Telangana

News May 24, 2024

5 నుంచి బీఈడీ, ఎంఈడీ పరీక్షలు ప్రారంభం

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ, ఎంఈడీ ప్రథమ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, బ్యాక్ లాగ్) జూన్ 5 నుంచి, ఎంఈడీ థర్డ్ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6 నుంచి ప్రారంభమవుతున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. అలాగే LLB, ఎల్ఎల్ఎం ప్రథమ సెమిస్టర్ పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు.

News May 24, 2024

MDK: గాలివాన బీభత్సం 

image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. గాలివాన బీభత్సం సృష్టించడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఏడుపాయల సమీపంలోని పాపన్నపేట మండలం అబులాపూర్‌ గ్రామంలో సంగమేశ్ అనే వ్యక్తికి చెందిన రేకుల ఇల్లు ఈదురు గాలులకు ధ్వంసమైంది. రేకులు ఎగిరిపోయి, గోడలు కూలిపోవడంతో బాధితుడు వాపోతున్నాడు. మీ ప్రాంతంలో వర్షం పడుతుందా కామెంట్ చేయండి.

News May 24, 2024

KMM: నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు జిల్లాలో 42కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు 14,984 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 10,352మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,632 ఉన్నారు. ఫస్ట్ ఇయర్ ఉదయం 9నుంచి మధ్యహ్నం 12గంటల వరకు సెకండ్ ఇయర్ మధ్యహ్నం 2:30 నుంచి 5:30వరకు నిర్వహిస్తారు. జూన్1న పరీక్షలు ముగియనున్నాయి.

News May 24, 2024

NLG: నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లాలో మొత్తం 12,000 మంది పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జూన్ 1న పరీక్షలు ముగియనున్నాయి.

News May 24, 2024

MBNR: నిజాయతీని చాటుకున్న కండక్టర్

image

కొత్తకోటకు చెందిన ఫాతిమా బేగం MBNR బస్టాండులో బస్సు ఎక్కి ఆరు తులాల బంగారం నగలు గల బ్యాగును బస్సులో మరిచిపోయి జడ్చర్ల బస్టాండులో దిగిపోయింది. ఆ బ్యాగును తీసుకున్న కండక్టర్ ఫర్జానా డిపోలో అప్పగించింది. బ్యాగును కల్వకుర్తి డిపో మేనేజర్ సుభాషిణి సమక్షంలో సదరు ప్రయాణికురాలికి అప్పగించారు. దీంతో నిజాయితీ చాటుకున్న కండక్టర్, డ్రైవర్ కృష్ణ నాయక్‌ను అధికారులు, తోటి ఉద్యోగులు అభినందించారు.

News May 24, 2024

HYD: మైనర్లకు వాహనాలు ఇస్తే జైలుకే..!

image

మైనర్లు వాహనాలు నడుపుతూ ఇటీవల తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. తద్వారా వారితో పాటు ఇతరుల ప్రాణాలు సైతం పోతున్నాయి. HYD, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు తల్లిదండ్రులకు, మైనర్లకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంకా మార్పు రావడం లేదు. 18 ఏళ్లు నిండి, లైసెన్స్ పొందిన తర్వాతే బండ్లు నడపాలన్నారు. లేదంటే వాటిని ఇచ్చిన తల్లిదండ్రులు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుని, జైలుకు పంపుతామని హెచ్చరించారు. SHARE IT

News May 24, 2024

HYD: మైనర్లకు వాహనాలు ఇస్తే జైలుకే..!

image

మైనర్లు వాహనాలు నడుపుతూ ఇటీవల తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. తద్వారా వారితో పాటు ఇతరుల ప్రాణాలు సైతం పోతున్నాయి. HYD, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు తల్లిదండ్రులకు, మైనర్లకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంకా మార్పు రావడం లేదు. 18 ఏళ్లు నిండి, లైసెన్స్ పొందిన తర్వాతే బండ్లు నడపాలన్నారు. లేదంటే వాటిని ఇచ్చిన తల్లిదండ్రులు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుని, జైలుకు పంపుతామని హెచ్చరించారు. SHARE IT

News May 24, 2024

వరంగల్: నేడు పాలిసెట్.. 5,624 మంది విద్యార్థులు

image

వరంగల్ జిల్లాలో నేడు పాలిసెట్ పరీక్ష జరగనుంది. ఉ.11 గంటలకు ఎగ్జామ్ ప్రారంభమై మ.1.30 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 12 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. గంట ముందు నుంచే అనుమతి ఉంటుంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ ఉండదు. విద్యార్థులు HB బ్లాక్ పెన్సిల్, ఎరేజర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ త‌ప్ప‌నిస‌రిగా తీసుకెళ్లాలి. పరీక్షకు జిల్లా నుంచి 5,624 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

News May 24, 2024

కరీంనగర్: నేడు పాలిసెట్.. 3,766 మంది విద్యార్థులు

image

కరీంనగర్ జిల్లాలో నేడు పాలిసెట్ పరీక్ష జరగనుంది. ఉ.11 గంటలకు ఎగ్జామ్ ప్రారంభమై మ.1.30 గంటల వరకు కొనసాగుతుంది. 9 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. గంట ముందు నుంచే అనుమతి ఉంటుంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ ఉండదు. విద్యార్థులు హెచ్‌బీ బ్లాక్ పెన్సిల్, ఎరేజర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ త‌ప్ప‌నిస‌రిగా తీసుకెళ్లాలి. పరీక్షకు జిల్లా నుంచి 3,766 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

News May 24, 2024

మెదక్: వృద్ధుడి మృతిపై అనుమానాలు.. రూ.15 లక్షల సుఫారీ..?

image

మెదక్ జిల్లా శివంపేట మండలం పోతులబోగూడా గ్రామంలో ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన పోచయ్య ది హత్యగా బంధువులు అనుమానిస్తున్నారు. భూ తగాదాల నేపథ్యంలో కొందరు వ్యక్తులు రూ.15 లక్షల సుఫారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోచయ్య బంధువులు పోర్కొంటూ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.