Telangana

News May 23, 2024

HYD: బురదలో కూర్చొని యువతి నిరసన

image

HYD ఎల్బీనగర్ పరిధి నాగోల్-ఆనంద్ నగర్ రోడ్డుపై ఉన్న బురదలో ఓ యువతి కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రోడ్లు మొత్తం గుంతలమయంగా మారి, వర్షం నీరు చేరి అవస్థలు పడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుంతల్లో పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని మండిపడ్డారు. గ్రేటర్ HYDలో అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉందని, ఇప్పటికైనా GHMC యంత్రాంగం స్పందించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి పెద్ద సిపాయి అనుకున్నా.. కానీ అంతా ఉత్తదే: ఈటల

image

సర్వేలను తలదన్నేలా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఉంటాయని ఈటల రాజేందర్ అన్నారు. నేడు దేవరకొండలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ‘రేవంత్ రెడ్డి పెద్ద సిపాయి అనుకున్నా.. కానీ అంతా ఉత్తదే, పదేళ్లలో మోదీ ప్రభుత్వంపై ఒక్క స్కామ్ ఆరోపణరాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లోనే ప్రజలతో ఛీకొట్టించుకుంది’ అని అన్నారు. ఈసారి బీజేపీకి 400 సీట్లు వస్తాయని ప్రజలే అంటున్నారని పేర్కొన్నారు.

News May 23, 2024

NZB: నిఖత్ జరీన్‌కు సన్మానం

image

ఇటీవల కజకిస్థాన్‌లో జరిగిన ఎలోర్డా పోటీల్లో 52 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతగా నిలిచి బంగారు పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్.. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్‌ను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కమిషనర్ శాలువాతో సత్కరించారు. దేశ గౌరవం విశ్వ వ్యాప్తం చేసేలా మున్ముందు మరింత రాణించాలని కమిషనర్ కోరారు.

News May 23, 2024

ఏడాదిలో రెండు ఓపెన్ కాస్ట్ గనుల మూసివేత!

image

రానున్న ఏడాది కాలంలో సింగరేణికి సంబంధించి రెండు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులను మూసివేసే పరిస్థితి నెలకొంది. ఆయా ప్రాజెక్టులలో బొగ్గు నిక్షేపాలు పూర్తి కావడంతో మూసివేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. రామగుండం రీజియన్‌లోని OCP-1, శ్రీరాంపూర్ ప్రాంతంలోని రామకృష్ణాపూర్ ఓసీపీలో బొగ్గు నిక్షేపాలు పూర్తి కానున్నాయి. వచ్చే ఏడాది నాటికి దాదాపుగా వీటిని మూసివేసే అవకాశం ఉంది.

News May 23, 2024

HYD: GHMC నిఘా మాటలకే పరిమితం?

image

నగరంలో GHMC పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు ఈ దృశ్యాలే సాక్ష్యం. రోడ్లపై చెత్త వేసే వారిపై తమ సిబ్బంది నిఘా పెట్టి చర్యలు తీసుకుంటుందన్న హెచ్చరికలు మాటలుగానే నిలుస్తున్నాయి. ఆటోల్లో కాకుండా కాలనీలు, వీధుల్లో, సీసీ రోడ్లపై స్థానికులు ఇష్టానుసారంగా చెత్త వేస్తున్న దృశ్యాలు LBనగర్, HYT నగర్ వనస్థలిపురం, BNరెడ్డి, మన్సూరాబాద్, DSNR, UPL, GHMCలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి.

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి నాన్ ఏసీ క్వింటా రూ.18,200 ధర, ఏసీ తేజ మిర్చి రూ.20,000 ధర పలికింది. అలాగే 341 రకం ఏసీ మిర్చికి రూ.17,000 ధర రాగా.. వండర్ హాట్ ఏసీ మిర్చికి సైతం రూ.18,500 ధర వచ్చింది. టమాటా రకం మిర్చి ఏసీ క్వింటాకు రూ.30 వేల ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు.

News May 23, 2024

మెదక్: అదృశ్యమైన వ్యక్తి.. పొలంలో మృతి

image

మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సయ్యద్ మౌలానా బాష(60) అనే వృద్ధుడు బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు. ఈరోజు వ్యవసాయ బావిలో పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మౌలానా ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.

News May 23, 2024

ఖమ్మం: ఆస్తి కోసం తండ్రిని చంపిన కూతురు..!

image

ఆస్తి కోసం కన్న కూతురే తండ్రిని చంపిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో చోటుచేసుకుంది. గోరిలపాడుతండాకు చెందిన తేజవత్ బిచ్చు(60)కు కూతురు సక్కుకు ఆస్తి పంపకాల నేపథ్యంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో సక్కు, మనుమరాలు నగ్మ కలిసి అతడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.