Telangana

News May 23, 2024

ఖమ్మం: జిల్లాకు ముగ్గురు ఏఎంవీఐలు

image

ఖమ్మం జిల్లాకు కొత్తగా ముగ్గురు ఏఎంవీఐ (అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్)లను కేటాయిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో స్వర్ణలతను ఖమ్మంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి, కల్లూరు చెక్ పోస్ట్‌కు సాయిచరణ్, విజయశాంతిని కేటాయించగా గురువారం వారు విధుల్లో చేరారు. అయితే, వీరి కేటాయింపు తాత్కాలికమేనని ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం నియమించిందని రవాణా శాఖ వర్గాల ద్వారా తెలిసింది.

News May 23, 2024

WGL: దగ్గర పడుతున్న గడువు.. ఊపందుకున్న ప్రచారం

image

NLG-KMM-WGL పట్టభద్రుల MLC ఉప ఎన్నికల ప్రచార గడువు శనివారంతో ముగియనుంది. దీంతో BRS, BJP, INC పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అన్ని పార్టీల్లోని రాష్ట్ర స్థాయి నేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతు కూడగడుతున్నారు. ఈ ఎన్నికకు సోమవారం పోలింగ్ జరగనుంది. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సైతం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

News May 23, 2024

నల్లగొండ: సీసీటీవీ సర్వీసింగ్, రిపేర్‌లో ఉచిత శిక్షణ

image

నల్లగొండ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నందు గ్రామీణ ప్రాంత పురుషులకు సీసీటీవీ సర్వీసింగ్, రిపేర్స్‌లో ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి తెలిపారు. శిక్షణలో చేరుటకు చివరి తేదీ మే 24 అని, ఆసక్తి గలవారు సంస్థ కార్యాలయంలో లేదా 9701009265 ఫోన్ నంబర్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు ఉమ్మడి నల్గొండ జిల్లా(నల్గొండ, సూర్యపేట, భువనగిరి)కు చెందిన వారై ఉండాలన్నారు.

News May 23, 2024

HYD: నిఖత్ జరీన్‌కు సన్మానం

image

ఇటీవల కజకిస్థాన్‌లో జరిగిన ఎలోర్డా పోటీల్లో 52 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతగా నిలిచి బంగారు పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్.. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్‌ను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కమిషనర్ శాలువాతో సత్కరించారు. దేశ గౌరవం విశ్వ వ్యాప్తం చేసేలా మున్ముందు మరింత రాణించాలని కమిషనర్ కోరారు.

HYD: మందుబాబులకు నిల్వ చేసిన చికెన్ అమ్ముతున్నారు!

image

HYD, ఉమ్మడి RRలో కల్తీ, పాడైన ఆహార పదార్థాల అమ్మకాల ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. నగరంలోని పలు బార్లు, వైన్స్‌ల వద్ద తనిఖీలు చేసిన అధికారులు.. చికెన్‌ను నిల్వ చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. పాడైన సరే చికెన్‌ను అలాగే వండి ఇస్తున్నారని తెలిపారు. తాజాగా సోమాజిగూడలోని హెడ్ క్వార్టర్స్ రెస్ట్-ఓ-బార్‌లో అధికారులు తనిఖీ చేసి ఫ్రిడ్జిలో కొన్ని రోజుల నుంచి నిల్వ చేసి ఉన్న చికెన్, మటన్‌ను గుర్తించారు.

వరంగల్: తరలివచ్చిన పత్తి.. పెరిగిన ధర

image

నిన్న ఎండ తీవ్రత నేపథ్యంలో వరంగల్ ఎనుమాముల మార్కెట్ బంద్ ఉండగా.. ఈరోజు ప్రారంభమవడంతో నేడు పత్తి తరలివచ్చింది. గత రెండు రోజులతో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,040, మంగళవారం రూ.7,070 పలికాయి. ఈరోజు మరింత పెరిగి రూ.7,210 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

News May 23, 2024

HYD: మహిళా ఉద్యోగినులపై ఎస్ఎఫ్ఏ లైంగిక దాడి

image

HYD గాజులరామారం GHMC సర్కిల్ ఎస్ఎఫ్ఏ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) కిషన్ రాసలీలలు కలకలం రేపుతున్నాయి. బాధితులు తెలిపిన వివరాలు.. మహిళా శానిటేషన్ సిబ్బందిని భయపెట్టి లైంగిక దాడి చేసి ఆ వీడియోలు, ఫొటోలు తీసి కిషన్ బెదిరింపులకు పాల్పడ్డాడు. మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తూ మహిళా ఉద్యోగులను హింసించాడు.పరిస్థితి విషమించడంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.