Telangana

News May 25, 2024

సంగారెడ్డి: గొర్రెల యూనిట్ల డబ్బులు వాపస్!

image

గొర్రెల యూనిట్ల పంపిణి పథకాన్ని ప్రభుత్వం పక్కన పెట్టినట్లుంది. సంగారెడ్డి జిల్లాలో గతంలో గొర్రెల యూనిట్ల కోసం గొర్రెల కాపరులు తమ వాటాగా చెల్లించిన డబ్బులను తిరిగి చెల్లించాలని అన్నారు. ఇప్పటి వరకు 1,195 మంది లబ్ధిదారులకు మాత్రమే వాటా డబ్బులు వాపస్‌ ఇవ్వాలని అనుకున్నారు. వీరిలో ఒకరికి వాటా డబ్బులను తిరిగి ఇచ్చేశారు. మరో 257 మందికి డబ్బులు వాపస్‌ తిరిగి ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు.

News May 25, 2024

ఉమ్మడి జిల్లాలో ZPTC, MPTC, సర్పంచుల స్థానాలు ఇలా

image

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఇందుకు సంబంధించిన ఫలితాలు జూన్ 4న వెలువడాల్సి ఉండగా.. అనంతరం అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టనున్నారు.
✒MBNR: ZPTCలు-14, MPTCలు-184, సర్పంచులు-441 ✒NGKL: ZPTCలు-20, MPTCలు-212, సర్పంచులు-461
✒GDWL:ZPTCలు-12, MPTCలు-141, సర్పంచులు-255
✒WNPT:ZPTCలు-14, MPTCలు-128, సర్పంచులు-225
✒NRPT:ZPTCలు-11, MPTCలు-142, సర్పంచులు-280 స్థానాలు ఉన్నాయి.

News May 25, 2024

మంచిర్యాల జిల్లాలో ఇద్దరు ఆత్మహత్య

image

ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో చోటుచేసుకుంది. లక్ష్మీపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో అదే మండలంలోని సర్వాయి పేటకు చెందిన రాజేశ్(28), నాయిని చీకటి అనే వివాహిత కొంత కాలంగా కలిసి ఉంటున్నారు. శుక్రవారం ఇంటి యజమాని తలుపు తెరిచి చూడగా వారిద్దదూ ఉరేసుకొని చనిపోయి ఉన్నారు. దీంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రూరల్ CI సుధాకర్ ఈ ఘటన పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News May 25, 2024

NLG: చివర దశకు ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం

image

WGL-KMM-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. పోలింగ్ ఈనెల 27న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 4,61,806 మంది ఓటర్లున్నారు. ఏడుగురు మంత్రులు ఈ నియోజకవర్గంలో ఉండగా.. కాంగ్రెస్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సిటింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తుండగా.. బీజేపీ ఈ స్థానంలో బోణీ కొట్టాలని చూస్తోంది.

News May 25, 2024

KMM: చివరి దశకు ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం

image

WGL-KMM-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. పోలింగ్ ఈనెల 27న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 4,61,806 మంది ఓటర్లున్నారు. ఏడుగురు మంత్రులు ఈ నియోజకవర్గంలో ఉండగా.. కాంగ్రెస్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సిటింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తుండగా.. బీజేపీ ఈ స్థానంలో బోణీ కొట్టాలని చూస్తోంది.

News May 25, 2024

HYD: 10వ తరగతి విద్యార్థులకు గమనిక

image

జూన్ 3వ తేదీ నుంచి 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాధికారిణి కె.రోహిణి పేర్కొన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 35 కేంద్రాల్లో 12,186 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఆయా సెంటర్‌లకు సకాలంలో చేరుకోవాలని ఆమె సూచించారు. SHARE IT

వరంగల్: పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

ఈనెల 27న నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈనెల 27 ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.

News May 25, 2024

దేశం సుభిక్షంగా ఉందంటే మోడీదీ వల్లే: ఈటల

image

దేశం సుభిక్షంగా ఉందంటే ప్రధాని మోదీ వల్లేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వరంగల్ జిల్లాలో పర్యటించిన ఈటల మాట్లాడుతూ.. ఒకప్పుడు దేశం బాంబు పేలుళ్లతో వణికిపోయిందని, నేడు మోదీ నాయకత్వంలో దేశంలో ప్రజలు సుభిక్షంగా ఎలాంటి భయం లేకుండా జీవిస్తున్నారని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

News May 25, 2024

మహబూబ్‌నగర్: విద్యా వాలంటీర్ల ఊసేది..!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,176 ప్రభుత్వ పాఠశాలలుండగా, 3.01లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 15,453 ఉపాధ్యాయ పోస్టులకు 1,967 ఖాళీగా ఉన్నాయి. ఏకోపాధ్యాయుడు ఉన్నచోట పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,538 మందికి పైగా విద్యా వాలంటీర్లను నియమించారు. 20రోజుల్లో పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు విద్యా వాలంటీర్ల ఊసే లేదని నిరుద్యోగులు తెలిపారు.