Telangana

News May 24, 2024

భైంసా: మంటలు అంటుకొని వృద్ధురాలు మృతి

image

ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని వృద్ధురాలు మృతి చెందిన ఘటన భైంసా మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కుంబి గ్రామానికి చెందిన నార్వాడే చేంద్రబాయి (70) సోమవారం ఇంటి ముందు చెత్తను ఊడ్చి మంట పెట్టింది. ప్రమాదవశాత్తు మంటలు చీరకు అంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు తెలిపారు.

News May 24, 2024

టేక్మాల్‌‌: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి.. కేసు నమోదు

image

వైన్స్ ముందు అనుమానాస్పదంగా వ్యక్తి మృతిచెందిన ఘటన టేక్మాల్‌‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన గుంటి రాజు(30) టేక్మాల్‌లోని కొనుగోలు కేంద్రానికి వడ్లు అమ్మడానికి తీసుకొచ్చాడు. రాత్రి ఇంటికి రాకపోగా శుక్రవారం ఉదయం టేక్మాల్ వైన్స్ ముందు విగతజీవిగా పడి ఉన్నాడని బంధువుల పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

News May 24, 2024

BREAKING: నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చిన్న అడిశర్లపల్లి జాతీయ రహదారిపై కాసేపటి క్రితం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దవూర మండలం ఉట్లపల్లి వాసులు పెరిక శ్రీను, కనకయ్య బైక్‌పై మల్లేపల్లి నుంచి ఇంటికి వెళ్తుండగా మరో బైక్ వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీను అక్కడికక్కడే మృతిచెందగా.. కనకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.

News May 24, 2024

భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత

image

భద్రాచలంలోని <<13306910>>మారుతి నర్సింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత<<>> నెలకొంది. విద్యార్థిని కారుణ్య మృతి విషయం తెలుసుకున్న MLA తెల్లం వెంకట్రావ్ కాలేజీకి వచ్చి యజమాన్యంతో మాట్లాడారు. నిందితుల తరఫున వచ్చారా అని విద్యార్థి సంఘాలు ఆయనను నిలదీశాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. కారుణ్య కుటుంబ సభ్యులకు సర్ది చెప్పేందుకు MLA యత్నించినా వారు వినకపోవడంతో ఆయన వెనుదిరిగారు.

News May 24, 2024

నిజామాబాద్: ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్ -2024 పరీక్ష

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పాలిసెట్-2024 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్, సమన్వయకర్త ఏ.ఎన్. ఫణిరాజ్ పర్యవేక్షణలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ పరీక్ష నిర్వహించారు. 5586 మంది విద్యార్థుల నుంచి 2559 మంది బాలురు, 2402 మంది బాలికలు హాజరుకాగా మొత్తం 88.81 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.

News May 24, 2024

‘టిమ్స్’ నిర్మాణాల‌పై రాజ‌కీయాలా..?.. హ‌రీశ్‌రావు ఫైర్

image

బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన టిమ్స్ ఆస్ప‌త్రుల‌ నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి విషం చిమ్మడం బాధాకరమని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. జనాభా అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించేందుకు కేసీఆర్ ఆలోచనతో హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా వేగంగా అడుగులు వేసింద‌ని హ‌రీశ్‌రావు గుర్తుచేశారు.

News May 24, 2024

MBNR: దోస్త్ దరఖాస్తు గడువు పొడిగింపు

image

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశానికి DOST(డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) మొదటి విడత దరఖాస్తుకు ఈనెల 29 వరకు అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దోస్త్ మొదటి విడత సీట్ అలాట్మెంట్ JUNE 6న ప్రకటించనున్నారు. వివరాలకు dost.cgg.gov.in లాగిన్ కావచ్చు
#SHARE IT.

News May 24, 2024

MBNR: గుర్తు తెలియని మహిళ హత్య

image

దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ పురపాలక పరిధిలోని అమిస్తాపూర్ శివారులోని సాక్షి గణపతి దేవాలయ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ శవం కలకలం రేపింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు శవాన్ని గమనించి అమిస్తాపూర్ ప్రాంత ప్రజలకు తెలపగా వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బండరాయితో మెది హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

News May 24, 2024

ఖమ్మం: ప్రచార పర్వానికి రేపటితో తెర

image

ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వీరందరూ శుక్రవారం వరకు ఓటు వేసే అవకాశం ఉంది. ప్రచార పర్వానికి శనివారం సాయంత్రానికి తెరపడనుంది. సోమవారం ఉదయం 7నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఖమ్మం జిల్లాలో 118, భద్రాద్రిలో 55 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

News May 24, 2024

వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో శుక్రవారం తేజ మిర్చి నాన్ ఏసీ క్వింటా రూ.17,200 పలికింది. అలాగే ఏసీ తేజ మిర్చి రూ.19,000 ధర, 341 రకం ఏసీ మిర్చికి రూ.17,000 ధర రాగా.. వండర్ హాట్ ఏసీ మిర్చికి సైతం రూ.18,500 ధర వచ్చింది. కాగా నిన్నటితో పోలిస్తే ఈరోజు అన్ని రకాల మిర్చి ధరలు భారీగా తగ్గాయి. దీంతో రైతన్నలు కొంత నిరాశ చెందుతున్నారు.