Telangana

News May 24, 2024

కరీంనగర్: ఆదర్శలో ప్రవేశాలకు రేపటితో ముగియనున్న గడువు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మోడల్ స్కూల్స్‌లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్లో దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఈ నెల 10 నుంచి 25 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతిలో సాధించిన జీపీఏ ఆధారంగా ఉమ్మడి జిల్లాలోని 38 మోడల్ స్కూళ్లలో గ్రూపునకు 40 మంది విద్యార్థులు చొప్పున ప్రతి పాఠశాలలో 160 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు.

News May 24, 2024

శంషాబాద్: రన్నింగ్ విమానం తలుపు తీసేందుకు యత్నం

image

గగనతలంలో విమానం తలుపు తీసేందుకు యత్నించిన వ్యక్తికి ఆర్జీఐఏ పోలీసులు 41 సీఆర్‌పీ నోటీసులు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD గాజులరామారం ప్రాంతానికి చెందిన జిమ్‌ ట్రైనర్‌ అనిల్‌ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నుంచి శంషాబాద్‌‌కు వస్తున్నాడు. ఈ క్రమంలో గగనతలంలో విమానం తలుపు తెరిచేందుకు యత్నించాడు. దీంతో భద్రతాధికారులకు ఫిర్యాదు చేయగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనిల్‌పై కేసు నమోదు చేశారు.

News May 24, 2024

నిర్మల్: విద్యుత్ తీగలు పడి బాలికకు గాయాలు

image

నిర్మల్ జిల్లాలో విషాదం. విద్యుత్ స్తంభం విరిగిపడి బాలికకు తీవ్రగాయాలైన ఘటన సారంగపూర్ మండలం కౌట్ల (బి) గ్రామంలో జరిగింది. గమనించిన స్థానికులు బాలికను నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. చెట్లు కొమ్మలు తొలగిస్తుండగా విద్యుత్ తీగలు బాలిక పై పడి ప్రమాదం జరిగనట్లు తెలిపారు.

News May 24, 2024

శంషాబాద్: రన్నింగ్ విమానం తలుపు తీసేందుకు యత్నం

image

గగనతలంలో విమానం తలుపు తీసేందుకు యత్నించిన వ్యక్తికి ఆర్జీఐఏ పోలీసులు 41 సీఆర్‌పీ నోటీసులు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD గాజులరామారం ప్రాంతానికి చెందిన జిమ్‌ ట్రైనర్‌ అనిల్‌ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నుంచి శంషాబాద్‌‌కు వస్తున్నాడు. ఈ క్రమంలో గగనతలంలో విమానం తలుపు తెరిచేందుకు యత్నించాడు. దీంతో భద్రతాధికారులకు ఫిర్యాదు చేయగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనిల్‌పై కేసు నమోదు చేశారు. 

News May 24, 2024

HYD: లింక్ క్లిక్ చేశాడు.. రూ.5.60 లక్షలు స్వాహా

image

స్టాక్ మార్కెట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.5.60 లక్షలు టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి.. స్టాక్ మార్కెట్‌లో లాభాలు వచ్చేలా పెట్టుబడి పెట్టిస్తామని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రకటన చూశాడు. లింక్‌పై క్లిక్ చేయగా ఓ టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ అయ్యాడు. మొదట కొంత పెట్టుబడి పెట్టగా..లాభాలు వచ్చాయి. దీంతో విడతలవారీగా రూ.5.60 లక్షలు పెట్టి మోసపోయి CCSలో ఫిర్యాదు చేశాడు.

HYD: MNJ దవాఖానలో 100 రోబోటిక్‌ శస్త్రచికిత్సలు పూర్తి

image

HYD లక్డీకపూల్‌లోని ఎంఎన్‌జే ప్రభుత్వ దవాఖానలో పైసా ఖర్చు లేకుండా పేద రోగులకు ఖరీదైన రోబోటిక్‌ శస్త్రచికిత్సలు చేస్తున్నామని ఎంఎన్‌జే క్యాన్సర్‌ దవాఖాన డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. దవాఖానలో 100 రోబోటిక్‌ శస్త్రచికిత్సలు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఎన్‌జేలో గత సంవత్సరం సెప్టెంబర్‌ నుంచి రోబోటిక్‌ సర్జరీలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

దేవరకొండ ఎమ్మెల్యేకి మంత్రి పదవి?

image

ఎన్నికల హడావుడి ముగియగానే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌కు మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్టీ సామాజికవర్గ నేత, సీఎం రేవంత్ రెడ్డి వర్గం కావడంతో ఆయనకు మినిస్టర్ పోస్ట్ దక్కే అవకాశం ఎక్కువ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి కోమటిరెడ్డి, ఉత్తమ్ మంత్రివర్గంలో ఉండటం తెలిసిందే.

News May 24, 2024

మణుగూరు నుంచి కోల్ కారిడార్

image

బొగ్గు గనుల ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేస్తున్న కోల్ కారిడర్ మణుగూరు నుంచి ప్రారంభం కానుంది. తాజాగా మణుగూరు – రామగుండం వరకు రైల్వే లైన్‌కు కేంద్రం పచ్చ జండా ఊపింది. ఇందుకుగాను రూ. 2,911 కోట్లు ఖర్చు చేయనుంది. మణుగూరులో ప్రారంభమయ్యే ఈ రైలు ఏటూరు నాగారం మీదుగా ములుగు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. భూపాలపల్లి నుంచి మంథని మీదుగా రామగుండం పరిధిలోని రాఘవాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.