Telangana

News May 23, 2024

HYD: మహిళా ఉద్యోగినులపై ఎస్ఎఫ్ఏ లైంగిక దాడి

image

HYD గాజులరామారం GHMC సర్కిల్ ఎస్ఎఫ్ఏ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) కిషన్ రాసలీలలు కలకలం రేపుతున్నాయి. బాధితులు తెలిపిన వివరాలు.. మహిళా శానిటేషన్ సిబ్బందిని భయపెట్టి లైంగిక దాడి చేసి ఆ వీడియోలు, ఫొటోలు తీసి కిషన్ బెదిరింపులకు పాల్పడ్డాడు. మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తూ మహిళా ఉద్యోగులను హింసించాడు.పరిస్థితి విషమించడంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

News May 23, 2024

మాడుగుల: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

మాడుగుల మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సాయి మంగళవారం ఈత కొట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. పోలీసులు గ్రామస్థుల సహకారంతో మూడు మోటార్లను బిగించి నీటిని తోడిన తగ్గలేదు. చివరికి ఫైర్ సిబ్బందితో బావిలో గాలించి డెడ్ బాడీని ఈరోజు బయటకి తీశారు. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

News May 23, 2024

సంగారెడ్డి: రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

జిల్లాలో ఈనెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి తెలిపారు. గురువారం సంగారెడ్డిలోని కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 14, 886 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారని చెప్పారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

News May 23, 2024

ఖమ్మం: యథావిధిగా నడవనున్న రైళ్లు

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొంతకాలంగా మూడో లైన్ నిర్మాణ పనులతో నిలిచిపోయిన రైళ్లు గురువారం నుంచి యథావిధిగా నడుస్తాయని ఖమ్మం రైల్వే కమర్షియల్ అధికారి ఎండీ. జాఫర్ తెలిపారు. ఖమ్మం మీదుగా వచ్చివెళ్లే శాతవాహన, గోల్కొండ, కృష్ణ, ఇంటర్ సిటీ, మచిలీపట్నం, గౌతమి తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిర్ణీత సమయంలో రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు.

News May 23, 2024

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

image

నల్గొండ జిల్లా తిప్పర్తిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిద్రమత్తులో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో భార్య మృతి చెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఉన్న ఇద్దరు పిల్లలు, కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 23, 2024

HYD: ఒక్క మెసేజ్‌తో రూ.11.20 లక్షలు స్వాహా

image

స్టాక్ మార్కెట్‌లో లాభాలిస్తామని ఓ గృహిణి నుంచి రూ.11.20 లక్షలను సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. HYD నారాయణగూడకు చెందిన గృహిణికి స్టాక్ మార్కెట్‌లో లాభాలు వస్తాయని ఓ మెసేజ్ వచ్చింది. దాంట్లో ఉన్న లింకును క్లిక్ చేయగా ఒక యాప్ డౌన్‌లోడ్ అయింది. దాంట్లో మొదట కొంత పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతల వారీగా రూ.11.20 లక్షలు పెట్టుబడి పెట్టగా విత్ డ్రా అవ్వలేదు. బాధితురాలు CCSలో ఫిర్యాదు చేసింది.

News May 23, 2024

HYD: ఒక్క మెసేజ్‌తో రూ.11.20 లక్షలు స్వాహా

image

స్టాక్ మార్కెట్‌లో లాభాలిస్తామని ఓ గృహిణి నుంచి రూ.11.20 లక్షలను సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. HYD నారాయణగూడకు చెందిన గృహిణికి స్టాక్ మార్కెట్‌లో లాభాలు వస్తాయని ఓ మెసేజ్ వచ్చింది. దాంట్లో ఉన్న లింకును క్లిక్ చేయగా ఒక యాప్ డౌన్‌లోడ్ అయింది. దాంట్లో మొదట కొంత పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతల వారీగా రూ.11.20 లక్షలు పెట్టుబడి పెట్టగా విత్ డ్రా అవ్వలేదు. బాధితురాలు CCSలో ఫిర్యాదు చేసింది.

News May 23, 2024

భద్రాద్రి జిల్లాకు కొత్త రైల్వే లైన్

image

రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఈ మేరకు 207.80 కి.మీ మేర ఈ నడవా విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా బ్రాడ్ గేజ్ నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భూ సేకరణ చేపట్టాలని SCR అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో 142 కి.మీ. దూరం తగ్గనుంది.

News May 23, 2024

కరీంనగర్: 27 నుంచి జూన్ 30 వరకు రైళ్లు రద్దు

image

మూడో లైను పనుల కారణంగా ఈనెల 27 నుంచి జూన్ 30 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. 07462/ 63 వరంగల్- సికింద్రాబాద్ పుష్ పుల్ రైలు, 17035/ 36 కాజీపేట- బల్లార్షా, 07766/ 65 కరీంనగర్- సిర్పూర్ టౌన్, 07894 కరీంనగర్ – బోధన్ రైలు వచ్చే నెల 30 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

News May 23, 2024

27 నుంచి జూన్ 30 వరకు రైళ్ల రద్దు

image

మూడో లైను పనుల కారణంగా ఈ నెల 27 నుంచి వచ్చే నెల 30 వరకు పలు రైళ్లను రద్దు చేశారు. 07462/63 వరంగల్- సికింద్రాబాద్ పుష్పల్ రైలు, 17035/36 కాజీపేట- బల్లార్షా, 07766/65 కరీంనగర్ -సిర్పూర్ టౌన్, 07894 కరీంనగర్- బోధన్ రైళ్లను వచ్చే నెల 30వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.