Telangana

News May 24, 2024

వరంగల్: స్ట్రాంగ్ రూమ్ భద్రతను ఆకస్మిక తనిఖీ చేసిన వరంగల్ సీపీ

image

ఇటీవల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎనుమాముల మార్కెట్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల కు ఏర్పాటు చేసిన మూడు అంచెల భద్రతను సీపీ అంబర్ కిషోర్ ఝా గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్ర బలగాలు మరియు స్థానిక పోలీసులు నిర్వహిస్తున్న విధులపై సీపీ క్షేత్రస్థాయిలో పరిశీలించడంతోపాటు స్ట్రాంగ్ రూమ్‌లు మరింత భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ అధికారులకు సూచించారు

News May 24, 2024

సంగారెడ్డి: ‘ఈనెల 31లోగా ఫ్యామిలీ సర్వే పూర్తి చేయాలి’

image

ఈనెల 31 వరకు ఫ్యామిలీ సర్వే పూర్తి చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరుణ అన్నారు. సంగారెడ్డి జిల్లా అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించి మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలు, 0 నుంచి 6 సంవత్సరాలకు పిల్లల వివరాలను సేకరించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, సిడిపివోలు పాల్గొన్నారు.

News May 24, 2024

సంగారెడ్డి: ‘ఎరువుల కొరత లేకుండా చూడాలి’

image

జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల సహకారంతో విత్తన దుకాణాలు తనిఖీలు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, అధికారులు పాల్గొన్నారు.

News May 24, 2024

MDK: ప్రతి గింజ కొనే వరకు కొనుగోలు కేంద్రాలు

image

ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసే వరకు దాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంటాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. కొల్చారం మండలం వరిగుంతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు.
వరిగుంతం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుదిదశలో ఉన్నందున త్వరితగతిన ధాన్యాన్ని కొనుగోలు పూర్తి చేసి మిల్లుకు తరలించాలని నిర్వహకులను ఆదేశించారు.

News May 24, 2024

ఫసల్ బీమా రైతులకు ఎంతో మేలు: కలెక్టర్ రవి నాయక్

image

ఫసల్ బీమా యోజన పథకం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ రవినాయక్ అన్నారు. గురువారం పీఎం ఫసల్ బీమా యోజన పథకంపై మహబూబ్ నగర్ కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంటనష్టం జరిగినప్పుడు బీమా రైతులకు రిస్క్ కవరేజ్ కల్పిస్తుందని అన్నారు.

News May 24, 2024

NZB: పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

image

పాలిసెట్- 2024కు ఏర్పాట్లు పూర్తయ్యాయని నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్, సమన్వయకర్త ఫణిరాజ్ తెలిపారు. 16 పరీక్ష కేంద్రాల్లో 5,586 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్ష ఉ. 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఉంటుందని విద్యార్థులు 10 గంటలలోపు చేరుకోవాలన్నారు. విద్యార్థులు హాల్ టికెట్లు, పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ పెన్ను తీసుకురావాలని తెలిపారు.

News May 24, 2024

560 గ్రాములతో పుట్టిన పాపకు ట్రీట్మెంట్

image

ఆదిలాబాద్‌కు చెందిన ముస్కాన్ రిజ్వాన్ దంపతులకు రెండు నెలల క్రితం 560 గ్రాములతో పాప జన్మించింది. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో.. నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రి వైద్యులు పాపకు రెండు నెలల పాటు చికిత్సలు నిర్వహించి, బరువు కిలో 465 గ్రాముల వరకు పెరిగేలా చేశారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉండడంతో బేబీని డిశ్చార్జ్ చేశారు.

News May 24, 2024

ఖమ్మం: రైస్ మిల్లును తనీఖీ చేసిన కలెక్టర్

image

సిఎంఆర్ రైస్ దిగుమతి లక్ష్యం త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ అన్నారు. నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని అరుణాచల శివ రైస్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్ ని క్షేత్ర స్థాయిలో కలెక్టర్ తనిఖీలు చేశారు. మిల్లు సామర్థ్యం, రోజుకు ఎంత మేర ధాన్యం పట్టేది, ఎంత ధాన్యం నిల్వ ఉన్నవి, హమాలీలు ఎంత మంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్ లో వచ్చే పంటపై వివరాలు సేకరించారు.

News May 24, 2024

WGL: ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్ ఏర్పాట్లు : రిటర్నింగ్ అధికారి

image

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేయాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి ప్రావీణ్య ఆదేశించారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుపనున్న దృష్ట్యా గురువారం కలెక్టరేట్‌లో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశమై ఎన్నికల సంఘం నిబంధనల కచ్చితంగా పాటించాలన్నారు.

News May 24, 2024

NLG : 48 గంటల ముందు నుంచే వీటిపై నిషేధం: కలెక్టర్

image

NLG -KMM- WGL శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికలో భాగంగా పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి బహిరంగ సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహించడం నిషేధమని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. ఈ ఉపఎన్నికకు ఈనెల 27న ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.