Telangana

News May 23, 2024

BSWD: మహిళ మృతదేహం వివరాలను గుర్తించిన పోలీసులు

image

బాన్సువాడ మండలంలోని కృష్ణా నగర్ తండా అటవీ ప్రాంతంలో గురువారం లభ్యమైన గుర్తు తెలియని మహిళ (35) వివరాలను పోలీసులు గుర్తించారు. మృతురాలిని గాంధారి మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన వారాంతపు సంతలో కూరగాయలు అమ్మే లక్ష్మీగా గుర్తించారు. వారం క్రితం బాన్సువాడ వెళ్లి తిరిగి రాకపోవడంతో గాంధారి పోలీసు స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కాగా సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ సింధూ శర్మ పరిశీలించారు.

News May 23, 2024

ADB: పర్స్ కొట్టేసిన మహిళా దొంగ.. అరెస్టు

image

ఆదిలాబాద్ RTC బస్ స్టాండ్ నుంచి గురువారం బేల వెళ్ళటానికి సయ్యద్ అనే వ్యక్తి బస్సు ఎక్కుతుండగా ఒక మహిళ ఆయన పర్సును దొంగిలించింది. ఈ క్రమంలో ఆమె పారిపోతుండగా అక్కడున్న టూటౌన్ పోలీసులు ఆమెను పట్టుకొని పర్సును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం టౌన్‌లో కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు CI అశోక్ తెలిపారు. SI లాల్ సింగ్ నాయక్, సిబ్బంది గంగకుమారి, రజిత, నరేష్, రమేష్, క్రాంతి, నరేందర్ ఉన్నారు.

News May 23, 2024

ఫారుక్‌నగర్: బొలెరో ఢీకొని యువతి దుర్మరణం

image

ఫారుక్‌నగర్ మండలం అన్నారం తండాలో గురువారం విషాదం నెలకొంది. ఇంటి ముందు నిలబడి ఉన్న యువతిని బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో వాహనాన్ని మైనర్ నడిపినట్లు సమాచారం. ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 23, 2024

BSWD: అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం

image

బాన్సువాడ మండలంలోని కృష్ణా నగర్ తండా అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ (35) మృతదేహం లభ్యమైనట్లు బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మృతురాలు ఒంటిపై గులాబీ రంగు చీర, బంగారు రంగు జాకెట్ ధరించి ఉందని, నలుపు రంగు స్కార్ఫ్ కూడా ఉన్నట్లు సీఐ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా మృతురాలి ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని ఆయన సూచించారు.

News May 23, 2024

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భద్రాద్రి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పారామెడికల్ విద్యార్థిని మృతి చెందింది. దీంతో మృతిరాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 23, 2024

ALP: అలంపూర్ ఆలయాల్లో చండీ హోమం..!

image

అలంపూర్ పట్టణంలో వెలసిన బాల బ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ దేవి ఆలయాల ప్రాంగణంలో బుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని గురువారం వేద పండితులు చండీ హోమం నిర్వహించారు. హోమంలో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన 114 మంది భక్తులు పాల్గొన్నారు. దీంతో ఆలయాల ప్రాంగణంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో పురందర్ కుమార్ తెలిపారు.

News May 23, 2024

నవీపేట్ మండలంలో పేలిన సెల్ ఫోన్

image

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని ఫకీరాబాద్ గ్రామంలో సెల్ ఫోన్ పేలింది. కొమ్మొల్ల యోగేష్ కు చెందిన మెుబైల్ సెల్‌ఫోన్ పేలడంతో భయభ్రాంతులకు లోనయ్యారు. మంటలు రావటంతో అతని కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. అనంతరం మంటలను ఆర్పివేశారు. ఎవరికి ఎలాంటి హని జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News May 23, 2024

5ఏళ్లు రేవంత్ రెడ్డే CM: జగ్గారెడ్డి

image

5ఏళ్లు రేవంత్ రెడ్డే CMగా ఉంటారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘మంత్రి ఉత్తమ్‌పై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదు. ఉత్తం వైట్ పేపర్ లాంటివారు. ఆయనపై ఇంక్ చల్లకండి. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం, మంత్రులు చెప్పారు. అయినా అధికార పార్టీపై ప్రతిపక్షాలు బురదజల్లడం సహజమే’ అని జగ్గారెడ్డిని అన్నారు.

News May 23, 2024

SRPT:పోస్టల్ బ్యాలెట్ కు రేపే చివరి రోజు: కలెక్టర్

image

MLC ఉపఎన్నిక నేపథ్యంలో పోలింగ్ రోజు విధులు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఉద్యోగులు కోసం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ వెంకట్రావు,ఆదనపు కలెక్టర్ ప్రియాంకతో కలసి గురువారం సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 182 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని తెలిపారు. రేపే చివరి రోజు అని తెలిపారు.

News May 23, 2024

VKB జిల్లాలోని రైతులకు పలు సూచనలు!

image

✓ తీరా వర్షాలు కురిసే సమయం వరకు దుక్కులు దున్నకుండా ఉండొద్దు.
✓వేసవిలోనే దుక్కి సిద్ధం చేయడం మంచిది
✓విత్తనం వేసే నెలరోజుల ముందుగానే దుక్కి సిద్ధం చేసుకోండి
✓వేసవి దుక్కులు లోతుగా చేయడం వల్ల, ఎండ వేడికి పలు రకాల చీడపీడ పురుగులు చచ్చిపోతాయి
✓ మొలకెత్తి మొలకల శాతం పెరుగుతుంది
✓ మొలిచిన మొలకలు ఆరోగ్యంగా ఎదుగుతాయి
•పై సూచనలు పాటించాలని AO సూర్య ప్రకాష్ తెలిపారు.