మొఘల్‌పురలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చికెన్ సెంటర్‌లో పని చేసే జహంగీర్ నగర్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ ఖురేషి(18) 13 రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృత్యువాతపడ్డారు.

News May 25, 2024

NZB: బాలికపై దుండగుల దాడి.. ఆటో డ్రైవర్‌పై అనుమానం

image

జానకంపేటలోని నిజాంసాగర్ కాలువ గట్టు వద్ద గురువారం కొందరు దుండగులు ఓ <<13301418>>బాలికపై దాడి<<>> చేసిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనలో పలు విషయాలు వెల్లడైనట్లు SI వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఓ ఆటో డ్రైవర్, మరో వ్యక్తి ఆమెపై దాడి చేసినట్లు బాలిక తల్లి అనుమానిస్తున్నారు. దీంతో ఆమెను ఉద్దేశ పూర్వకంగానే తీసుకెళ్లి దాడి చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.

News May 25, 2024

ఖమ్మం: రైలుకింద పడి బాలిక ఆత్మహత్య

image

‘అమ్మా నేను చనిపోతున్నాను … నా కోసం వెతకొద్దు’ అని చెప్పిన నిమిషాల్లోనే ఖమ్మంకు చెందిన మైనర్ బాలిక వరంగల్ – కాజీపేట మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం సారథినగర్‌కు చెందిన బాలిక(17) ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బాలికతో పాటు ఉన్న యువకుడు అహ్మదాబాద్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ కిందపడ్డారు. ఈ ఘటనలో బాలిక అక్కడిక్కడే మృతిచెందగా యువకుడి కాలు తెగిపోవడంతో ఆస్పత్రికి తరలించారు.

News May 25, 2024

వరంగల్: భద్రకాళి చెరువుతో పొంచి ఉన్న ప్రమాదం

image

WGL- HNK ప్రాంతాల మధ్య భద్రకాళి చెరువు ఉంది. 15 ఏళ్లుగా వరదతో పది కాలనీలు నీట మునుగుతున్నాయి. స్మార్ట్‌ సిటీ పథకం ద్వారా భద్రకాళి బండ్‌ పనులు మూడేళ్లుగా సాగుతున్నాయి. దీంతో చెరువు కట్ట బలహీనమైంది. గతేడాది పోతననగర్‌ వైపు మట్టి కట్టకు గండి పడింది. ఇరిగేషన్, గ్రేటర్‌ WGL అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే పలు ప్రాంతాలు నీట మునిగే అవకాశాలున్నాయని స్థానికులు వాపోతున్నారు.