Telangana

News September 15, 2024

MBNR: రైతుకు’భరోసా’వచ్చేనా?

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వేలాది వ్యవసాయేతర భూములకు గతంలో రైతుబంధు పథకం ద్వారా పలువురు రూ.కోట్లు అందుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా కేవలం సాగు పొలాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో రైతులకు రాష్ట్ర సర్కారు రైతు భరోసా ద్వారా తీపికబురు చెప్పేందుకు కార్యచరణ పూర్తి చేసే పనిలో నిమగ్నమయింది.

News September 15, 2024

HYDలో రాపిడో రైడర్‌ దారుణహత్య

image

HYD బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి పంచశీలకాలనీ సమీపంలో కొత్తగూడెంకు చెందిన దినేశ్ దారుణహత్యకు గురయ్యాడు. నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు. మృతుడు రాపిడో బైక్ రైడర్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 15, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు తప్పని నిరీక్షణ!

image

కొత్త రేషన్‌కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా మోక్షం కలగడం లేదు. తొమ్మిదేళ్ల క్రితం నిలిచిపోయిన రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ నేటికీ పునరుద్ధరించుకోలేదు. ఆహార భద్రతతో పాటు సంక్షేమ పథకాలకు ఈ కార్డే కీలకం కావడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మంది ప్రభుత్వం రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తోందని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

News September 15, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలు..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా జానంపేటలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణ లో 35.7 డిగ్రీలు, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 35.6 డిగ్రీలు, వనపర్తి జిల్లా వీపనగండ్లలో 31.9 డిగ్రీలు, నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్‌లో 29.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News September 15, 2024

MBNR: దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, ఎమ్మెల్యేలు

image

దేవరకద్ర ఎమ్మెల్యే గవినుల మధుసూదన్ రెడ్డి తండ్రి గవినుల కృష్ణారెడ్డి దశదిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి‌తో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News September 15, 2024

మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డిని పరామర్శించిన: కేటీఆర్

image

నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం వారి స్వగ్రామానికి వెళ్లి నాగం జనార్దన్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News September 15, 2024

అమీన్ పూర్: ఆన్ లైన్ టాస్క్‌ పేరుతో రూ.4.6 లక్షల స్వాహా

image

ఉద్యోగం చేసుకుంటూ ఆన్ లైన్ ఇచ్చే టాస్క్‌లో పూర్తి చేస్తే కమిషన్ వస్తుందంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి సైబర్ మోసగాడు రూ.4.6 లక్షల కాజేశాడు. సిఐ నాగరాజు కథనం ప్రకారం.. కృష్ణారెడ్డి పేటలో నివాసం ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు మార్చి 18న మెసేజ్ వచ్చింది. ఆన్‌లైన్‌లో నగదు చెల్లిస్తే టాస్కులు ఇస్తామని ఆశ చూపారు. దఫా దఫాలుగా డబ్బులు చెల్లించాడు. కమిషన్ రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 15, 2024

ADB: రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో మెరిసిన ఉమ్మడి జిల్లా జట్టు

image

హనుమకొండ పట్టణంలోని JNSస్టేడియంలో 2రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు గోల్డ్ మెడల్ సాదించినట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్యాంసుందర్ రావు, కనపర్తి రమేశ్ తెలిపారు. ఆదివారం ఫైనల్స్‌లో మహబూబ్ నగర్ జట్టుతో తలపడి గెలుపొందినట్లు తెలిపారు. క్రీడాకారులు, కోచ్ సునార్కర్ అరవింద్‌ను పలువురు అభినందించారు.

News September 15, 2024

ఖమ్మం: దేవాలయంలో ఉరి వేసుకొని యువకుడి మృతి

image

చింతకాని మండలం వందనంలోని గంగమ్మ తల్లి దేవాలయంలో ఉరి వేసుకుని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో వంశీ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. చింతకాని పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు కొనిజర్ల మండలం అనంతారానికి చెందిన యువకుడని ఎస్సై నాగుల్ మీరా తెలిపారు.

News September 15, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా సాగర్ నిండింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా 312 టీఎంపీల నీరుంది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో: 77,334 క్యూసెక్కుల నీరుంది.