Telangana

News May 25, 2024

NLG: తప్పులకు ఆస్కారం ఇవ్వవద్దు : కలెక్టర్

image

ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా NLG- KMM -WGL శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ను నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరై పలు సూచనలు చేశారు.

News May 25, 2024

HYD: నేడు, రేపు రైళ్లు రద్దు!

image

నేడు, రేపు పలు MMTS, 4 డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) ప్రకటించింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి(FOB)ల నిర్మాణం నేపథ్యంలో సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా, మేడ్చల్‌- సికింద్రాబాద్‌, లింగంపల్లి-మేడ్చల్‌, హైదరాబాద్- మేడ్చల్‌ మధ్య సేవలందించే 22 MMTS సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చీఫ్‌ పీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ తెలిపారు.
SHARE IT

News May 25, 2024

శ్రీరాంపూర్: నేత్రదానంతో ఇద్దరి కళ్లలో వెలుగులు

image

శ్రీరాంపూర్ ఆర్కే 6 కాలనీకి చెందిన సింగరేణి మాజీ ఉద్యోగి పోతునూరి సత్యనారాయణ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈ క్రమంలో సదాశయ ఫౌండేషన్ ప్రాంతీయ ప్రధాన కార్యదర్శి సిహెచ్ లింగమూర్తి ఆద్వర్యంలో సత్యనారాయణ నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. సమాజ హితం కోసం విషాదంలో కూడా మృతుని నేత్రాలను దానం చేసిన వారిని ఫౌండేషన్ ప్రతినిధులు అభినందించారు.

News May 25, 2024

HYD: నేడు, రేపు రైళ్లు రద్దు!

image

నేడు, రేపు పలు MMTS, 4 డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) ప్రకటించింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి(FOB)ల నిర్మాణం నేపథ్యంలో సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా, మేడ్చల్‌- సికింద్రాబాద్‌, లింగంపల్లి-మేడ్చల్‌, హైదరాబాద్- మేడ్చల్‌ మధ్య సేవలందించే 22 MMTS సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చీఫ్‌ పీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ తెలిపారు. SHARE IT

News May 25, 2024

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీయాక్ట్: కలెక్టర్ గౌతమ్

image

నకిలీ విత్తనాలు అమ్మితే పీడి యాక్ట్ నమోదు చేస్తామని ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి, వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన డీలర్లు, విత్తన సరఫరా ఏజెన్సీలు, విత్తన డిస్ట్రిబ్యూటర్ లతో కలెక్టర్ అవగాహన సమావేశం నిర్వహించారు. రైతులకు డీలర్లు, ఫెర్టిలైజర్ నకిలీ విత్తనాలను విక్రయించొద్దని హెచ్చరించారు.

News May 25, 2024

NZB: నిఖత్ జరీన్‌ను అభినందించిన సచిన్ టెండుల్కర్

image

ఇటీవల కజకిస్థాన్లో జరిగిన ఎలోర్డా పోటీల్లో 52 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతగా నిలిచి బంగారు పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్‌ను ప్రముఖ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను సచిన్ టెండూల్కర్ సత్కరించారు. దేశ గౌరవం విశ్వ వ్యాప్తం చేసేలా మున్ముందు మరింత రాణించాలని కోరారు.

News May 24, 2024

భాగ్యలక్ష్మి ఆలయంలో మధ్యప్రదేశ్ CM

image

చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దంపతులు సందర్శించారు. మోహన్ యాదవ్, ఆయన సతీమణి సీమా యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాన్ని సందర్శించిన సందర్భంగా దంపతులకు ఆలయ ట్రస్టీ ఛైర్మన్ శశికళ శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించారు.

News May 24, 2024

భాగ్యలక్ష్మి ఆలయంలో మధ్యప్రదేశ్ CM

image

చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దంపతులు సందర్శించారు. మోహన్ యాదవ్, ఆయన సతీమణి సీమా యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాన్ని సందర్శించిన సందర్భంగా దంపతులకు ఆలయ ట్రస్టీ ఛైర్మన్ శశికళ శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించారు.

News May 24, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> బిగ్ బాస్కెట్ గోడౌన్‌లో డేట్ అయిపోయిన వస్తువులు
> మద్యంమత్తులో హల్‌చల్ చేసిన యువతీ యువకుడు అరెస్ట్
> గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తు తెలియని డెడ్‌బాడీ లభ్యం
> శామీర్‌పేటలో దొంగల బీభత్సం
> మలక్‌పేట్‌లో ఇద్దరు పిల్లలతో గృహిణి MISSING
> భార్యను చంపేసి పరారీ.. చివరికి అరెస్ట్
> గండిపేటలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు
> ఓయూలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

News May 24, 2024

కౌంటింగ్ సిబ్బంది నియామకం: కలెక్టర్ గౌతమ్

image

లోకసభ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బంది ర్యాoడమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఖమ్మం లోకసభ సాధారణ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్ లో ఆన్లైన్ ద్వారా పూర్తి పారదర్శకంగా ర్యాoడమైజేషన్ చేపట్టి పూర్తి చేశారు. కౌంటింగ్ కొరకు రిజర్వ్ తో కలిపి 148 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 173 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 150 మంది సూక్ష్మ పరిశీలకులు నియమించినట్లు చెప్పారు.