Telangana

News May 24, 2024

BREAKING: HYD: యాక్సిడెంట్.. ముగ్గురు మృతి 

image

రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆమనగల్లు మండలం రామంతల గడ్డ సమీపంలో గల శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.   

News May 24, 2024

వడ్డేపల్లి బండ్‌కు పెనుముప్పు..!

image

HNK వడ్డేపల్లి చెరువు బండ్‌కు ముప్పు పొంచి ఉందని నీటి పారుదల శాఖ అధికారులు అంటున్నారు. ఈ వానాకాలంలో అనేక కాలనీలు జలమయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. GWMC అధికారులు వడ్డేపల్లి బండ్‌ పనులు అశాస్త్రీయంగా చేపట్టారని వారు బల్దియాకు సైతం లేఖ రాశారు.కాగా వడ్డేపల్లి చెరువు పరిస్థితి ప్రమాదకరంగా ఉందని NIT రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రభుత్వ CSకి లేఖ రాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

News May 24, 2024

NLG: ఎడ్ సెట్‌కు 331 మంది హాజరు

image

రెండు సంవత్సరాల బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిన నల్లగొండలోని ఎస్పీ ఆర్ పాఠశాల సెంటర్లో నిర్వహించిన టీఎస్ ఎడ్సెట్-2024 ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండు విడతలుగా పరీక్షలు కొనసాగాయి. ఈ పరీక్షలకు 360 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 331 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.

News May 24, 2024

KMM: ప్రయాణికులపై ట్రాన్స్‌జెండర్ల దాడి

image

ఒడిశా వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు రెచ్చిపోయారు. జనరల్ బోగిలో ఎక్కిన వారు ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో బలరాం వారు అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో అతడితో పాటు మరికొందరిపై దాడి చేశారు. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన జరగగా, సదరు యువకులు ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 24, 2024

సింగరేణిలో ఆస్ట్రేలియా సాంకేతికతపై చర్చలు

image

సింగరేణి సంస్థ రానున్న ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్య సాధనకు ఆధునిక మైనింగ్ టెక్నాలజీని వినియోగించనున్నట్లు సంస్థ C&MD బలరాం పేర్కొన్నారు. ఈ మేరకు HYD సింగరేణి భవన్‌లో మైనింగ్ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానంపై ఆస్ట్రేలియా ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ డేనిస్ ఈటెన్‌తో ప్రత్యేక సమావేశమయ్యారు. సింగరేణిలో నూతన వ్యాపార విస్తరణ చర్యల పరిశీలనకు నవంబర్‌లో ఆస్ట్రేలియా బృందం పరిశీలిస్తుందన్నారు.

News May 24, 2024

సింగరేణిలో ఆస్ట్రేలియా సాంకేతికతపై చర్చలు

image

సింగరేణి సంస్థ రానున్న ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్య సాధనకు ఆధునిక మైనింగ్ టెక్నాలజీని వినియోగించనున్నట్లు సంస్థ C&MD బలరాం పేర్కొన్నారు. ఈ మేరకు HYD సింగరేణి భవన్‌లో మైనింగ్ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానంపై ఆస్ట్రేలియా ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ డేనిస్ ఈటెన్‌తో ప్రత్యేక సమావేశమయ్యారు. సింగరేణిలో నూతన వ్యాపార విస్తరణ చర్యల పరిశీలనకు నవంబర్‌లో ఆస్ట్రేలియా బృందం పరిశీలిస్తుందన్నారు.

News May 24, 2024

నిర్మల్: నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు ఉంటాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో 3,416 మంది విద్యార్థులు, సెకండియర్‌లో 2,001 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అధికారులు పేర్కొన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుంది.

News May 24, 2024

నిజామాబాద్: నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు ఉంటాయి. 28,799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అధికారులు పేర్కొన్నారు

News May 24, 2024

కుమారుడు కొట్టాడని ఉరివేసుకున్న తల్లి

image

కుమారుడు కొట్టాడని తల్లి ఉరి వేసుకున్న ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. మోత్కూరుకు చెందిన రేఖ(38)కు కూతరు(15), కుమారుడు(17) సంతానం. కుమారుడు HYDలోని కార్పొరేట్ కాలేజ్‌లో చదువుతున్నాడు. ఇంటర్‌లో ఫెయిల్ అవడంతో చెడు వ్యసనాలు మాని బాగా చదువుకోవాలని తల్లి కుమారుడిని మందలించింది. దీంతో కుమారుడు కోపోద్రేకుడై తల్లిపై చేయి చేసుకున్నాడు. మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

News May 24, 2024

MBNR: నేడు పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష

image

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఈ నెల 24న పాలిసెట్-2024 నిర్వహిస్తోంది. ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా 10,470 మంది విద్యార్థులకు 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.11 నుంచి మ.1.30 గంటల వరకు జరగనున్న పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.