Telangana

News April 7, 2025

NZB: ఖిల్లా రామాలయంలో ట్రాన్స్ జెండర్ల వివాహం

image

శ్రీరామ నవమిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో ఆదివారం నిజామాబాద్‌కు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ జంట వివాహం చేసుకున్నారు. ప్రతి ఏటా భద్రాచలం, వేములవాడ తదితర పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి వివాహాలు ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడాది తొలిసారిగా జిల్లా కేంద్రంలోని రామాలయంలో ట్రాన్స్ జెండర్లు వివాహం చేసుకున్నారు.

News April 6, 2025

మెదక్: కోదండ రామాలయంలో కలెక్టర్ పూజలు

image

మెదక్ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగదానంద కారకుడు, జగదభిరాముడి జీవితం సమాజానికి ఆదర్శమన్నారు. కోదండ రాముని ఆశీర్వాదంతో జిల్లా ప్రజలు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కలెక్టర్ కోరుకున్నట్లు వివరించారు. ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనచారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

News April 6, 2025

ఆర్మూర్: పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సందర్శించిన సీపీ

image

ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్ద 2వ పిరమిడ్ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం సందర్శించారు. ఇక్కడి పిరమిడ్ విశిష్టతను సీపీకి వివరించామని PSSM జిల్లా అధ్యక్షుడు సాయికృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సీఐ సత్యనారాయణ, PSSM సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

News April 6, 2025

HYD: ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల రక్షణ కోసం వాట్సప్ గ్రూప్

image

ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల రక్షణకు ఆర్పీఎఫ్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఏ రైలులో ఎవరు డ్యూటీలో ఉన్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మహిళా కోచ్‌లలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారనే విషయంపై దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాట్సప్లో ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

News April 6, 2025

NZB: పండుగ పూట తీవ్ర విషాదం

image

బైక్ అదుపు తప్పి కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన భీమ్‌గల్‌ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుడు బైక్‌పై మోర్తాడ్ నుంచి భీమ్‌గల్ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో జాగిర్యాల్ గ్రామ శివారులో రోడ్డుపై అకస్మాత్తుగా కిందపడిపోయాడు. ముక్కుకి తీవ్రగాయాలయ్యాయి. అధిక రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 6, 2025

భీమ్‌గల్: సీతారాముల కళ్యాణంలో PCC చీఫ్

image

భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామంలోని లొద్ది రామన్నస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ సునీల్ కుమార్ సతీమణితో కలిసి కళ్యాణ క్రతువుని కనులారా వీక్షించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

News April 6, 2025

నల్గొండ: పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ దంపతులు

image

నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి దేవాదాయ శాఖ తరఫున జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దంపతులు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. కలెక్టర్ నివాసంలో పూజలు చేసి అక్కడ నుంచి మంత్రోచ్ఛరణ, మంగళ వాయిద్యాల నడుమ నూతన పట్టు వస్త్రాలను సీతారామచంద్రస్వామి దేవస్థానానికి తీసుకువెళ్లి స్వామి వారికి సమర్పించారు.

News April 6, 2025

నల్లగొండ: కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా అరెస్టు

image

అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆదివారం నల్లగొండలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్ట్ వివరాలను మీడియాకు వివరించారు. ఐదుగురు నిందితులు అరెస్ట్ చేసి వారి నుంచి దాదాపు రూ.25 లక్షల విలువైన 600 లీటర్ల స్పిరిట్‌తో పాటు అక్రమంగా తయారు చేసిన 660 లీటర్ల కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు.

News April 6, 2025

భద్రకాళి అమ్మవారికి లిల్లీ పూలతో లక్ష పుష్పార్చన

image

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆలయ అర్చకులు అమ్మవారికి లిల్లీ పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.

News April 6, 2025

రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునః ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకు మార్కెట్‌కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

error: Content is protected !!