Telangana

News May 23, 2024

WGL: కలెక్టర్ పేరిట నకిలీ సోషల్ మీడియా ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు.

image

వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేరిట సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉపయోగించుకుని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు యత్నిస్తున్నారు. ‘ నేను మీటింగ్‌లో ఉన్నాను. నాకు డబ్బులు కావాలంటూ’ కలెక్టర్ ఐడీతో మేసేజ్ వచ్చింది. ఇది గమనించిన కలెక్టర్ తక్షణమే పోలీసులకు ఫిర్యాదుచేశారు. తన పేరుతో వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని ఆమె ప్రజలకు సూచించారు

News May 23, 2024

వరంగల్ క‌లెక్ట‌ర్ పేరుతో ఫేక్ FACEBOOK అకౌంట్?

image

వరంగల్ క‌లెక్ట‌ర్ ప్రావీణ్య పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు FACEBOOKలో న‌కిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉప‌యోగించుకుని ప‌లువురి నుంచి డ‌బ్బు వ‌సూలు చేసేందుకు సైబ‌ర్ నేర‌గాళ్లు య‌త్నించారు. కలెక్టర్ పేరుతో ఉన్న ఐడీ ద్వారా.. తాను మీటింగ్లో ఉన్నానని, అర్జెంట్‌గా డ‌బ్బులు కావాలంటూ +94776414080 నుంచి మేసేజ్ వచ్చింది. డబ్బులు ఫోన్‌పే చేసి, స్క్రీన్‌షాట్‌ షేర్‌ చేయాలని సందేశంలో ఉంది. వివరాలు తెలియాల్సి ఉంది.

News May 23, 2024

ACBకి చిక్కిన చర్ల డిప్యూటీ తహశీల్దార్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం డిప్యూటీ తహశీల్దార్ భరణిబాబు ఏసీబీకి చిక్కాడు. పాసుపుస్తకం ఇచ్చేందుకు ఓ రైతును లంచం అడిగాడు. రైతు ఏసీబీకి సమాచారం అందించగా రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

News May 23, 2024

HYD: బురదలో కూర్చొని యువతి నిరసన

image

HYD ఎల్బీనగర్ పరిధి నాగోల్-ఆనంద్ నగర్ రోడ్డుపై ఉన్న బురదలో ఓ యువతి కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రోడ్లు మొత్తం గుంతలమయంగా మారి, వర్షం నీరు చేరి అవస్థలు పడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుంతల్లో పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని మండిపడ్డారు. గ్రేటర్ HYDలో అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉందని, ఇప్పటికైనా GHMC యంత్రాంగం స్పందించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి పెద్ద సిపాయి అనుకున్నా.. కానీ అంతా ఉత్తదే: ఈటల

image

సర్వేలను తలదన్నేలా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఉంటాయని ఈటల రాజేందర్ అన్నారు. నేడు దేవరకొండలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ‘రేవంత్ రెడ్డి పెద్ద సిపాయి అనుకున్నా.. కానీ అంతా ఉత్తదే, పదేళ్లలో మోదీ ప్రభుత్వంపై ఒక్క స్కామ్ ఆరోపణరాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లోనే ప్రజలతో ఛీకొట్టించుకుంది’ అని అన్నారు. ఈసారి బీజేపీకి 400 సీట్లు వస్తాయని ప్రజలే అంటున్నారని పేర్కొన్నారు.

News May 23, 2024

NZB: నిఖత్ జరీన్‌కు సన్మానం

image

ఇటీవల కజకిస్థాన్‌లో జరిగిన ఎలోర్డా పోటీల్లో 52 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతగా నిలిచి బంగారు పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్.. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్‌ను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కమిషనర్ శాలువాతో సత్కరించారు. దేశ గౌరవం విశ్వ వ్యాప్తం చేసేలా మున్ముందు మరింత రాణించాలని కమిషనర్ కోరారు.

News May 23, 2024

ఏడాదిలో రెండు ఓపెన్ కాస్ట్ గనుల మూసివేత!

image

రానున్న ఏడాది కాలంలో సింగరేణికి సంబంధించి రెండు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులను మూసివేసే పరిస్థితి నెలకొంది. ఆయా ప్రాజెక్టులలో బొగ్గు నిక్షేపాలు పూర్తి కావడంతో మూసివేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. రామగుండం రీజియన్‌లోని OCP-1, శ్రీరాంపూర్ ప్రాంతంలోని రామకృష్ణాపూర్ ఓసీపీలో బొగ్గు నిక్షేపాలు పూర్తి కానున్నాయి. వచ్చే ఏడాది నాటికి దాదాపుగా వీటిని మూసివేసే అవకాశం ఉంది.

News May 23, 2024

HYD: GHMC నిఘా మాటలకే పరిమితం?

image

నగరంలో GHMC పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు ఈ దృశ్యాలే సాక్ష్యం. రోడ్లపై చెత్త వేసే వారిపై తమ సిబ్బంది నిఘా పెట్టి చర్యలు తీసుకుంటుందన్న హెచ్చరికలు మాటలుగానే నిలుస్తున్నాయి. ఆటోల్లో కాకుండా కాలనీలు, వీధుల్లో, సీసీ రోడ్లపై స్థానికులు ఇష్టానుసారంగా చెత్త వేస్తున్న దృశ్యాలు LBనగర్, HYT నగర్ వనస్థలిపురం, BNరెడ్డి, మన్సూరాబాద్, DSNR, UPL, GHMCలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి.